జియోకే దడ పుట్టిస్తున్న Rcom కొత్త ప్లాన్

Written By:

ఉచిత ఆఫర్లతో దిగ్గజాలకు దడ పుట్టిస్తున్న జియోకు దడపుట్టించేందుకు అనిల్ అంబాని ఆర్ కామ్ రెడీ అయింది. అదీ మన తెలుగు రాష్ట్రంలోని తెలుగు ప్రజలకు రిలయన్స్ కమ్యూనికేషన్ ఈ ఆఫర్ ని తీసుకొస్తోంది. అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ తో మంత్లీ ప్యాక్ ను తీసుకొచ్చింది. రూ. 149కే అన్ లిమిటెడ్ కాల్స్‌ని ప్రవేశపెట్టింది. ప్లాన్ వివరాలపై ఓ లుక్కేయండి.

జియో న్యూస్, జియో హెల్త్, జియో ఎడ్యుకేషన్..కమింగ్ సూన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న 4జీ యూజర్స్‌కు

ఈ ప్లాన్ కేవలం ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న 4జీ యూజర్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్లాన్ ప్రకారం 149 తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలీడిటీతో కూడిన అన్‌లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ వస్తుంది.

ఓ పరిమితి అంటూ లేదు

మీరు ఈ ఆఫర్‌తో లోకల్, ఎస్టీడీ, ల్యాండ్ లైన్ ఏదైనా సరే మీరు అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చు. దీనికి ఓ పరిమితి అంటూ లేదు. 28 రోజుల వ్యవధిలో మీరు అన్‌లిమిటెడ్‌గా మాట్లాడుకోవచ్చు.

300 ఎంబీతో కూడిన 4జీ డేటా

దీంతో పాటు ఫ్రీ ఇన్ కమింగ్ కాల్స్, నేషనల్ రోమింగ్ కూడా ఈ ఆఫర్‌తో లభిస్తుంది. అంతే కాకుండా మీకు 300 ఎంబీతో కూడిన 4జీ డేటా కూడా ఈ ప్లాన్ లో ఉచితంగా లభిస్తుంది. ఇది ముఖేష్ అంబాని జియో ఎంట్రీ లెవల్ ప్లాన్ తో సమానంగా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

100 ఎసెమ్మెస్ లు

ఇవే కాకుండా మీకు 100 ఎసెమ్మెస్ లు కూడా ఫ్రీగా లభిస్తాయి. అయితే రిలయన్స్ జియోలో మీకు ఈ అవకాశం లేదని కంపెనీ చెబుతోంది. జియో కేవలం అన్ లిమిటెడ్ కాల్స్ ని మాత్రమే ప్రవేశపెట్టింది.

తక్కువ ఆదాయం గల వారిని

మధ్య తరగతి యూజర్లను చేరుకోవడమే లక్ష్యంగా ఆర్ కామ్ రూ. 149 ప్లాన్ ని ప్రవేశపెట్టింది. జియోని టార్గెట్ చేస్తూ ఈ ఆఫర్ ని లాంచ్ చేసినప్పటికీ తక్కువ ఆదాయం గల వారిని చేరుకోవడానికి ఈ ఆఫర్ ని బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

4జీ ఫోన్లు సరాసరి ధర రూ. 3000

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో 4జీ ఫోన్లు సరాసరి ధర రూ. 3000గా ఉంది. ఈ బడ్జెట్లో మధ్యతరగతి వారు ఫోన్ కొనడానికి ఆసక్తి చూపకపోవచ్చని తెలుస్తోంది. ఈ నేఫథ్యంలో జియో 999కే వోల్ట్ ఫోన్లను లాంచ్ చేస్తామంటూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఆర్ కామ్ కూడా ముందు జాగ్రత్త చర్యగా

ఈ నేపథ్యంలో ఆర్ కామ్ కూడా ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్లాన్ ని లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 2జీ, 3జీ నెట్‌వర్క్ వాడుతున్న వారు ఇదే టారిప్ ఫ్లాన్లతో ముందు ముందు జియో తీసుకువచ్చే రూ. 999 ఫోన్లకు అప్ గ్రేడ్ కావచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌వాచీ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Exclusive: Rcom matches Jio’s Rs.149 unlimited calling voucher in Andhra Pradesh circle Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot