ఇంటర్నెట్ లేకుండా ఫేస్‌బుక్‌లో కబుర్లు

Written By:

ఈ జీవితం ఫేస్‌బుక్‌ కే అంకితం అనేవాళ్లు చాలామందే ఉంటారు. ఓ గంట ఇంటర్నెట్ అందుబాటులో లేకుంటే ఇక అంతే సంగతులు. ఫేస్‌బుక్‌ గురించే ఒకటే ఆలోచనలు వస్తుంటాయి. ఎవరు లైక్ కొట్టారు.అలాగే ఎవరు షేర్ చేశారు..ఇంకా ఎవరు దానికి కామెంట్ పెట్టారు. ఇలా రకరకాల ఆలోచన్లతో మనసంతా దిగులుగా ఉంటుంది ఇంటర్నెట్ వచ్చే దాకా..అయితే ఇప్పుడు అలాంటి దిగులు లేకుండా నిశ్చింతగా ఉండవచ్చు. ఎందుకంటే ఇంటర్నెట్ లేకుండానే మీ ఫేస్‌బుక్‌ ను చూసుకోవచ్చు. అలాగే కామెంట్లు పెట్టుకోవచ్చు. ఎలానో మీరే చూడండి.

Read more: ఆపిల్ సీక్రెట్ ప్రాజెక్ట్‌లు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్‌ యూజర్లకు శుభవార్త

ఫేస్‌బుక్‌ యూజర్లకు శుభవార్త

ఫేస్‌బుక్‌ యూజర్లకు శుభవార్త. ఇక నుంచి ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులో లేకున్నా ఫేస్‌బుక్‌ను చూడొచ్చు. ఫేస్‌బుక్‌లోని పోస్టులపై కామెంట్లూ పెట్టొచ్చు.

తమ వెబ్‌సైట్‌ను ప్రజలకు మరింతగా అందుబాటులోకి

తమ వెబ్‌సైట్‌ను ప్రజలకు మరింతగా అందుబాటులోకి

ఈ మేరకు తమ వెబ్‌సైట్‌ను ప్రజలకు మరింతగా అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ప్రకటించింది.

ఇంటర్నెట్ కనెక్షన్ నెమ్మదిగా ఉన్నా న్యూస్‌ఫీడ్‌ను

ఇంటర్నెట్ కనెక్షన్ నెమ్మదిగా ఉన్నా న్యూస్‌ఫీడ్‌ను

ఇంటర్నెట్ కనెక్షన్ నెమ్మదిగా ఉన్నా న్యూస్‌ఫీడ్‌ను అందుబాటులో ఉంచేలా చూడనున్నట్టు తెలిపింది. భారత్ వంటి వర్ధమాన మార్కెట్లలో మొబైల్ ద్వారా 2జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని ఫేస్‌బుక్‌ను చూసే యూజర్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది.

ఈ విషయాన్ని గుర్తించిన ఆ సంస్థ ఆ యూజర్లకు

ఈ విషయాన్ని గుర్తించిన ఆ సంస్థ ఆ యూజర్లకు

ఈ విషయాన్ని గుర్తించిన ఆ సంస్థ ఆ యూజర్లకు మరింత అందుబాటులో ఉండేలా కొత్త అప్‌డేట్‌ను ప్రస్తుతం పరీక్షిస్తుంది. దీనిప్రకారం ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్నప్పుడు ఫోన్‌లో డౌన్‌లోడ్‌ అయిన ఫేస్‌బుక్‌ స్టోరీలను తర్వాత కూడా చూడవచ్చు.

యూజర్ల రెలెవెన్స్ ఆధారంగా న్యూస్‌ఫీడ్‌లో

యూజర్ల రెలెవెన్స్ ఆధారంగా న్యూస్‌ఫీడ్‌లో

యూజర్ల రెలెవెన్స్ ఆధారంగా న్యూస్‌ఫీడ్‌లో ఈ స్టోరీలు కనబడతాయి. అదేవిధంగా మెరుగైన నెట్‌ కనెక్షన్ ఉన్నప్పుడు రోజంతా ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు న్యూస్‌ఫీడ్‌లోకి వచ్చేలా మెరుగులు దిద్దుతున్నది.

ఫేస్‌బుక్‌లోని పోస్టులపై కామెంట్లు పెట్టడం

ఫేస్‌బుక్‌లోని పోస్టులపై కామెంట్లు పెట్టడం

ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా ఫేస్‌బుక్‌లోని పోస్టులపై కామెంట్లు పెట్టడం ఇప్పుడు సాధ్యమేనని, నెట్‌ కనెక్షన్ అందుబాటులోకి రాగానే కామెంట్లు ఆటోమేటిక్‌గా అప్‌లోడ్‌ అవుతాయని తెలిపింది.

ఎప్పటికప్పుడు యూజర్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌

ఎప్పటికప్పుడు యూజర్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌

ఎప్పటికప్పుడు యూజర్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకునేలా రూపొందించిన సరికొత్త న్యూస్‌ఫీడ్ ఫీచర్స్ ఫేస్‌బుక్‌ ప్రస్తుతం పరీక్షిస్తున్నది. అయితే ఇది ప్రయోగ దశలోనే ఉంది.

ఇది అమల్లోకి వచ్చి మీరు ఇంటర్నెట్ లేకుండానే

ఇది అమల్లోకి వచ్చి మీరు ఇంటర్నెట్ లేకుండానే

ఇది అమల్లోకి వచ్చి మీరు ఇంటర్నెట్ లేకుండానే చాట్ చేసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write No internet No problem Facebook tests changes to its News Feed that let users with poor connections make comments offline
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting