చెన్నైలో క్షేమ సమాచారానికి ఫేస్‌బుక్ సేఫ్టీ చెక్ ఫీచర్

Written By:

కనికరం లేకుండా కరుస్తోన్న వర్షాలు, ఈ కారణంగా పొంగిపొర్లుతున్న వాగులు వంకలు వెరసి చెన్నై నగరాన్ని జల సంధ్రంలో ముంచేసాయి.

వరుణుడి దెబ్బకు అతలాకుతలమైన చెన్నైలో సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ 'సేఫ్టీ చెక్ ఫీచర్'ను యాక్టివేట్ చేసింది. గురువారం ఉదయం నుంచి ఈ టూల్ అందుబాటులోకి వచ్చింది. ఈ టూల్ ద్వారా వరద ప్రాంతంలో ఉన్న ప్రజలు తమ క్షేమ సమాచారాన్ని స్నేహితులు, కుటుంబసభ్యులకు షేర్ చేయవచ్చు.

చెన్నైలో క్షేమ సమాచారానికి ఫేస్‌బుక్ సేఫ్టీ చెక్ ఫీచర్

వరద ప్రాంతంలో సురక్షితంగా ఉన్న ఫేస్‌బుక్ యూజర్లు సేఫ్టీ చెక్ టూల్‌లోని safe బటన్ పై మార్క్ చేసి "Yes, let my friends know," అనే ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే టూల్ ఆటోమెటిక్‌గా యూజర్ క్షేమ సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో అతని ఫేస్‌బుక్ స్నేహితులు, కుటుంబ సభ్యులకు నోటిఫై చేస్తుంది.

మీ మొబైల్ నెంబర్‌ను మీ మొబైల్ ఫోన్‌లోనే తెలుసుకోవాలంటే..?

ఇటీవల కాలంలో ప్రమాదాలు సంభవించినపుడు తమ క్షేమ సమచారాన్ని ఫేస్‌బుక్ ద్వారా తెలియజేయడమనేది సర్వసాధారణంగా మారిపోయింది. వరద ప్రాంతంలో చిక్కుకున్న మీ స్నేహితులు, కుటుంబసభ్యులు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఈ సేఫ్టీ చెక్ టూల్ ఉపయోగపడుతుంది.

English summary
Facebook activates Safety Check feature in Chennai. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot