రచ్చ రచ్చ అవుతున్న ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్

Written By:

గత కొన్ని రోజులుగా భారతదేశాన్ని ఊపేస్తున్న చర్చ ఏదైనా ఉందంటే అది ఫ్రీ బేసిక్స్ మాత్రమే.. దీనిపై గత ఏడాది నుంచి చర్చలు జరుగుతున్నా కాని ఓ కొలిక్కి రావడం లేదు. ఉచిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామని కొందరు అంటుంటే మరి కొందరు ఇది అన్ని సైట్లకు వర్తింపజేయాలని పట్టుబడుతున్నారు. మరి కొందరు ఇది ఫేస్‌బుక్ రిలయన్స్ తో జత కట్టిందని ఇంటర్ నెట్ ప్రపంచంలో గుత్తాధిపత్యంకోసమే ఇదంతా చేస్తుందని అంటున్నారు. అసలు ఫ్రీ బేసిక్స్ అంటే ఏంటి..ఎందుకు దీనిపై ఇంతగా చర్చ జరుగుతోంది ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: ఏడాదికి 16 సినిమాలు: ఆస్కార్ అవార్డ్ వేటలో అమెజాన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అందరికీ ఉచిత ఇంటర్నెట్ సర్వీస్

అందరికీ ఉచిత ఇంటర్నెట్ సర్వీస్ అందిస్తామంటూ ఎటువంటి డేటా ఛార్జీలు లేకుండా ఫ్రీ గా ఇంటర్నెట్ అందిస్తామని ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ ఈ ఫ్రీ బేసిక్స్ ను ప్రవేశపెట్టింది.

ఇందులో భాగంగా ఫేస్‌బుక్ రిలయన్స్ తో

ఇందులో భాగంగా ఫేస్‌బుక్ రిలయన్స్ తో జతకట్టింది. ఇందులో భాగంగా మేము ఫ్రీగా మీకు ఫేస్‌బుక్ అందిస్తున్నాం మీరు రిలయన్స్ ఫోన్ వాడితే చాలంటూ చెబుతున్నారు. దీని వల్ల అందరికీ నెట్ అందుబాటులోకి వస్తుందనేది మార్క్ జుకర్ బర్గ్ సారాంశం. అయితే దీని ద్వారా ఆయన ఫేస్‌బుక్ యూజర్లను పెంచుకునే అవకాశాలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు.

ఊరికే ఇస్తే ఏం వస్తుంది అందుకే ఇలాంటి

ఊరికే ఇస్తే ఏం వస్తుంది అందుకే ఇలాంటి ఎత్తుగడ వేశారని తెలుస్తోంది. ప్రపంచంలోని అన్ని దేశాలను వదిలి ఇండియామీదనే ఎందుకు పడ్డారని కొందరు వాదిస్తున్నారు. అయితే 150 దేశాల్లో ఫ్రీగా కొన్ని సైట్ల సేవలు అందిస్తున్నామని ఇక్కడ కూడా అందిస్తామనేది మార్క్ జుకర్ బర్గ్ వాదన.

కానీ ఫ్రీబేసిక్స్ కి అనుమతిస్తే మిగతా వాళ్లు కూడా

కానీ ఫ్రీబేసిక్స్ కి అనుమతిస్తే మిగతా వాళ్లు కూడా కుప్పలు తెప్పలుగా ముఖ్యంగా ఎయిరె టెల్, ఐడియా, వోడఫోన్ కూడా కొంత మందితో అగ్రిమెంట్ చేసుకుని కొన్న సైట్స్ కి మాత్రమే యాక్సెస్ ఇచ్చి బిజినెస్ చేయడానికి కాచుకుని కూర్చున్నాయి.

ఇదే జరిగితే ఇంటర్నెట్ లో న్యూట్రాలిటీ

ఇదే జరిగితే ఇంటర్నెట్ లో న్యూట్రాలిటీ పోతుంది. అందరికీ అన్ని దొరకవు. డబ్బు ఉన్నవాళ్లు టోటల్ నెట్ డేటా కార్డ్ తీసుకుంటారు. మిగతా వాళ్లు మూడు నాలుగు సైట్స్ కే పరిమితం అవుతారనేది ఆందోళన. అందుకే అందరూ నెట్ న్యూట్రాలిటీ కోసం ఫైట్ చేస్తున్నారు.

మొబైల్ ఫోన్ల ద్వారా కొన్ని వెబ్‌సైట్లను

మొబైల్ ఫోన్ల ద్వారా కొన్ని వెబ్‌సైట్లను ఉచితంగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఈ ఫ్రీ బేసిక్స్ వల్ల సాధ్యమవుతుంది. దీంతో అందరికీ ఎంతో కొంత వరకు ఇంటర్నెట్ అందుతుందన్నది ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బెర్గ్ వాదన.

అయితే ఫేస్‌బుక్ సహా కొన్ని సైట్లు మాత్రమే

అయితే ఫేస్‌బుక్ సహా కొన్ని సైట్లు మాత్రమే అందుబాటులోకి రావడం సరికాదని, మొత్తం ఇంటర్నెట్ నే అందరికీ ఉచితంగా అందించాలని అంటున్నారు. కానీ జుకర్ బర్గ్ మాత్రం లైబ్రరీ, ప్రభుత్వాస్పత్రి, ప్రభుత్వ పాఠశాలల్లా బేసిక్ ఇంటర్నెట్ సర్వీసులు అందరికీ అందించాలని వాదిస్తున్నారు.

అయితే ప్రజలు గట్టిగా కావాలని అడుగుతున్న

అయితే ప్రజలు గట్టిగా కావాలని అడుగుతున్న నెట్ న్యూట్రాలిటీకి, ఫ్రీ బేసిక్స్ కు చాలా తేడా ఉంది. ఎలాంటి పరిమితులు లేకుండా అందరికీ, అన్ని సైట్లకూ ఉచితంగా యాక్సెస్ ఉండాలన్నది నెట్ న్యూట్రాలిటీ కావాలంటున్నవాళ్ల వాదన.

కానీ ఫేస్‌బుక్ మాత్రం ఫ్రీ బేసిక్స్ కావాలంటూ

కానీ ఫేస్‌బుక్ మాత్రం ఫ్రీ బేసిక్స్ కావాలంటూ తన సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తోంది, చేయిస్తోంది. ఇప్పటికే దాదాపు 32 లక్షల మంది ప్రజలు ఫ్రీ బేసిక్స్ ని నిషేధించవద్దంటూ ట్రాయ్ కు పిటిషన్లు పెట్టారు. ఈ ప్రణాళిక అస్తవ్యస్తంగా ఉందని భారతీయ టెలికాం ఆపరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దాంతో రిలయన్స్ సంస్థ ప్రస్తుతానికి ఫ్రీ బేసిక్స్ స్కీమ్ను తాత్కాలికంగా నిలిపివేసింది.

మీ ఫ్రెండ్స్ ఈ పిటిషన్ పెట్టారు, మీరు కూడా చేరండంటూ

మీ ఫ్రెండ్స్ ఈ పిటిషన్ పెట్టారు, మీరు కూడా చేరండంటూ ఫేస్‌బుక్ యూజర్లకు పదే పదే మెసేజిలు, నోటిఫికేషన్లు వస్తున్నాయి. ప్రధానంగా గ్రామీణ భారతానికి ఇంటర్నెట్ ఉచితంగా అందించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని, దీన్నినిషేధించవద్దని జుకర్ బర్గ్ కోరుతున్నాడు.

నిజానికి ఫ్రీ బేసిక్స్ ప్రకటనలకూ అతీతమేం కాదు.

నిజానికి ఫ్రీ బేసిక్స్ ప్రకటనలకూ అతీతమేం కాదు. తమ సైట్లో ప్రకటనలు ఉండవు అని చెప్పడం లేదు. 3.2 మిలియన్ల ప్రజలు తమకు మద్దతు పలుకుతున్నారని చెప్పడంలోనే నిజం కనిపించడం లేదు. వారికి వచ్చిన ఈ మెయిల్స్ లో న్యాయబద్ధమైనవి ఎన్ని ఉంటాయనేది అనుమానమే అంటున్నారు ఆన్ లైన్ ఉద్యమకారులు.

