షాక్ మీద షాక్: అల్లాడుతున్న ఫేస్‌బుక్‌

By Hazarath
|

ఫేస్‌బుక్‌కు ట్రాయ్ ఝలక్ ఇచ్చింది. నెట్ న్యూట్రాలిటీపై అభిప్రాయాలు పంపమంటే ఫ్రీ బేసిక్స్ కు అనుకూలంగా పెద్ద ఎత్తున కామెంట్స్ రావడంపై ట్రాయ్ మండిపడింది. మేము అడిగింది ేమిటీ..మీరు ఇచ్చింది ఏమిటీ అంటూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌కు ట్రాయ్ మొట్టికాయలు వేసింది. ఇదిలా ఉంటే ఫేస్ బుక్ ప్రీ బేసిక్స్ సర్వీసును ఈజిప్టులో నిలిపివేయడంతో ఫేస్‌బుక్‌కు మరో షాక్ తగిలినట్లయింది. షాకులు మీద షాకులతోఫేస్‌బుక్‌ ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోంది.

Read more: రచ్చ రచ్చ అవుతున్న ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్

ఫేస్‌బుక్‌కు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రూపంలో

ఫేస్‌బుక్‌కు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రూపంలో

ఫ్రీ బేసిక్స్ సర్వీసుకు మద్దతు కూడగట్టుకునేందుకు ఉధృత ప్రచారం సాగిస్తున్న సోషల్ నెట్వర్క్ ఫేస్‌బుక్‌కు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. నెట్ న్యూట్రాలిటీ పై అభిప్రాయాలు పంపమంటే ఫ్రీ బేసిక్స్ కు అనుకూలంగా పెద్ద ఎత్తున కామెంట్స్ రావడంపై ట్రాయ్ స్పందించింది.

న్యూట్రాలిటీపై చర్చాపత్రంలో ప్రస్తావించిన

న్యూట్రాలిటీపై చర్చాపత్రంలో ప్రస్తావించిన

న్యూట్రాలిటీపై చర్చాపత్రంలో ప్రస్తావించిన నిర్దిష్ట అంశాలపై స్పందించాలి తప్ప ఫ్రీ బేసిక్స్కు అనుకూలంగా ఫేస్‌బుక్‌ రూపొందించిన నమూనా (టెంప్లేట్) పంపితే కుదరదని పేర్కొంది. సదరు అంశాలపై అభిప్రాయాలు తెలపాలంటూ ఆయా ఈమెయిల్స్ ను పంపినవారికి సూచించాలని నిర్ణయించింది.

మేము విభిన్న చార్జీల విధానం, న్యూట్రాలిటీ

మేము విభిన్న చార్జీల విధానం, న్యూట్రాలిటీ

మేము విభిన్న చార్జీల విధానం, న్యూట్రాలిటీ (ఇంటర్నెట్ సేవల్లో టెల్కోలు తటస్థ వైఖరితో వ్యవహరించడం) గురించి అడిగితే .. ఫ్రీ బేసిక్స్ కు మద్దతు పలుకుతూ బోలెడన్ని మెయిల్స్ వచ్చాయి. ఇది .. మేం అడిగిన ప్రశ్న ఒకటైతే .. వారు మరో ప్రశ్నకు జవాబు రాసినట్లుగా ఉంది.

ఫ్రీ బేసిక్స్ కు మద్దతు పలకడమనేది ..

ఫ్రీ బేసిక్స్ కు మద్దతు పలకడమనేది ..

ఫ్రీ బేసిక్స్ కు మద్దతు పలకడమనేది .. మేం అడిగిన ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం ఇచ్చినట్లవుతుందనేది అర్థం చేసుకోవడం కష్టంగా మారింది 'అని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ వ్యాఖ్యానించారు.

సాధారణంగా ఈ కామెంట్స్ ను బుట్టదాఖలు చేయొచ్చని

సాధారణంగా ఈ కామెంట్స్ ను బుట్టదాఖలు చేయొచ్చని

సాధారణంగా ఈ కామెంట్స్ ను బుట్టదాఖలు చేయొచ్చని, కానీ మెయిల్స్ చేసిన వారు అందుకోసం ఎంతో కొంత సమయం వెచ్చించి ఉంటారు కనుక ... అభిప్రాయాలు పంపేందుకు గడువును పొడిగించినట్లు ఆయన తెలిపారు.

ఇప్పటికే ఫ్రీ బేసిక్స్ సర్వీస్ రుచి చూసిన ఈజిప్టులో

ఇప్పటికే ఫ్రీ బేసిక్స్ సర్వీస్ రుచి చూసిన ఈజిప్టులో

ఇదిలా ఉంటే అయితే ఇప్పటికే ఫ్రీ బేసిక్స్ సర్వీస్ రుచి చూసిన ఈజిప్టులో మాత్రం దీనిని నిలిపేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈజిప్టులో ఫేస్? బుక్ పార్ట్? నర్ టెలికామ్ సంస్థ 'ఎతిసలాద్ ఈజిప్ట్' ను సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఈజిప్టులో ఫ్రీ బేసిక్స్ సర్వీస్ కావాలని

ఈజిప్టులో ఫ్రీ బేసిక్స్ సర్వీస్ కావాలని

ఈజిప్టులో ఫ్రీ బేసిక్స్ సర్వీస్ కావాలని 30 లక్షల మంది కోరగా ప్రస్తుతం 10 లక్షల మందికి ఈ సేవలు అందుతున్నాయి. రెండు నెలల క్రితమే ప్రారంభమైన ఈ సేవలను ఇప్పుడు నిషేధించడం చర్చనీయాంశం అయింది.

ఈ సర్వీస్‌ను ఎందుకు నిలిపేస్తున్నారనే విషయమై

ఈ సర్వీస్‌ను ఎందుకు నిలిపేస్తున్నారనే విషయమై

ఈ సర్వీస్‌ను ఎందుకు నిలిపేస్తున్నారనే విషయమై అధికారులు ఇంకా వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే ఎలాగైనా ఈ సేవలను మళ్లీ పునరుద్ధరిస్తామని ఫేస్‌బుక్ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్ ద్వారా

ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్ ద్వారా

ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్ ద్వారా కమ్యూనికేషన్, ఆరోగ్యం, విద్య, ఉపాధి లాంటి కొన్ని ప్రత్యేక విభాగాల్లో నెట్ సేవలను వినియోగదారులకు ఉచితంగా అందించాలని ఫేస్‌‌బుక్ భావిస్తోంది.

ఇండియాలో ఈ సేవలను అందించేందుకు

ఇండియాలో ఈ సేవలను అందించేందుకు

ఇండియాలో ఈ సేవలను అందించేందుకు ఫేస్‌బుక్ సంస్థ రిలయన్స్‌తో చేతులు కలిపింది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. ఐఐటీ, ఐఐఎస్సీల ప్రొఫెసర్లు కూడా దీన్ని విమర్శిస్తున్నారు. దీనివల్ల మన ఫోన్లో ఉండే యాప్ల మీద ఫేస్బుక్ నియంత్రణ పెరిగిపోతుందని కూడా అంటున్నారు.

దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా

దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా

దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఫ్రీ బేసిక్స్, డిఫరెన్షియల్ డేటా తదితర ప్రయోగాలకు వ్యతిరేకంగా ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) గళమెత్తింది. ఇవి నెట్ న్యూట్రాలిటీ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపింది.

వివిధ డేటా సేవలకు వివిధ రకాల చార్జీల

వివిధ డేటా సేవలకు వివిధ రకాల చార్జీల

వివిధ డేటా సేవలకు వివిధ రకాల చార్జీల (డిఫరెన్షియల్ డేటా) ప్రతిపాదనకు సంబంధించి ట్రాయ్ రూపొందించిన చర్చాపత్రంపై ఈ మేరకు ఐఏఎంఏఐ తమ అభిప్రాయాలు తెలియజేసింది.

చర్చాపత్రంలో మొత్తం మూడు విధానాలు ఉండగా

చర్చాపత్రంలో మొత్తం మూడు విధానాలు ఉండగా

చర్చాపత్రంలో మొత్తం మూడు విధానాలు ఉండగా .. అందులో మొదటిది టెలికం సంస్థ నిర్దిష్ట డెవలపర్ల నుంచి ఫీజులు తీసుకుని వారి వెబ్సైట్లను యూజర్లకు ఉచితంగా అందించడం.

రెండోది

రెండోది

రెండోది .. ఫేస్బుక్ వంటి సంస్థలు నిర్దిష్ట వెబ్సైట్లను ఎంపిక చేసి, టెలికం సంస్థల భాగస్వామ్యంతో వాటిని ఉచితంగా అందించడం.

ఇక మూడోది ..

ఇక మూడోది ..

ఇక మూడోది .. యాప్స్ను బట్టి టెలికం సంస్థలు డేటా చార్జీలు వసూలు చేయడం. ఈ మూడు విధానాలు కూడా నెట్ విషయంలో కస్టమరుకు అందుబాటులో ఉండే ఐచ్ఛికాలను తగ్గించేసేవేనని ఐఏఎంఏఐ పేర్కొంది.

ఉచిత ఇంటర్నెట్ అనేది డేటారూపంలో ఉండాలే తప్ప

ఉచిత ఇంటర్నెట్ అనేది డేటారూపంలో ఉండాలే తప్ప

ఈ నేపథ్యంలో ఉచిత ఇంటర్నెట్ అనేది డేటారూపంలో ఉండాలే తప్ప నిర్దిష్ట కంటెంట్ పరంగా ఉండకూడదని తెలిపింది. డేటా చార్జీల ప్రమేయం లేకుండా నిర్దిష్ట యాప్లను ఉచితంగా అందించే వేదికగా సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్‌బుక్‌ ప్రవేశపెట్టిన ఫ్రీ బేసిక్స్ సర్వీసు వివాదాస్పదమైన దరిమిలా ట్రాయ్ ఈ విధానాలపై చర్చాపత్రం రూపొందించిన సంగతి తెలిసిందే.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు.

https://www.facebook.com/GizBotTelugu/

 

 

Best Mobiles in India

English summary
Here Write Facebook 'Free Basics' service suspended in Egypt

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X