ట్రంప్ గెలవలేదు, అమెరికా ఎన్నికల్లో హ్యాకింగ్ ?

Written By:

అమెరికా అధ్యక్ష ఎన్నికల సంధర్భంగా మూడు ప్రధాన రాష్ట్రాల్లో హ్యాకింగ్ జరిగినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఈ ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని ఇది హ్యాకింగ్ ద్వారానే సాధ్యమయిందని అక్కడి డేటా సైంటిస్టులు ఎలక్టోరల్ న్యాయవాదులు చెబుతున్నారు. ఈ ఎన్నిక చెల్లదని రీ కౌంటింగ్ జరపాలంటూ మూడు రాష్ట్రాల వారు పిలుపునిస్తున్నారు. 

ఇకపై నో మనీ ఓన్లీ కార్డు..ఏపీ బస్సుల్లో కార్డు స్వైపింగ్ ఆప్షన్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హ్యాకింగ్ ద్వారా

కొద్ది రోజుల క్రితం అమెరికాలో జరిగిన ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై రిపబ్లికన్ పార్టీ అభ్యరి డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే..అయితే ఇది నిజం కాదని హ్యాకింగ్ ద్వారా డొనాల్డ్ ట్రంప్ గెలిచారని అక్కడ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

మూడు స్వింగ్ రాష్ట్రాల్లో..

ప్రధానంగా మూడు స్వింగ్ రాష్ట్రాలైన మిచిగాన్, విస్కన్సిన్, పెన్సిల్వేనియా ఎన్నికల్లో హ్యాకింగ్ జరిగిందని, దీనికి సంబంధించి తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని ఆ దేశానికి చెందిన ప్రముఖ డేటా సైంటిస్టులు, ఎలక్టోరల్ న్యాయవాదులు చెబుతున్నారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అధ్యక్ష పదవికి అవసరమైన 270 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను

డొనాల్డ్ ట్రంప్ కు పెన్సిల్వేనియాలో 20, మిచిగాన్ లో 16, విస్కన్సిన్ లో 10 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వచ్చాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వచ్చిన ఆధిక్యంతోనే అధ్యక్ష పదవికి అవసరమైన 270 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను డొనాల్డ్ ట్రంప్ సొంతం చేసుకున్నారు.

రీ కౌంటింగ్ చేపట్టాలంటూ...

రీ కౌంటింగ్ చేపట్టాలంటూ అక్కడ పెద్ద ఎత్తున డిమాండ్ ఊపదుకుంది. ఇందుకోసం ఓ ఆన్ లైన్ ఫండ్ రైజింగ్ పేజీని ప్రారంభించి ఇప్పటికే 2 మిలియన్ డాలర్లను సేకరించారు. ఎన్నికల ఫలితాలను పునఃసమీక్షించేలా చేయడానికే నిధులు సేకరిస్తున్నట్లు చెప్పారు.

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టకముందే

ఈ రీకౌంటింగ్ కూడా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టకముందే జరగాలని హ్యాకింగ్ అయిన పార్టీల డేటాబేస్ లు, కొంతమంది ఈ మెయిల్ అకౌంట్లు అలాగే ఓటర్ల సమాచారాన్ని పరిశీలించాలని పిలుపునిస్తున్నారు.

హ్యాకింగ్ కారణంగానే

దీనిపై హిల్లరీ ప్రతినిధులు స్పందిస్తూ ఎలక్టోరల్ కాలేజ్ సిస్టమే మమ్మల్ని దెబ్బతీసిందని హ్యాకింగ్ కారణంగానే హిల్లరీ ఓడిపోయారని, ఎన్నికల్లో 70 శాతం పేపర్ బ్యాలెట్లు (బ్యాకప్ కోసం) ఉపయోగించినా వాటిని సరిగా చెక్ చేయలేదని చెబుతున్నారు.

2 మిలియన్ పాపులర్ ఓట్లను గెలుచుకున్న హిల్లరీ

ఈ ఎన్నికల హ్యాకింగ్ పై జస్టిస్ డిపార్ట్ మెంటు ద్వారా స్వతంత్ర విచారణ జరగాలని ఇందుకోసం సోషల్ మీడియాలో ఉద్యమాన్ని లేవదీయాలని పిలుపునిస్తున్నారు. 2 మిలియన్ పాపులర్ ఓట్లను గెలుచుకున్న హిల్లరీ కొద్ది తేడాతో ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే.

రీ కౌంటింగ్ కు కేవలం

అయితే రీ కౌంటింగ్ కు కేవలం శుక్రవారం నుంచి బుధవారం వరకూ మాత్రమే అవకాశం ఉంది. ఈ లోపే ఏదైనా జరగాలి. అలా జరగని పక్షంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Experts call on Clinton to challenge election results over hacking fears read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot