తప్పు ఎత్తి చూపిస్తే ఫేస్ బుక్ ఉద్యోగం పీకేసింది
ఫేస్ బుక్.... ఫేస్ బుక్...ఈ కంపెనీలో ఉద్యోగం కోసం రాత్రి పగలు కష్టపడి చదివే వారు ఉన్నారు కది అయితే చదివితే చదివారు కాని ముందు ఫేస్ బుక్ కంపెనీ గురించి కొన్ని నిజాలు తెలుసుకోండి. ఎవరైనా సరే ఫేస్ బుక్ కంపెనీలో ఉద్యోగం అనగానే ఎగిరి గంతేస్తారు కదా. ఇక ఆ కొత్తగా జాబ్ కోసం ప్రయత్నించే వారు ఆ కంపెనీలో ఇంటర్న్ షిప్ వస్తే చాలురా దేవుడా అని మురిసిపోతారు. కాని ఇప్పడు అది అన్ని కంపెనీల లాంటిదేనని తేలిపోయింది.అదెలాగంటారా మీరే చూడండి.
Read more : ఇండియా vs చైనా ..బస్తీ మే సవాల్

లోపాన్ని ఎత్తి చూపిన ఖన్నా
మెసేంజర్ యాప్ లో ఉన్న ఓ పెద్ద లోపాన్ని ఎత్తి చూపినందుకు భారత సంతతికి చెందిన ఓ యువ ఇంజనీర్ ఇంటర్న్ షిప్ రద్దు చేసింది. పైగా అతడు ఆషామాషి కుర్రాడు కాదు.హర్వర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చినవారు. అరన్ ఖన్నా అనే ఆ కుర్రాడు ఓ ఫ్లగిన్ రూపొందించాడు.

ఇదే లోపం
దాన్ని బట్టే ఫేస్ బుక్ మెసేంజర్ లో ఉన్న ఓ అతి పెద్ద లోపం బయటపడింది.మెసేంజర్ ద్వారా ఎవరైనా చాట్ చేస్తుంటే తాము ఎక్కడున్నామన్న విషయం ఆటోమేటిగ్గా తెలిసిపోతుంది.

ప్లేస్ ఇట్టే తెలిసిపోతుంది
దాంతో హైదరాబాద్ లో ఉండి చాట్ చేస్తూ నేను బెంగుళూరులో ఉన్నా అని చెప్పడానికి వీల్లేదు. అంటే చాట్ చేసేవాళ్ల గుట్టంతా బట్టబయటయిపోతుందన్న మాట.

80 వేల మంది యాప్ డౌన్ లోడ్
అయితే అరన్ రూపొందించిన ప్లగిన్ ఇన్ స్టాల్ చేసుకుంటే ఒక కన్వర్సేషన్ త్రెడ్ లో ఉన్న వాళ్లు ఎక్కడెక్కడ ఉన్నారన్న విషయం కూడా తెలిసిపోతుంది. అవతలి వాళ్లు ఫేస్ బుక్ లో తమకు ప్రెండ్స్ కాకపోయినా కూడా వాళ్లెక్కడున్నారో స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయం అరన్ కనిపెట్టడంతో అతడు రూపొందించిన ప్లగిన్ ను 85 వేల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

డిజాబుల్ చేయమని చెప్పిన ఫేస్ బుక్
ద గార్డియన్,డైలి మెయిల్,హఫింగ్టన్ ఫోస్టు ఇలాంటి ప్రముఖ పత్రికలన్నీ ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అయితే ఫేస్ బుక్ యాజమాన్యం వెంటనే ఆ ప్లగిన్ ను డిజాబుల్ చేయాలని చెప్పడంలో అతను డిజేబుల్ చేశాడు.

ఉద్యోగం కోల్పోయిన ఖన్నా
మీడియాతో మాట్లాడొద్దని చెప్పడంతో అలాగే చేశాడు. వారం రోజుల తర్వాత ఫేస్ బుక్ తన మెసేంజర్ యాప్ ను అప్ డేట్ చేసింది. కాని అరన్ ఖన్నా ఉద్యోగం మాత్రం పీకేసింది.

ఫేస్ బుక్ మేసేంజర్ యాప్
ఖన్నా ఉద్యోగం పీకేసిన తరువాత ఈ యాప్ ను మళ్లీ అప్ డేట్ చేసింది.
ఫేస్ బుక్ మేసేంజర్ యాప్

ఫేస్ బుక్ ఇచ్చిన బహుమానం
భారతీయుని మేథా సంపత్తకి ఫేస్ బుక్ ఇచ్చిన బహుమానం అది


Click it and Unblock the Notifications








