ఇండియా vs చైనా ..బస్తీ మే సవాల్

Written By:

రెండు పెద్ద దేశాలు సైన్స్ లో, టెక్నాలజీలో పోటీ పడితే ఎలా ఉంటుంది. పోటీ ప్రపంచంలో అవి రెండు ఒకదానికొకటి దూసుకుపోతే ఎలా ఉంటుంది. ఎవరు గెలుస్తారంటే చెప్పడం కష్టమే కదా..సరిగ్గా ఇప్పుడు అలాగే ఇండియా చైనాల మధ్య టెక్నాలజీ యుద్ధం జరుగుతోంది. అయితే ఈ రెండు దేశాలు టెక్నాలజీ రంగంలో దేనికదే పోటీ పడుతూ ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్నాయి.అయితే రెండు దేశాల మధ్య తేడా ఏంటో ఓ సారి చూద్దాం.

Read more: సిలికాన్ వ్యాలీని ఏలేస్తున్న భారతీయులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1. జనాభా

రెండు దేశాల్లో జనాభా చాలా ఎక్కువ. జనాభాలో ఇప్పటికే చైనా అగ్రబాగాన దూసుకుపోతోంది.

2. బిజినెస్

లోకల్ బిజినెస్ ను ప్రోత్సాహిస్తూ చైనా తన డెవలప్ మెంట్ ను మరింతగా ముందుకు తీసుకుపోతోంది.ఈ విషయంలో భారత్ కొంచెం వెనుకబడిందనే చెప్పాలి.

3. ఎఫ్ డీ ఐ

ఎఫ్ డీ ఐలను ఇండియా ప్రోత్సాహిస్తుంది. చైనా తన దేశ కంపెనీలను ఇండియాలో పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. మన దేశం నుంచి ఇతర దేశాల్లో ఉండే కంపెనీలు చాలా తక్కువ

4.ఐటీ సెక్టార్

ఇండియాలో ఐటీ సెక్టార్ చాలా ఎక్కువ. అలాగే మెడికల్ ,లైఫ్ స్టయిల్ ఎక్కువగా ఉంటుంది .అదే చైనాలలో అయితే ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ ఎక్కువగా దానికి ప్రిపరెన్స్ ఇస్తుంది.

5. మ్యానుఫాక్చరింగ్

చైనా చిన్న చిన్న బొమ్మల దగ్గర నుంచి అతి తక్కువ ధరకే లభించే వస్తువులను ఉత్పత్తి చేస్తూ ప్రపంచదేశాలకు ధీటుగా నిలుస్తోంది.ఇండియాలో ఇటువంటి వాటికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

6. సైన్స్ ,టెక్నాలజీ

సైన్స్ రంగంలో కూడా చైనా ఎక్కువగా ఉత్పత్తి రంగాన్నే నమ్ముకుంది. కాని ఇండియాలో మాత్రం శాస్ర్తవేత్తలు ఉన్నారు కాని సైన్స్ పరికరాలు తయారు చేసే కంపెనీలు తక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో 97 శాతం సైన్స్ పరికరాలు చైనా నుంచే సప్లయి అవుతున్నాయి.

7. ఫార్మా రంగం

ఫార్మా రంగంలో చైనా కన్న ఇండియా చాలా బెటర్ గా ఉంది. ఆ దేశంతో పోలిస్తే 60 నుంచి 70 శాతం జెనరిక్ మందులను విదేశాలకు సప్లయి చేస్తోంది.

8 లేబర్స్

చైనాలో పనిచేసే వారికి చాలా డిమాండ్ ఉంటుంది.ఎందుకంటే అక్కడ పనిచేసే వారు చాలా తక్కువ స్థాయిలో ఉంటారు.అదే ఇండియాలో పని కోసం చాలా డిమాండ్ ఉంటుంది.

9. స్పేస్

స్పేస్ రంగానికి వస్తే ఇండియా కన్నా చైనా చాలా పవర్ పుల్ బ్లాస్ట్ మిస్సైల్స్ ను రూపొందిస్తోంది. ఇండియా శాంతి యుతంగా పోతోంది.ఆటోమేటిక్ పవర్ తో యాంటి బ్లాస్టిక్ మిస్సైల్స్ ను చైనా రూపొందిస్తుంటే ఇండియా రాకెట్ లను రూపొందిస్తుంది. రెండు దేశాలు సమానంగా పోటీ పడుతున్నాయి.

10.ఎకానమి

ఎకానమిలో ఇండియా కన్నా చైనా చాలా ఫాస్ట్ గా ఉందనే చెప్పాలి. అయితే రానున్న కాలంలో రెండు దేశాల్లో విపరీతమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

వనరుల వినియోగం

అన్ని వనరులను ఉపయోగించుకుంటూ ప్రపంచదేశాలకు సవాల్ విసురుతున్న దేశం చైనా..మన దేశంలో కావలిసినన్నివనరులున్నా కాని వాటి వినియోగంలో మాత్రం ఎప్పుడూ వెనుకబడే ఉంది. 

బస్తీ మే సవాల్

మన దేశం ప్రపంచ దేశాలకు ధీటుగా స్పేస్ రంగంలో దూసుకుపోతూ సవాల్ విసురుతుంటే చైనా మాత్రం అణు బాంబులు తయారు చేస్తూ మిగతా దేశాలకు సవాల్ విసురుతోంది .

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
India and China are the two most emerging nations on the global front these days. The two countries are growing 3 times the world’s average, but still there are lots of difference between the position of India and China.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot