ఫేస్‌బుక్, వాట్సాప్‌లదే హవా..

Posted By:

భారత్‌లోని ఇంటర్నెట్ యూజర్లు అత్యధికంగా వినియోగిస్తోన్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ యాప్‌లలో వాట్సాప్, ఫేస్‌బుక్‌లు ముందంజలో ఉన్నాయని ప్రముఖ రిసెర్చ్ సంస్థ టీఎన్ఎస్ తన విశ్లేషణలో పేర్కొంది. భారత్‌లో ప్రతి రోజు 56శాతం మంది ఇంటర్నెట్ యూజర్లు వాట్సాప్‌ను ఉపయోగించుకుంటుంటే, ఫేస్‌బుక్‌ను 51శాతం మంది ఉపయోగించుకుంటున్నట్లు ఈ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 900 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లను కలిగి ఉన్న ఫేస్‌బుక్ గతేడాది వాట్సాప్‌ను 22 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్, వాట్సాప్‌ ఒప్పందం వెనుక ఉన్న పలు ఆసక్తికర విషయాలు...

Read More : సైలెంట్ మోడ్‌లో ఉన్న ఫోన్‌ను వెతికి పట్టుకోవటం ఏలా?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్, వాట్సాప్ ఒప్పందం వెనుక

బిజినెస్ ఇన్‌సైడర్ తెలిపిన వివరాల మేరకు ఫేస్‌బుక్, వాట్సాప్ డీల్ కుదరటానికి రెండు సంవత్సరాల పట్టిందట. ఈ డీల్ కు సంబంధించి తొలసారిగా జూన్ 2012లో మార్క్ జూకర్ బర్గ్ వాట్సాప్ సీఈఓ జాన్ కౌమ్ కు ఫోన్ చేసారట.

ఫేస్‌బుక్, వాట్సాప్ ఒప్పందం వెనుక

చివరాకరకు వీరిద్దరి మధ్య డీల్ ప్రేమికుల రోజున ఒకే అయ్యిందట

ఫేస్‌బుక్, వాట్సాప్ ఒప్పందం వెనుక

వాట్సాప్ ఓ రిమైండర్ లాంటిదని అందులో యాడ్స్, గేమ్స్, గిమ్మిక్స్ లాంటివి ఉండకూడదన్నది జాన్ కౌమ్ సిద్ధాంతం.

ఫేస్‌బుక్, వాట్సాప్ ఒప్పందం వెనుక

జాన్ కౌమ్ తన కుటుంబంతో సహా కమ్యూనిస్ట్ ఉక్రెయిన్ నుంచి అమెరికాకు వలస వచ్చారు. ఆ సమయంలో అతని కుటుంబం తిండికి చాలా ఇబ్బంది పడింది.

ఫేస్‌బుక్, వాట్సాప్ ఒప్పందం వెనుక

కొద్ది సంవత్సరాల పాటు శాన్‌‌జోన్ స్టేట్ యూనివర్శిటీలో తరగతులకు హాజరైన జాన్ ఆ తరువాత యాహూలో ఉద్యోగం సంపాదించారు.

ఫేస్‌బుక్, వాట్సాప్ ఒప్పందం వెనుక

యాహూలో పనిచేస్తున్న సమయంలోనే జాన్ కౌమ్ ఆక్టన్ ను కలిసారు. 2009లో యాహూ నుంచి బయటకొచ్చిన వీరిద్దరు వాట్సాప్ ను ప్రారంభించారు.

ఫేస్‌బుక్, వాట్సాప్ ఒప్పందం వెనుక

యాహూ సహ వ్యవస్థాపకులు డేవిడ్ ఫైలో జాన్ కౌమ్‌ను ఇంటర్వ్యూ చేసి తమ కంపెనీలో చేరాలని కోరారు. ఈ క్రమంలో జాన్ శాన్ జోన్ స్టేట్ యూనివర్శిటీలో తన విద్యను జాన్ కౌమ్ అర్థంతరంగా ముగించాల్సి వచ్చింది.

ఫేస్‌బుక్, వాట్సాప్ ఒప్పందం వెనుక

వాట్సాప్ మార్కెటింగ్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదట.

ఫేస్‌బుక్, వాట్సాప్ ఒప్పందం వెనుక

వాట్సాప్ కేవలం 55 మంది ఉద్యోగులనే కలిగి ఉంది. వారిలో అత్యధిక శాతం మంది మిలియనీర్లు కాగా, ఈ యాప్ వ్యవస్థాపకులైన బ్రియాన్ ఆక్టన్, జాన్ కౌమ్‌లు బిలియనీర్లు.

ఫేస్‌బుక్, వాట్సాప్ ఒప్పందం వెనుక

జాన్ కౌమ్ (37), బ్రెయిర్ ఆక్టమ్(44)లకు 2009లో ట్విట్వర్, ఫేస్‌బుక్‌లలో ఉద్యోగ తిరస్కరణకు గురయ్యారు. ఆ తరువాత జాన్ కౌమ్ తో కలిసి ఆయన ప్రారంభించిన వాట్సాప్ మొబైలింగ్ మెసేజింగ్ విభాగంలో సరికొత్త సంచలనంగా అవతరించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Half of online Indians use Facebook, WhatsApp daily. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot