ఫేస్‌బుక్ ఓడింది: భారత్ గెలిచింది

Written By:

భారత్ గెలిచింది ఫేస్‌బుక్ ఓడింది.అవును ఇది నిజం..ఎప్పటినుంచో ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్‌తో ఇండియాలో పాగా వేయాలని అనుకున్న మార్క్ జుకర్ బర్గ్ ఆశలు అడియాసలయ్యాయి. ఏం చేయలేక ఫ్రీ బేసిక్స్ మీద తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇక దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న స్వచ్చంద కార్యకర్తలు అనుకున్నది సాధించారు. భారత్ నుంచి ఫ్రీ బేసిక్స్ విధానాన్ని తరిమి తరిమి కొట్టారు. ఫేస్‌బుక్ తన ఫ్రీ బేసిక్స్ పధకాన్ని రద్దు చేసుకునేంతగా భారత్‌లోని నెటిజన్లు పోరాటానికి ఊపిరిలూదారు.ఇక నిబంధనలు తుంగలో తొక్కిన వారికి భారీ జరిమానా తప్పదని ట్రాయ్ హెచ్చరించింది. ఇంటర్నెట్ సేవలు ఎలాంటి వివక్షలేకుండా అందరికీ అందివ్వాలని ట్రాయ్ సూచించింది.

Read more: ఇండియన్ల తూటాల దెబ్బకు బిత్తరపోయిన ఫేస్‌బుక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ భారత్‌లో తన ఫ్రీబేసిక్స్ ప్రచారాన్ని

ఇంటర్నెట్‌ చార్జీల విషయంలో ఎంతమాత్రం వివక్ష ఉండరాదన్న ట్రాయ్ నిర్ణయంతో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ భారత్‌లో తన ఫ్రీబేసిక్స్ ప్రచారాన్ని రద్దుచేసుకుంది.

భారత్‌లోని ప్రజలకు ఫ్రీబేసిక్స్ పథకం అందుబాటులో ఉండబోదు

'భారత్‌లోని ప్రజలకు ఫ్రీబేసిక్స్ పథకం అందుబాటులో ఉండబోదు' అని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

ఫ్రీ బేసిక్స్ పథకంలో భాగంగా ఫేస్‌బుక్‌ను

ఫ్రీ బేసిక్స్ పథకంలో భాగంగా ఫేస్‌బుక్‌ను ఉచితంగా అందిస్తున్న మొబైల్ ఆపరేటర్ రిలయన్స్ కమ్యూనికేషన్‌ ఇప్పటికే దీనిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఫ్రీ బేసిక్స్‌ను వెనుకకు తీసుకోవాలని నిర్ణయించింది.

వినియోగదారులు పొందే కంటెంట్‌ ఆధారంగా

వినియోగదారులు పొందే కంటెంట్‌ ఆధారంగా మొబైల్ ఇంటర్నెట్ చారీలు విధించాలన్న మొబైల్ ఆపరేటర్లు, ఫేస్‌బుక్ ప్రతిపాదనను భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) నిర్ద్వంద్వంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే.

భారత్‌లో తీవ్రంగా ప్రచారం

ఉచితంగా ఫేస్‌బుక్‌ వంటి కొన్ని వెబ్‌సైట్లను అందించేందుకు ఫ్రీబేసిక్స్‌ పేరిట మొబైల్ ఆపరేటర్లతో ఒప్పందం చేసుకోవాలని ఫేస్‌బుక్ భావించింది. ఇందుకోసం భారత్‌లో తీవ్రంగా ప్రచారం కూడా చేసింది.

ఇంటర్నెట్‌ సమానత్వానికి వ్యతిరేకమంటూ స్వచ్ఛంద కార్యకర్తలు

అయితే ఫ్రీబేసిక్స్ పేరిట కొన్ని వెబ్‌సైట్లను మాత్రమే అనుమతించడం ఇంటర్నెట్‌ సమానత్వానికి వ్యతిరేకమంటూ స్వచ్ఛంద కార్యకర్తలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

డాటా చార్జీల్లో వివక్షకు తెరదించుతూ ట్రాయ్ నిర్ణయం

ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ సమానంగా అందేందుకు వీలుగా.. డాటా చార్జీల్లో వివక్షకు తెరదించుతూ ట్రాయ్ నిర్ణయం తీసుకుంది.

యాక్సెస్ పొందే కంటెంట్ ఆధారంగా భిన్నమైన ధరలతో

యాక్సెస్ పొందే కంటెంట్ ఆధారంగా భిన్నమైన ధరలతో ఎవరైనా ఇంటర్నెట్ చార్జీల్లో వివక్షకు పాల్పడితే భారీ జరిమానాలు విధిస్తామని ట్రాయ్ హెచ్చరించింది.

ఆండ్రీసేన్ వ్కాఖ్యలకు ఫేస్ బుక్ అధినేత తప్పయిందంటూ

ఆండ్రీసేన్ వ్కాఖ్యలకు ఫేస్ బుక్ అధినేత తప్పయిందంటూ క్షమాపణలు చెప్పిన విషయం విదితమే. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Facebook confirms pulling the plug on Free Basics in India
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot