2017 నాటికి ‘ఫేస్‌బుక్’ అంతరించిపోతుంది!

Posted By:

సామాజిక సంబంధాల అనుసంధాన వేదిక ఫేస్‌బుక్ అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. తాజాగా, ఈ సోషల్ నెట్‌‌వర్కింగ్ వెబ్ సైట్ ఉనికికి సంబంధించి ఆసక్తికర విశ్లేషణలు వెల్లడయ్యాయి. అంటువ్యాధి లాంటి ఫేస్ బుక్ రాబోయే కాలంలో ఓ వ్యాధిలాగానే అంతరించిపోతుందని తాజా పరిశోధనలు పేర్కొన్నాయి. 2017 నాటికి ఫేస్‌బుక్ వినియోగారులు సంఖ్య కనీసం 80 శాతం మేర తగ్గిపోనుందని తాజా విశ్లేషణులు అంచనా వేస్తున్నాయి.

2017 నాటికి ‘ఫేస్‌బుక్’ అంతరించిపోతుంది!

కోట్లాది మంది యూజర్లతో ప్రపంచదేశాలను కలగలుపుతున్న మార్క్ జూకర్‌బెర్గ్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ ఫేస్‌బుక్‌కు గొప్ప చరిత్రే ఉంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ 'గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్‌బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు.

సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌నునేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఈ వివాదం ముగిసిన అనంతరం ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్'గా రూపాంతరం చెందింది. 30 రోజుల వ్యవధిలోనే ద ఫేస్‌బుక్ కాస్తా ఫేస్‌బుక్‌లా మారిపోయింది. ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot