2070 నాటికి రోబోట్‌లతో లైంగిక సంబంధాలు

Posted By:

మానవులు రానున్న కాలంలో రోబోట్‌లతో లైంగిక సంబంధాలను ఏర్పరుచుకోగలరని టాప్ అకడమిక్ డాక్టర్ హెలిన్ డ్రిస్కాల్ అంటున్నారు. వచ్చే 50 సంవత్సాల కాలంలో అందుబాటులోకి రానున్న అడ్వాన్సుడ్ టెక్నాలజీ సహాయంతో మనుషులు, రోబోట్ లతో మరింత ఎఫెక్టివ్‌గా ఇంటరాక్ట్ కాగలుగుతారని ఈమె అంటున్నారు.

Read More: హైదరాబాద్ ఐటీ రాజధాని కానుందా..?

2070 నాటికి రోబోట్‌లతో లైంగిక సంబంధాలు

స్వభావరీత్యా ప్రకృతిలో.. ఆకర్షణ, ప్రేమ, శృంగారం అనే అంశాలు సాధారణం. ఇవి లేనిదే మనుగడ కష్టం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ అంశాల పై చర్చలను నిషేధంగా భావిస్తారు. ఈ పరిస్థితులు నెలకొనటానికి కారణం అక్కడి సంస్కృతి సంప్రాదాయాలు. లైంగిక సంపర్కం విషయంలో కనీస అవగాహన లోపించటంతో అనేక మంది సెక్స్ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు.

2070 నాటికి రోబోట్‌లతో లైంగిక సంబంధాలు

తమ వాంఛను తీర్చుకునేందుకు వక్రమార్గాలను అనుసరిస్తున్నారు. పలువురు అక్రమ సంబంధాల పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటుంటే, మరి కొందరు వ్యభిచార కూపాల్లోకి ప్రవేశించి ప్రాణాంతక సుఖ వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు.

Read More: బయటపడ్డ ఆండ్రాయిడ్‌ లొసుగులు!

సమాజాన్ని పీడిస్తున్న ఈ సమస్యను పారద్రోలే క్రమంలో సురక్షిత శృంగారం కోసం సెక్స్ బొమ్మలు (సెక్స్ టాయ్స్), సెక్స్ రోబోట్లను కనుగొన్నారు. 2070 నాటికి రోబోటిక్ సెక్స్ ప్రపంచంలో ఓ ముఖ్యమైన చర్చనీయాంశంగా మారనుందన్న విషయాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

English summary
Experts claims, Sex with robots to be 'the norm' in 50 years. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot