ఫేస్‌బుక్‌ని పరుగులు పెట్టిస్తున్న మోడీ

Written By:

టెక్నాలజీ రోసు రోజుకు దూసుకుపోతున్న తరుణంలో సోషల్ మీడియా సైట్ల వాడకం చాలా ఎక్కువైంది. టెక్ ప్రపంచంలో ఇప్పుడు సోషల్ మీడియానే రాజ్యమేలుతోంది, ప్రధానంగా ఇప్పుడు అన్ని సోషల్ మీడియా సైట్లకంటే బాగా పాపులర్ అయింది ఫేస్‌బుక్ మాత్రమై. ప్రపంచంలో అత్యధిక వినియోగదారులు ఫేస్‌బుక్ నే వాడుతున్నారు. అందులోనే విహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు ఎక్కువగా వెతుకుతున్న విషయాలు, స్థలాలపై ఫేస్‌బుక్ ఒక నివేదికను తాజాగా విడుదల చేసింది. 2015 సంవత్సరంలో యూజర్లు ఎక్కువగా సెర్చ్ చేసిన టాపిక్స్, స్థలాలను ఈ నివేదికలో తెలియజేసింది.అవేంటో చూద్దాం.

Read more: మోనాలిసా నవ్వు రహస్యం బట్టబయలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1. నరేంద్ర మోడీ

2015లో భారత్‌లోని ఫేస్‌బుక్ యూజర్లు సెర్చ్ చేసిన టాప్ టాపిక్స్

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ సారి ఫేస్‌బుక్ లో టాప్ స్థానాన్ని ఆక్రమించారు. భారత్ లో మొత్తం మీద యూజర్లు ఎక్కువగా మోడీ గురించే వెతికారని ఫేస్‌బుక్ తెలిపింది.

2. ఈ-కామర్స్ బూమ్

2015లో భారత్‌లోని ఫేస్‌బుక్ యూజర్లు సెర్చ్ చేసిన టాప్ టాపిక్స్

రెండో స్థానంలో ఈ కామర్స్ బూమ్ నిలిచింది. ఆన్ లైన్ బిజినెస్ గురించే అందరూ ఎక్కువగా వెతికారని అలాగే ఆన్ లైన్ లో ప్రొడక్ట్ల గురించి ఎక్ువగా సెర్చ్ చేశారని ఫేస్‌బుక్ తెలిపింది.

3. ఏపీజే అబ్దుల్ కలాం

2015లో భారత్‌లోని ఫేస్‌బుక్ యూజర్లు సెర్చ్ చేసిన టాప్ టాపిక్స్

భారత అణ్వస్ర్త యోధుడు అబ్దుల్ కలాం మూడవస్థానంలో నిలిచారు. కలాం తిరిగిరానిలోకాలకు పయనమవ్వడంతో ఎక్కువగా ఆయన తీపి గుర్తులను అందరూ మళ్లీ ఓ సారి నెమరేసుకున్నారు.

4. బాహుబలి: ది బిగినింగ్

2015లో భారత్‌లోని ఫేస్‌బుక్ యూజర్లు సెర్చ్ చేసిన టాప్ టాపిక్స్

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి ఈ ప్లేస్ లో అనూహ్యంగా నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది. బాహుబలి ది బిగినింగ్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా రిలీజయిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

5. నేపాల్ భూకంపాలు

2015లో భారత్‌లోని ఫేస్‌బుక్ యూజర్లు సెర్చ్ చేసిన టాప్ టాపిక్స్

ఈ మధ్య నేపాల్ నే అతలాకుతలం చేసిన భూకంపం గురించి కూడా యూజర్లు ఎక్కువగా వెతికారు.

6. సల్మాన్‌ఖాన్

2015లో భారత్‌లోని ఫేస్‌బుక్ యూజర్లు సెర్చ్ చేసిన టాప్ టాపిక్స్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఫేస్ బుక్ లో ఎక్కువగా వెతికన వారి లిస్ట్ లోకి చేరాడు. భజరంగీభాయిజాన్ తో బాక్సాఫీస్ ని పరుగులు పెట్టించిన ఈ కండలవీరుడుపై యూజర్లు చాలా అభిమానమే పెంచుకున్నారు.

7. క్రికెట్ వరల్డ్‌కప్, ఇండియన్ ప్రీమియర్ లీగ్

2015లో భారత్‌లోని ఫేస్‌బుక్ యూజర్లు సెర్చ్ చేసిన టాప్ టాపిక్స్

ఫేస్‌బుక్ లో క్రికెట్ గురించి చాలా మందే వెతికారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ పట్టుకున్నట్టుగా ప్రపంచకప్ సమయంలో అందరూ దానిమీదనే క్లిక్ చేశారు. పోస్టులు చేశారు.

8. బీహార్ ఎన్నికలు

2015లో భారత్‌లోని ఫేస్‌బుక్ యూజర్లు సెర్చ్ చేసిన టాప్ టాపిక్స్

నరేంద్రమోడీ అధికారంలోకి రావడం మరే ఇతర పార్టీలకు చోటులేకపోవడం వంటి కారణాలతో బీహార్ ఎన్నికలు ఫేస్‌బుక్ లో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ పార్టీ బిజెపి కి ఘోర పరాభవం ఎదురైంది.

9. దీపికా పదుకునే

2015లో భారత్‌లోని ఫేస్‌బుక్ యూజర్లు సెర్చ్ చేసిన టాప్ టాపిక్స్

బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకునే కూడా ఫేస్‌బుక్ యూజర్ల వెతికే వారి లిస్ట్ లో చేరింది. ఈ అమ్మడు ఈ మధ్య చేసిన ఓ షార్ట్ వీడియో సంచలనం రేపింది కూడా.

10. ఇండియన్ ఆర్మీ

10. ఇండియన్ ఆర్మీ

భారత సైన్యం కూడా ఫేస్‌బుక్ సెర్చ్ లిస్ట్ లో టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది. ఎక్కడ ఏం జరిగినా భారత ఆర్మీ రంగంలోకి దిగి అక్కడ సహయ సహకారాలు అందిస్తూ వస్తోంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write facebook 2015 year in review the most popular topics
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot