ఇండియా కోటలకు ప్రపంచమే ఫిదా

By Hazarath
|

టెక్నాలజీ రోసు రోజుకు దూసుకుపోతున్న తరుణంలో సోషల్ మీడియా సైట్ల వాడకం చాలా ఎక్కువైంది. టెక్ ప్రపంచంలో ఇప్పుడు సోషల్ మీడియానే రాజ్యమేలుతోంది, ప్రధానంగా ఇప్పుడు అన్ని సోషల్ మీడియా సైట్లకంటే బాగా పాపులర్ అయింది ఫేస్‌బుక్ మాత్రమే. అయితే ఈ ఫేస్ బుక్ యూజర్లు ఇండియాలో ఏ ప్రదేశాన్ని ఎక్కువగా సెర్చ్ చేశారు అనే అంశంపై ఆసక్తికర విషయాలు తెలిసాయి. ఇండియాలో ఫేస్ బుక్ యూజర్లు సెర్చ్ చేసిన టాప్ మోస్ట్ ప్రదేశాలేంటో చూద్దాం.

 

Read more: ఫేస్‌బుక్‌ని పరుగులు పెట్టిస్తున్న మోడీ

2015లో భారత్‌లోని ఫేస్‌బుక్ యూజర్లు సెర్చ్ చేసిన టాప్ ప్రదేశాలు..

2015లో భారత్‌లోని ఫేస్‌బుక్ యూజర్లు సెర్చ్ చేసిన టాప్ ప్రదేశాలు..

భారతదేశానికి పెట్టని కోట ఇండియా గేట్. ఇండియా యెక్క గొప్పతనమంతా అందులో ఉంటుంది. ఈ కోటే ఫేస్ బుక్ సెర్చింగ్ లో టాప్ ప్లేస్ గా నిలిచింది.

2. తాజ్‌మహల్

2. తాజ్‌మహల్

ప్రేమకు నిలయం. ఇండియాలో భగ్న ప్రేమికులు ఎక్కువ కాబోలు. అందుకే తాజ్ మహల్ అంటే అందరికీ అంత ప్రేమ.ఇండియాలోనే కాదు ప్రపంచమంతా తాజ్ మహల్ ప్రేమలో మునిగితేలుతోంది. మరి ఈ ప్రదేశం చోటు సంపాదించకుండా ఉంటుందా..

3. మెరీన్ డ్రైవ్, ముంబాయి
 

3. మెరీన్ డ్రైవ్, ముంబాయి

అరేబియా సముద్రపు కెరటాలు కొండ ఎత్తున లేచి వేగంగా వచ్చి తీరానికి కొట్టుకుని మధ్యకి విరుగుతున్నట్లుగా అక్కడ రోడ్డు ఉంటుంది. ఆ చప్పుడుకి భవనాలే కదిలిపోయేటట్టు వుంటాయి ఒక్కోసారి. మెరీన్ డ్రైవ్ మీద వెళుతూన్న కార్ల వాళ్ళకి సముద్రంవైపు చూడటానికి భయంగా వుంటుంది. కాని దాన్ని ఆస్వాదిస్తూ వెళుతుంటే ఉంటుంది అసలైన మజా.ఈ రోడ్డు సీ ఆకారంలో ఉంటుంది.ఇండియాలోనే అత్యంత సుందరమైన ప్రదేశం.

4. నంది హిల్స్

4. నంది హిల్స్

బెంగుళూరు నుంచి ఒకరోజులో వెళ్ళి చూసి రాగలిగిన పర్యాటక ప్రదేశాలలో నందిహిల్స్, మాగడి అనే ప్రదేశాలు రెండు. వీటిలో నందిహిల్స్ బెంగుళూరుకు 60 కి.మీ. దూరంలో వుంటుంది. చాలా ప్రసిధ్ధి చెందిన tourist destinations లో ఒకటి. టిప్పు సుల్తానుకు ఇది వేసవి కాలపు విడిదిగా వుండేదట! నంది దుర్గమని కూడా దీనికి పేరుందని తెలిసింది. కొండ పైనుంచి చుట్టూ scenery చూడడానికి చాలా బాగుంటుంది. పైన garden చాలా బాగుంటుంది. చాలా పురాతనమైన నృసింహస్వామివారి దేవాలయం ఇక్కడ వుంది.

5. గేట్‌వే ఆఫ్ ఇండియా

5. గేట్‌వే ఆఫ్ ఇండియా

ప్రసిద్ధి గాంచిన శిల్పకళా అద్భుతం గేట్ వే ఆఫ్ ఇండియా. 8 అంతస్తుల ఎత్తుతో ముంబై లోని కొలబాలో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీనిని హిందు మరియు ముస్లిం శిల్పశైలులుగా కలిపి నిర్మాణం చేశారు. 1911 లో ఆ నాటి రాజు సందర్శనలో గుర్తుగా దీనిని నిర్మించారు. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నిలుచుని మీరు ఒక ఫొటో తీయించుకోకపోతే మీ ముంబై ట్రిప్ వృధాగా భావించాల్సిందే. గేట్ వే ఆఫ్ ఇండియా కొలబా కాజ్ వే కు సమీపంలోనే ఉంటుంది. ఇక్కడకు దక్షిణ ముంబై లో ప్రసిద్ధి గాంచిన రెట్టరెంట్లు బడే మియాస్, కేఫే మండేగర్ మరియు కేఫే లియో పోల్డ్ కూడా సమీపంగానే ఉంటాయి.

6. హర్ కీ పౌరీ, హరిద్వార్

6. హర్ కీ పౌరీ, హరిద్వార్

హర్‌ కీ పౌరీ... ప్రముఖ పుణ్యక్షేత్రం హరిద్వార్‌ లో ఉన్న ఈ శివ ప్రతిమ ఎత్తు 30.5 మీటర్లు. గంగానది తీరంలో అద్భుతంగా మలచిన ఈ ప్ర తిమ ప్రపంచంలో నాలుగో ఎత్తయిన ప్రతిమ.

7. కుతుబ్‌మినార్

7. కుతుబ్‌మినార్

భారతదేశంలో తురుష్క సామ్రాజ్యాన్ని స్థాపించిన ఐబక్ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించగా ఆయన మరణాంతరం తరువాత వచ్చిన ఇల్ టుడ్ మిష్ ఆ నిర్మాణాన్ని పూర్తి చేయించాడు. అత్యంత సుందరంగా మనోహరంగా ఉంటుంది ఈ కట్టడం.

8. ముసోరి - ది క్వీన్ ఆఫ్ హిల్స్

8. ముసోరి - ది క్వీన్ ఆఫ్ హిల్స్

పర్యాటలకు స్వర్గధామం ఉత్తరాఖండ్ లో ఉన్న అత్యంత సుందరమైన ప్రదేశం ఈ ముస్సోరి. కొండల నడుమ మనసును ఇట్టే ఆకట్టుకుంటుంది.

9. రామోజీ ఫిలిం సిటీ

9. రామోజీ ఫిలిం సిటీ

రామోజీ పిలిం సిటి 2000 ఎకరాలలో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం ( ఫిలింసిటీ)గా పేరుగాంచినది. ఇది హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళు 7వ నెంబరు జాతీయ రహదారి ప్రక్కన హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరములో ఉంది.

10. గోల్డెన్ టెంపుల్ అమృత్‌సర్

10. గోల్డెన్ టెంపుల్ అమృత్‌సర్

గోల్డెన్ టెంపుల్ ను శ్రీ హరమందిర్ సాహిబ్ అని కూడా అంటారు. సంవత్సరం పొడవునా లక్షలాది భక్తులు దీనిని సందర్శిస్తారు. అమ్రిత్సర్ లో కల ఈ ప్రదేశం 16 వ శతాబ్దంలో అయిదవ సిక్కు గురు గురు అర్జన్ దేవ్ జి నిర్మించారు. 19 వ శతాబ్దపు మొదటి భాగంలో మహారాజ రంజిత్ సింగ్ గురుద్వారా యొక్క పై అంతస్తులను 400 కే జి ల బంగారుతో పూత వేశారు కనుక దీనిని ఇంగ్లీష్ లో గోల్డెన్ టెంపుల్ అంటారు.

Best Mobiles in India

Read more about:
English summary
Here Write facebook 2015 year in review the most top places

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X