ఫేస్‌బుక్ పెద్ద ప్రమాదంలో పడబోతోందా..?

By Hazarath
|

ఫేస్‌బుక్.. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే. ఇక డెస్క్‌టాప్‌లయితే చెప్పనే అవసరంలేదు. ప్రతి ఒక్కరూ ఇది ఓపెన్ చేసిన తరువాతనే మిగతా వాటి మీదకు వెళతారు అంతలా జనాల్లోకి దూసుకుపోయిన ఈ ఫేస్‌బుక్ కి ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. ఫేస్‌బుక్‌లో వ్యక్తిగత సమాచార పోస్టులు తగ్గుతున్నాయని తద్వారా ఫేస్‌బుక్ యూజర్లు కూడా తగ్గిపోతున్నారని యాజమాన్యం కలతచెందుతోంది.

Read more: వరుస కేసులతో బిత్తరపోతున్న ఆపిల్

1

1

2015 సంవత్సరం మధ్యకాలం నుంచి ఫేస్‌బుక్ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. దీంతో కంపెనీ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ఫేస్‌బుక్ ఉన్నత ఉద్యోగులతో సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.

2

2

ఫేస్‌బుక్ యాజమాన్యం అంతగా కలత చెందడానికి కారణం ఏంటని ఆరాతీస్తే ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచార పోస్టులు క్రమేపీ తగ్గుతున్నాయట. ఫలితంగా ఫేస్‌బుక్ యూజర్లను ప్రతి ఏటా కోల్పోతున్నామని ఆందోళన చెందుతోంది.

3

3

ఇంతకుమునుపు ఫేస్‌బుక్ మనకు పాత స్నేహితుడిలా ఉంటూ, వ్యక్తిగత జీవితం గురించి ఏమైనా షేర్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ మధ్య కాలంలోఆ ట్రెండ్ కాస్తా మారింది.

4

4

వ్యక్తిగత సమాచారం ఎక్కువగా ఫేస్‌బుక్ లో కనిపించట్లేదు. షేరింగ్ లు తక్కువ అవుతున్నాయి. పెళ్లివేడుకలు, పిల్లల పుట్టినరోజులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఇంకా ప్రజలకు అందుబాటులో ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా ఏడాదికి 5 శాతం తగ్గుతూ ఉన్నాయి.

5

5

అదేవిధంగా వ్యక్తిగత సమాచారం కూడా 21 శాతం తగ్గుతోంది. ప్రజలు ఫేస్ బుక్ టన్నుల సమాచారం షేర్ చేస్తున్నారని, కానీ మొత్తంగా చూస్తే అదంత ఎక్కువ సమాచారం కాదని ఫేస్‌బుక్ అధికారికంగా తెలుపుతోంది.

6

6

సోషల్ నెట్ వర్క్ సైట్లలోనే వ్యక్తిగత సమాచారం షేరింగ్ తగ్గుతోందని తెలిపింది. దీనిపై ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ ఉద్యోగులతో చర్చించినట్టు సమాచారం. 'కంటెంట్ పరంగా పతనం' ప్రధానమైన అంశంగా ఫేస్ బుక్ ఉద్యోగులు దీనిపై విశ్లేషించనున్నారు.

7

7

పరిమితులు లేని యూజర్లు ఇంటర్ నెట్ వినియోగదారులుగా ఉండటం, సన్నిహితం కాని వారికి కూడా ఇది ఉద్దేశించడటంతో కంటెంట్ పరంగా పతనమవుతోందని భావిస్తున్నారు.

8

8

వ్యక్తిగత సమాచార షేరింగ్ ఇప్పుడే ఫేస్‌బుక్ పై ప్రభావం చూపదని, కానీ ఇది ఇలాగే కొనసాగటం మంచిది కాదని విశ్లేషకులంటున్నారు.ఇది ఇలాగే కొనసాగితే రాను రాను ఫేస్‌బుక్ పతనం కాక తప్పదని పలువురు చెబుతున్నారు.

9

9

మరి ఇది నిజంగానే జరిగితే ఫేస్‌బుక్ పెద్ద ప్రమాదంలో పడినట్లే. ఏం జరుగుతుందో ముందు ముందు చూడాలి.

10

10

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇక్కడ క్లిక్ చేపి పొందగలరు.

 

 

Best Mobiles in India

English summary
Here Write Facebook Is Trying to Get Its Users to Share More About Their Personal Lives

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X