ఫేస్‌బుక్ ఆఫీసు అద్దాలు పగిలాయి

Written By:

ఫేస్‌బుక్ ఆఫీసు అద్దాలు పగిలాయి ఏందీ నమ్మలేకున్నారా.. ఇది నిజం. జరిగింది ఎక్కడో కాదు జర్మనీలో.. 20 మంది వ్యక్తుల గుంపుగా వచ్చి ఫేస్‌బుక్ ఆపీసును బద్దలు బద్దలు చేశారు. చేసిన తర్వాత కామ్ గా వెళ్లారా అంటే అదీ లేదు..ఏకంగా ఫేస్ బుక్ మాకు నచ్చలేదు అంటూ గోడపై ఎర్రని అక్షరాలతో రాశారు. ఆ కధేంటో చూడండి.

Read more: త్వరపడండి: దేశంలో ఎక్కడికైనా కాల్స్ ఉచితం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దాదాపు 20 మంది దాడి చేసి

దాదాపు 20 మంది దాడి చేసి

జర్మనీలో ఫేస్బుక్ కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. హాంబర్గ్లోని ఫేస్బుక్ కార్యాలయంపై దాదాపు 20 మంది దాడి చేసి అద్దాలు పగలగొట్టి, పెయింట్ చల్లారు.

కార్యాలయం ప్రవేశద్వారం వద్ద 'ఫేస్బుక్ డిజ్లైక్

కార్యాలయం ప్రవేశద్వారం వద్ద 'ఫేస్బుక్ డిజ్లైక్

కార్యాలయం ప్రవేశద్వారం వద్ద 'ఫేస్బుక్ డిజ్లైక్' అని రాసినట్టు జర్మన్ మీడియా వెల్లడించింది.

దాడి చేసిన దుండగులు నల్లటి దుస్తులు

దాడి చేసిన దుండగులు నల్లటి దుస్తులు

దాడి చేసిన దుండగులు నల్లటి దుస్తులు, ముసుగులు ధరించినట్టు హాంబర్గ్ పోలీసులు చెప్పారు.

ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్న జాతి వివక్ష వ్యాఖ్యల వల్ల

ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్న జాతి వివక్ష వ్యాఖ్యల వల్ల

ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్న జాతి వివక్ష వ్యాఖ్యల వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని జర్మనీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రసంగాలను తొలగించడంలో విఫలమైనందుకు

ప్రసంగాలను తొలగించడంలో విఫలమైనందుకు

ఇక ఫేస్బుక్లో పోస్ట్ చేసిన జాతిని రెచ్చగొట్టే ప్రసంగాలను తొలగించడంలో విఫలమైనందుకు ఫేస్బుక్ యూరప్ విభాగం చీఫ్ జర్మనీలో విచారణ ఎదుర్కొంటున్నారు.

జర్మనీ చట్టాలను తాము ఉల్లంఘించలేదని

జర్మనీ చట్టాలను తాము ఉల్లంఘించలేదని

కాగా జర్మనీ చట్టాలను తాము ఉల్లంఘించలేదని ఫేస్బుక్ ప్రతినిధి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Facebook offices in Hamburg vandalised
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot