మార్క్ కూతురుకు చైనా పేరు: సరికొత్త స్కెచ్

By Hazarath
|

చైనాలో నూతన సంవత్సర సందడి మొదలైంది. అదేంటి న్యూ ఇయర్ అయిపోయి దాదాపు నెలపైనే అవుతుంది కదా అని అనుకోకండి. అది చైనా కాలమానం ప్రకారం వారికి ఫిబ్రవరి 8 నుండి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ భార్య,కూతురుతో కలిసి చైనాకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు ఆ సంధర్భంగా తన కూతురుకి చైనా పేరు చైనాపేరును కూడా పెట్టారు. అదేంటో మీరే చూడండి.

Read more: సెకండ్‌కు లక్షా 26వేల రూపాయల లాభం

ఇంతకుముందు ఉన్నపేరుకు కొత్తగా చైనా పేరు

ఇంతకుముందు ఉన్నపేరుకు కొత్తగా చైనా పేరు

ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తన కూతురుకి చైనా పేరు పెట్టారు. ఇంతకుముందు ఉన్నపేరుకు కొత్తగా చైనా పేరును తగిలించి ముద్దుగా చెన్ మింగ్యూ అని పెట్టారు. ఇప్పుడు మాక్స్ పూర్తిపేరు చెన్ మింగ్యూ జుకర్‌బర్గ్.

ఈ పేరు వెనక బలమైన కారణం

ఈ పేరు వెనక బలమైన కారణం

అయితే ఈ పేరు వెనక బలమైన కారణం ఉంది. మార్క్ జుకర్బర్గ్ భార్య చైనీయురాలు. ఆమె పేరు ప్రిషిల్లా చాన్. ఇద్దరూ తొమ్మిదేళ్ల డేటింగ్ తర్వాత 2012 లో పెళ్లి చేసుకున్నారు.

చైనీయులు ఈ ఏడాది చాంద్రమాన సంవత్సరాన్ని

చైనీయులు ఈ ఏడాది చాంద్రమాన సంవత్సరాన్ని

ఇటీవలే ఆ జంటకు మాక్స్ జన్మించింది. అయితే చైనీయులు ఈ ఏడాది చాంద్రమాన సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు.

మార్క్ జుకర్ బర్గ్ మాండరిన్ భాషలో

మార్క్ జుకర్ బర్గ్ మాండరిన్ భాషలో

ఈ సందర్భంగా మార్క్ జుకర్ బర్గ్ మాండరిన్ భాషలో మాట్లాడిన వీడియోను ఎఫ్బీలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో మాక్స్‌కు పెట్టిన చైనా పేరును కూడా ప్రకటించారు.

 తల్లి పేరు నుంచి చెన్ ను

తల్లి పేరు నుంచి చెన్ ను

మాక్స్‌కు పెట్టిన చైనా పేరులో తల్లి పేరు నుంచి చెన్ ను తీసుకున్నారు. మింగ్యూ అంటే చైనా భాషలో దివ్యమైన భవిష్యత్తు అని అర్థం వస్తుంది.

భవిష్యత్లో ఫేస్ బుక్ ఎలా ఉండబోతోంది?

భవిష్యత్లో ఫేస్ బుక్ ఎలా ఉండబోతోంది?

భవిష్యత్లో ఫేస్ బుక్ ఎలా ఉండబోతోంది? ఇంకెంతమంది ఫేస్‌బుక్‌కు ఆకర్షితులవుతారు? మరో పది సంవత్సరాల్లో ఫేస్బుక్ ఏ మైలు రాయిని చేరుకోబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం చెబుతానంటున్నారు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్

2030 నాటికి ఫేస్‌బుక్  500 కోట్ల మార్క్ చేరుకుంటుందని

2030 నాటికి ఫేస్‌బుక్ 500 కోట్ల మార్క్ చేరుకుంటుందని

ఈ విషయాలతో పాటే అసలు విషయాన్ని బయటపెట్టారు జుకర్. 2030 నాటికి ఫేస్‌బుక్ 500 కోట్ల మార్క్ చేరుకుంటుందని ఆయన బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఫేస్బుక్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 ఫేస్‌బుక్‌ను నెలకు 150 కోట్ల మంది

ఫేస్‌బుక్‌ను నెలకు 150 కోట్ల మంది

ప్రస్తుతం ఫేస్‌బుక్‌ను నెలకు 150 కోట్ల మంది ఉపయోగిస్తున్నారని జుకర్ చెప్పారు. అంతేకాకుండా ఫేస్‌బుక్‌కు విశ్వవ్యాప్తంగా మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు. 

700 కోట్లలో 500 కోట్ల మందిని ఫేస్‌బుక్‌ యూజర్లుగా

700 కోట్లలో 500 కోట్ల మందిని ఫేస్‌బుక్‌ యూజర్లుగా

ప్రపంచ జనాభా 700 కోట్లకు పై మాటే. అయితే ఈ 700 కోట్లలో 500 కోట్ల మందిని ఫేస్‌బుక్‌ యూజర్లుగా మార్చుకోవాలని జుకర్ బర్గ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

జుకర్ బర్గ్ మాటలను బట్టి చూస్తే

జుకర్ బర్గ్ మాటలను బట్టి చూస్తే

జుకర్ బర్గ్ మాటలను బట్టి చూస్తే ఆధార్, ఓటర్, రేషన్ కార్డ్స్ లాగా అన్ని ప్రభుత్వ పథకాలకు ఫేస్‌బుక్‌ అకౌంట్ ఉండాల్సిందే అనే నిబంధన అమల్లోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో అన్న అభిప్రాయాన్ని టెక్ విశ్లేషకులు వెలిబుచ్చుతున్నారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

Best Mobiles in India

English summary
Here Write Facebook CEO Mark Zuckerberg and wife announce daughter's Chinese name

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X