రిలయన్స్ సంస్థ ఫేస్‌బుక్ తో కలిసి భారతదేశంలో

రిలయన్స్ సంస్థ ఫేస్‌బుక్ తో కలిసి భారతదేశంలో ఇంటర్నేట్ రంగంపై గుప్తఆధిపత్యం సాగించేందుకు కుట్ర పన్నుతుందని ఈ విధానం అమలులోకి వస్తే వారు సంస్థ ఇవ్వదలిచిన సేవలు మాత్రమే అందుబాటులోకి వస్తాయని వారు వాదిస్తున్నారు.ఇది పూర్తిగా ప్రజలను ఇంటర్నెట్ స్వేచ్ఛకు దూరం చేయడమేనని మరి కొందరు వాదిస్తున్నారు.ర్యాలీలు చేస్తున్నారు.

అయితే మరి కొందరు మాత్రం గతంలో

అయితే మరి కొందరు మాత్రం గతంలో ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ వివాదాస్పదం అవ్వడంతో .. మరింత ఆకట్టుకునేందుకు ఫ్రీ బేసిక్స్ డాట్ కామ్ తో మళ్ళీ ముందుకొచ్చిందంటూ కొత్త కథలకు తెరలేపుతున్నారు. ఫేస్ బుక్ అందిస్తున్న ఫ్రీ బేసిక్స్ ఎప్పటికైనా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

ఇంటర్నెట్ లో అన్ని వెబ్ సైట్లనూ వినియోగదారులంతా

ఇంటర్నెట్ లో అన్ని వెబ్ సైట్లనూ వినియోగదారులంతా ఒకే రీతిలో వాడుకునేందుకు వీలుగా .. యూజర్లంతా స్పందించాలని 'సేవ్ ద ఇంటర్నెట్' పేరున ఇప్పటికే ఆన్ లైన్ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. బేసిక్స్ ద్వారా ఇంటర్నెట్ వాడకం మన చేతుల్లోనుంచి టెలికమ్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళబోతోంది అన్నది నిపుణుల ఉవాచ.

ప్రజలకు ఫ్రీ ఇంటర్నెట్ అందించేందుకు ఇంకా

ప్రజలకు ఫ్రీ ఇంటర్నెట్ అందించేందుకు ఇంకా ఎన్నో ఇతర పద్ధతులు ఉన్నాయని..నిజానికి ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్ కోసం టెలికాం ఆపరేటర్లకు ఎలాంటి బిల్లూ చెల్లించదు. ఇది టెలికాం ఆపరేటర్లే ​​చెల్లించాల్సి వస్తుంది. ఈ విధంగా ఇంటర్నెట్ డేటా ఖర్చును తగ్గించుకుని ఫేస్‌బుక్ తన పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తోందని చెప్తున్నారు.

అంతేకాదు ఫ్రీ బేసిక్స్ తన భాగస్వాములకు

అంతేకాదు ఫ్రీ బేసిక్స్ తన భాగస్వాములకు మాత్రమే ఉచిత సౌకర్యాన్ని అందిస్తుంది. మిగిలినవారంతా ఇంటర్నెట్ కోసం ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఇది ఒక రకంగా నెట్ న్యూట్రాలిటీని ఉల్లంఘించడమే అవుతుంది. ఫ్రీ బేసిక్స్ పేరున ఫేస్‌బుక్ అన్ని సైట్లలో ఉచితంగా చొరబడగలగడమే కాక, ఎన్.ఎస్.ఏ కు డేటా అందించడం కూడ భారత దేశ భద్రతకే ముప్పు అంటున్నారు నిపుణులు.

నెట్ న్యూట్రాలిటీ సాధించాలనుకుంటున్న ప్రభుత్వం

నెట్ న్యూట్రాలిటీ సాధించాలనుకుంటున్న ప్రభుత్వం ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్ కు ఎలా అనుమతి ఇస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఫేస్‌బుక్ స్కీమ్ తో సొంత ప్రచారం తప్ప మరో సైట్ కు ప్రమోషన్ ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఏది ఏమైనా ప్రస్తుతం నెట్ న్యూట్రాలటీ అంశం పై

ఏది ఏమైనా ప్రస్తుతం నెట్ న్యూట్రాలటీ అంశం పై చెలరేగిన వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీన్ని అధ్యయనం చేసేందుకు పలువురు నిపుణుల కమిటీని కూడ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Mark Zuckerberg makes renewed pitch to defend Facebook’s Free Basics
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot