జియో న్యూస్, జియో హెల్త్, జియో ఎడ్యుకేషన్..కమింగ్ సూన్

Written By:

జియో ఇప్పుడు టెల్కోల గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తున్న ఒకే ఒక అంశం. ఉచిత ఆఫర్లతో దిగ్గజాలక చెమటలు పట్టించిన జియో ఇప్పుడు తన సేవలను మరింతగా విస్తరిస్తోంది. అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. కొత్తగా జియో నుంచి రానున్న ఫ్లాట్ పాంలపై ఓ లుక్కేయండి.

గూగుల్ కొత్త యాప్ అదిరింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ బాక్స్


జియో అతి త్వరలో ఆండ్రాయిడ్ టెలివిజన్ బాక్స్ లను రిలీజ్ చేయబోతోంది. ఈ బాక్సులు గేమింగ్ ఫీచర్ తో రానున్నట్లు సమాచారం. గేమ్ యూజర్లకు సరికొత్త అనుభూతిని అందిస్తాయని చెబుతోంది.

సినిమాలు, వీడియోల కోసం యాప్

టెలివిజన్ బాక్స్ లకు కనెక్ట్ అయ్యే విధంగా జియో ఓ యాప్ ను తీసుకురానుంది. మీ డివైస్ నుండే కంట్రోల్ చేస్తూ టీవీలో అన్ని రకాల పాటలు, ఫోటోలు, వీడియోస్, సినిమాలు వీక్షించవచ్చు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియో డ్రైవింగ్


జియో డ్రైవింగ్ యాప్ కూడా త్వరలో రానుంది. దీని ద్వారా మీరు కారును మీ మొబైల్ నుంచే కంట్రోల్ చేయవచ్చు.

జియో న్యూస్ పేపర్స్

జియో డీటీహెచ్ లాంచ్ కాగానే జియో తన తరువాత దృష్టి న్యూస్ పేపర్ మీద పెట్టనున్నట్లు తెలుస్తోంది. జియో రీడర్స్ కోసం న్యూస్ పేపర్ అలాగే మేగజైన్ కూడా తీసుకురానున్నట్లు సమాచారం.

హెల్త్ అండ్ ఎడ్యుకేషన్

హెల్త్ అలాగే ఎడ్యుకేషన్ రంగంలో కూడా జియో తనదైన ముద్ర వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు ఈ సేవలు విస్తరించేందుకు జియో ప్రణాళికలు రచిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Newspaper, Magazine, Health Store, Gaming Platform, and More Coming Soon Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot