సెకండ్‌కు లక్షా 26వేల రూపాయల లాభం

Written By:

ఏమిటీ న్యూస్ చూసి షాకవుతున్నారా.. అవును మీరు విన్నది కూడా నిజమే మరి. సెకండ్‌కు లక్షా 26వేల రూపాయల లాభమంటే మాటలా..ఇంతకీ అదెక్కడ సాధ్యమో చెప్పనేలేదుగా.. టెక్ కంపెనీలో ఈ ఆదాయం రావాలంటే టెక్ కంపెనీల్లోనే సాధ్యం. టెక్ దిగ్గజాలు ఫేస్‌బుక్ .ఆపిల్, ఆల్ఫాబెట్, మైక్రోసాప్ట్ నాలుగు కలిపి నిమిషానికి 88 లక్షల 20 వేల రూపాయల లాభాన్నిఆర్జిస్తున్నాయి. నిమిషానికి 88 లక్షలంటే నిజంగా కళ్లు బైర్లు కమ్మాల్సిందే కదా..

Read more: ఆ ల్యాప్‌టాప్‌ ఖరీదు రూ. 7.75 లక్షలు, మరి ఫీచర్స్..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నాలుగు సంస్థలు కలసి క్షణానికి 1,26,000 రూపాయలను

ఒకప్పుడు చమురు కంపెనీలు సంపాదించిన లాభాల కన్నా ఇప్పుడు ఐటి దిగ్గజాలు ఎక్కువగా సంపాదిస్తున్నాయి. ఆపిల్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ ... నాలుగు సంస్థలు కలసి క్షణానికి 1,26,000 రూపాయలను, నిమిషానికి 88,20,000 రూపాయలను ఆర్జిస్తున్నాయి.

అన్నింటికన్నా ముందున్నది ఆపిల్ సంస్థ

లాభాల్లో వీటిలో అన్నింటికన్నా ముందున్నది ఆపిల్ సంస్థ. గతేడాదిలో ఈ సంస్థ 3,36,420 కోట్ల రూపాయల లాభాలను గడించింది. ఐఫోన్ అమ్మకాలు రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడం వల్లనే సంస్థకు ఎక్కువ లాభాలు వచ్చాయి.

ఆపిల్ సంస్థకు 10,85,400 కోట్ల రూపాయల లాభం

గతేడాది చివరి త్రైమాసికంలో ఆపిల్ సంస్థకు 10,85,400 కోట్ల రూపాయల లాభం వచ్చింది.

మైక్రోసాఫ్ట్‌కు గతేడాది డెసెంబర్ 31 వ తేదీ నాటికి

అదే మైక్రోసాఫ్ట్‌కు గతేడాది డెసెంబర్ 31 వ తేదీ నాటికి 31,000 కోట్ల రూపాయల లాభాలను గడించింది.

ఫేస్‌బుక్ గతేడాదిలో 6,300 కోట్ల రూపాయల లాభాలను

ఫేస్‌బుక్ గతేడాదిలో 6,300 కోట్ల రూపాయల లాభాలను సంపాదించింది.

అల్ఫాబెట్, ఆపిల్ మార్కెట్‌ను అధిగమించి ముందుకు

అల్ఫాబెట్, ఆపిల్ మార్కెట్‌ను అధిగమించి ముందుకు దూసుకెళుతోంది. ఈ వారంలో దాని రెవెన్యూ 547,1 బిలియన్ డాలర్లకు చేరుకొంది. ఏడాది మొత్తంగా లాభాల వివరాలు తెలియాల్సి ఉంది.

టెక్నాలజీ సంస్థలు ఇంత పెద్ద మొత్తంలో లాభాలను గడిస్తూ

ఈ మేరకు పెన్నీ స్టాక్స్ ల్యాబ్ ఓ చార్ట్ను రూపొందించింది. టెక్నాలజీ సంస్థలు ఇంత పెద్ద మొత్తంలో లాభాలను గడిస్తూ ముందుకు దూసుకెళ్లడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నానికి దారితీస్తుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు మరింత పెరిగిపోవడం

ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు మరింత పెరిగిపోవడం సమాజంలో అసహన పరిస్థితులకు దారితీయవచ్చని వారు భావిస్తున్నారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందండి. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Tech giant company s second earning
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot