సిలికాన్ వ్యాలీ సముద్రంలో కలిసిపోనుందా..

By Hazarath
|

ప్రపంచ టెక్ దిగ్గజాలకు ఇప్పుడు పెద్ద ప్రమాదమే వచ్చి పడింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఉన్న దిగ్గజ కంపెనీలు గూగుల్, ఫేస్‌బుక్ లకు వరదల రూపంలో పెను ప్రమాదమే ఎదురుకానుంది. సాగరతీర అందాలతో ప్రపంచాన్ని శాసిస్తున్న ఆ కంపెనీలు ఇప్పుడు అదే సాగరతీరంలోని వరదలకు కనుమరుగయ్యే ప్రమాదముందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకో మీరే చూడండి.

 

Read more: గూగుల్ ఎర్త్‌లో మిస్టరీగా మారిన ప్రదేశాలు

1

1

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో సిలికాన్ వ్యాలీ ప్రాంతంలో సాగర తీరాన్ని ఆనుకుని గూగుల్, ఫేస్ బుక్, సిస్కో ప్రధాన కార్యాలయాలు పెరుగుతున్న సముద్ర మట్టంతో భవిష్యత్తులో మునిగిపోయే ప్రమాదం ఉందని ఓ శాస్త్రవేత్తల బృందం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.

2

2

దీనికి పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలు, కాలుష్యమే కారణమని అంటోంది. ఇప్పటికిప్పుడు గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను కట్టడి చేసినా సరే ఈ కంపెనీల కార్యాలయాలు ఇతర ప్రపంచంతో సంబంధాలు తెంచుకునే ముప్పు మాత్రం తగ్గదని ఆ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

3
 

3

ముఖ్యంగా ఫేస్‌బుక్ కార్యాలయానికి ఎక్కువగా ముప్పు ఉందని ఈ టీమ్ అంటోంది. చాలా లోతట్టు ప్రాంతంలో ఫేస్‌బుక్ కార్యాలయాన్ని నిర్మించారని, ఎంత ఖర్చయినా సరే తమను రక్షించుకోగలమని ఆ కంపెనీ భావిస్తోందని క్యాలిఫోర్నియా బే కన్జర్వేషన్ అండ్ డెవలప్ మెంట్ కమిషన్ కు చెందిన సీనియర్ ప్లానర్ లిండీ లోవే అన్నారు.

4

4

ఈ శతాబ్దం చివరి నాటికి సాగర జలాల ఎత్తు ఒకటిన్నర అడుగు మేర పెరగనున్న నేపథ్యంలో ఫేస్ బుక్ కార్యాలయం ప్రస్తుతమున్న ఎత్తులో భద్రంగా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

5

5

సాగర జలాలు కొంచెం ఎత్తు పెరిగినా 101 హైవే పైకి చొచ్చుకు వస్తాయని దాంతో గూగుల్ ప్లెక్స్ (గూగుల్ కార్యాలయం) జల ముప్పులో చిక్కుకుంటుందని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో ఎన్విరాన్ మెంట్ ప్లానింగ్ అండ్ అర్బన్ డిజైన్ విభాగానికి చెందిన క్రిస్టినా హిల్ చెబుతున్నారు.

6

6

పెరిగే సాగర జలాల మట్టంతో సిలికాన్ వ్యాలీ ప్రాంతంలో సాగర తీరంలో ఉన్న 100 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య, నివాస ప్రాంతాలు ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొంటాయని శాస్త్రవేత్తల అంచనా.గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాల స్థాయిని తగ్గించుకున్నా ఈ తీవ్ర ప్రమాదం నుంచి ఆ సంస్థలు బయటపడలేవని తెలిపారు.

7

7

సోషల్ మీడియా దిగ్గజంగా పేరొందిన ఫేస్‌బుక్ కొత్త క్యాంపస్ వరద ముప్పుతో ఎక్కువ ప్రమాదానికి గురయ్యే అవకాశముందని రిపోర్టులో తెలిపారు. తొమ్మిది ఎకరాల గార్డెన్ పైకప్పుతో 4 లక్షల 30 వేల చదరపు అడుగుల సముదాయంలో ఈ కొత్త క్యాంపస్ ను శాన్ ఫ్రాన్సిస్కో బే తీరప్రాంతంలో నెలకొల్పారు.

8

8

ఆ ప్రాంతంలోనే మెన్లో పార్క్ బేస్ ను కూడా నెలకొల్పి క్యాంపస్ విస్తీర్ణాన్ని పెంచారు. అయితే ఈ క్యాంపస్ తీవ్ర ప్రమాదంలో ఉందని, అసలు కొత్త క్యాంపస్ కోసం ఫేస్ బుక్ ఈ స్థలాన్ని ఎలా ఎంచుకున్నదో తెలియడం లేదని కాలిఫోర్నియా బే పరిరక్షణ, అభివృద్ధి కమిషన్ సీనియర్ ప్లానర్ లిండీ లొవె అన్నారు.

9

9

ఈ శతాబ్దం చివరికి 1.6 అడుగుల సముద్ర మట్టాలు ఎత్తు పెరిగితే, ఫేస్ బుక్ ను వరద ముప్పు నుంచి కాపాడలేమని తెలిపారు. అదేవిధంగా అట్లాంటికా సముద్ర మట్టాలు 6 అడుగుల పెరిగితే, సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, టెక్నాలజీ కంపెనీ సిస్కో రెండూ కూడా తుడిచిపెట్టుకొని పోతాయని హెచ్చరికలు జారీ చేశారు.

10

10

మొత్తం మీద సిలికాన్ వాలీ దిగ్గజాలుగా ఉన్న ఫేస్ బుక్, గూగుల్, సిస్కో క్యాంపస్‌లకు వరద ముప్పు తీవ్రంగా ఉండబోతుందని తెలుస్తోంది. దిగ్గజ కంపెనీలు తమ క్యాంపస్ ను కాపాడుకునేందుకు తగు చర్యలను ఇప్పటికే ప్రారంభించింది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

 

 

11

11

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Facebook, Google campuses at risk of being flooded due to sea level rise

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X