నిర్లక్ష్యానికి ఫేస్‌బుక్ భారీ మూల్యం

Posted By:

నిర్లక్ష్యానికి ఫేస్‌బుక్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఫేస్‌బుక్ లో వయసును నిర్థారించే వ్యవస్థ లేకపోవడంతో చిన్న పిల్లలు కూడా ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ నమోదైన కేసులో ఫేస్‌బుక్ పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ఫేస్‌బుక్ లో ఖాతా తెరవాలంటే కనీసం 18 ఏళ్లు ఉండాలి. కానీ 11 ఏళ్ల వయసులోనే ఓ అమ్మాయికి అకౌంట్ ఇచ్చి ఆమె ఆన్ లైన్ లో లైంగిక వేధింపులకు గురవ్వడానికి కారణమైనందుకు పరిహారం చెల్లిస్తానని ఫేస్‌బుక్ అంగీకరించింది. కోర్టు వెలుపల కుదుర్చుకున్న ఈ ఒప్పందంలో ఎంత మొత్తం ఇచ్చేది మాత్రం బయటకు తెలియలేదు.

Read more: తప్పు ఎత్తి చూపిస్తే ఫేస్ బుక్ ఉద్యోగం పీకేసింది

తగినంత వయసు లేని వారికి అకౌంట్ ఇవ్వకూడదన్న నిబంధనను అతిక్రమించినందుకు ఫేస్‌బుక్‌పై ఆ చిన్నారి తండ్రి దావా వేశారు. నాలుగేళ్ల పాటు తర్జనభర్జనలు జరిగిన తర్వాత గత వారం కోర్టులో విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. ఆ అమ్మాయి తన అసభ్య ఫోటోలను తెలియక ఆన్‌లైన్ లో పోస్ట్ చేసింది. దీంతో పాటు అనేక ఫేస్‌బుక్ అకౌంట్లను తెరిచి చాలామంది మగవాళ్లను కాంటాక్ట్ చేసిందని కేసు పత్రాల్లో పేర్కొన్నారు. తర్వాత అకౌంట్లను ఫేస్‌బుక్ తొలగించింది. అయితే చిన్న పిల్లలకు అకౌంట్ ఇవ్వడమే ఫేస్‌బుక్ నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని యూజర్లు తమ వయసు తప్పుగా పేర్కొన్నా వాళ్లని ఆపేందుకు ఎలాంటి వ్యవస్థా లేదని అమ్మాయి తండ్రి తరపు న్యాయవాది పేర్కొన్నారు. అయితే మీరు కూడా ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తున్నారా అయితే క్రింది జాగ్రత్తలు పాటించండి

Read more : లీకయిన అక్రమ సంబంధాల పాస్‌వర్డ్ ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1. ఓవర్ షేరింగ్

చాలా మంది నెటిజన్లు ఎదుర్కుంటున్న సమస్య ఇదే. షేరింగ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. కాని దానివల్ల లాభం ఎంత ఉందో గ్రహించరు.కాని షేర్ చేయడమే పనిగా పెట్టుకుంటారు కొంతమంది. కాబట్టి ఓవర్ షేరింగ్ పై ఒక కన్నేస్తే మంచిదే.

2. ఒకసారి చెక్ చేసుకోండి

మీరు పోస్ట్ చేసిన పోస్ట్ లను ఓ సారి చెక్ చేసుకుంటే మంచిదే కదా. ఎందుకంటే మనం ఏ మూడ్ లో ఉండి పోస్ట్ చేశామో తెలుసుుకోవడానికి వీలుంటుంది. బాగా లేకపోతే వెంటనే తీసేయవచ్చు.

3.ఇమేజ్ లతో అప్ సెట్ అవుతున్నారా..?

మీరు ఒక 15 నిమిషాలు నీ స్టేటస్ లో ఏమి అప్ డేట్ చేసుకోవాలన్నది ఆలోచించావంటే నీ పని మరింత సులువు అవుతుంది. మీరు దేని మీద పోస్ట్ చేయాలనుకుంటున్నావో దాని మీదే పోస్ట్ చేయండి. కొత్త వాటి మీదకి వెళ్లే ముందు ఓ సారి చెక్ చేసుకోండి.

4.ఫేస్ బుక్ రిపోర్టింగ్

మీకున్న చాలామంది ఫ్రెండ్స్ మీరు చేసే పోస్టులను తప్పక చూస్తుంటారు.మీ పోస్టులు చూసిన వారి రియాక్షన్ ఏంటో తెలుసుకుంటే మంచిదే.

5.టైం కేటాయింపు

ఫేస్ బుక్ కోసం ప్రతి రోజూ కొంత టైం కేటాయించుకుంటే మంచిది. ఆ టైంలో మీరు ఫేస్ బుక్ లోకి వస్తారని మీ ఫ్రెండ్స్ కి కూడా తెలిసిపోతోంది. సో మీకు టైం సేవ్ అవుతుంది.

6.ఫ్రెండ్స్ యాడ్

సాధారణంగా అందరూ వీలయినంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే గర్వంగా పీలవుతారు..అలాగని అందరూ యాడ్ రిక్వస్ట్ పంపిన వారినందరినీ యాడ్ చేసుకుంటారు ఈ విషయంలో కూడా ఒకసారి ఆలోచిస్తే మనకే మంచిది.

7.రియల్ లైఫ్ లో భాగస్వామ్యం

మీరు ఎక్కువగా ఫేస్ బుక్ లో కమ్యూనికేట్ అయ్యేకంటే రియల్ గా కమ్యూనికేట్ అయితే ఎలా ఉంటుందో ఓ సారి ఆలోచించండి. మీరు సోషల్ మీడియాలో కన్నా రియల్ లైప్ లో కమ్యూనికేట్ అయితే గుర్తింపు వస్తుందన్న విషయాన్ని మరచి పోకండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write Facebook Pays for 'Allowing' Underage Girl to Sign Up
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot