లీకయిన అక్రమ సంబంధాల పాస్‌వర్డ్ ఇదే

Posted By:

అక్రమసంబంధాల‌ వెబ్‌సైట్ ఆహ్లే మాడిసన్ పై హ్యాకర్ల అటాక్ తరువాత యూజర్లకు సంబంధించిన ప్రైవేట్ చిత్రాలు వెలుగులోకి రాగా పరువు పోయిందన్న మనస్థాపంతో పలువురు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే.ఇప్పుడు తాజాగా యూజర్లు, వారి పాస్ట్‌వర్డ్ ల వివరాలు వెలుగులోకి వచ్చాయి. సైనోష్యూర్ ఫ్రైమ్ పేరిట ఉన్న హ్యాకర్లు పాస్‌వర్డ్ లను డీకోడ్ చేశారు. ఈ వెబ్ సైట్ యూజర్లలో అత్యధికులు వాడుతున్న పాస్‌వర్డ్ 123456 దీని తర్వాత అత్యధికులు 12345 డిఫాల్ట్ 123456789 లను వినియోగిస్తున్నారు.

Read more : సెక్స్ మోజు రూ.30 వేలు క్లోజు

కామన్ పాస్‌వర్డ్ లు వాడటం అందరికీ తెలిసిన వరుస సంఖ్యలు ఉండటంతో బ్యాడ్ గైస్ సులువుగా వీటిని హ్యాక్ చేస్తున్నారని టెక్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా పాస్‌వర్డ్ లు బహిర్గతమైన విషయం స్పందించేందుకు ఆహ్లే మాడిసన్ అధికారులు ఇప్పుడు అందుబాటులో లేరని సమాచారం.ఈ సైట్ లో ఒక్కోక్కరిది ఒక్కో రకమైన గాధ.. ఈ కథలను విష్పర్ అనే యాప్ ద్వారా హ్యాకర్లు బయటపెట్టిన విషయం విదితమే..హ్యాకర్లు బయటపెట్టిన వారి గాథల్లో ఎన్నో ప్రతీకారాలు.. అలాగే స్పందనలు ఉన్నాయి.

Read more : భారత్‌లో బూతు సైట్ల పై బ్యాన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నా ప్రేయసిని కోల్పోయాను

నా ప్రేయసిని కోల్పోయాను నా ఇల్లు కూడా పోయింది. పిల్లలకు మొహం కూడా చూపించలేకపోతున్నానంటూ ఒకరు ఆ సైట్ లో తన ఆవేదనను వెలిబుచ్చారట

ఒక్కసారిగా తలకిందులైపోయింది

నా ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైపోయింది. సమాజంలో మొహం ఎత్తుకోలేకపోతున్నాననేది మరొకరి గాధ

నన్ను విడిచి వెళ్లిపోయింది

నేను చీట్ చేశాను కాని నేను దొరకలేదు మరొకరితో రాసక్రీడలు సాగిస్తున్న నా ప్రేయసి దొరికిపోయింది. అయినా ఆమెను క్షమించేశాను అయినా ఆమె నన్ను విడిచి వెళ్లిపోయింది..ఇది మరొకరి ఆవేదన

ఇంకేమాత్రం భరించలేను

నా మనసంతా కకావికలమైంది గుట్టు చప్పుడు కాకుండా మరొకరితో నేను సాగిస్తున్న సంబంధాలను ఇంకేమాత్రం భరించలేను అందుకు స్వస్తి చెబుతున్నా అనేది మరొకరి రియాక్షన్

క్షమించమని వేడుకున్నా

నేను చేసిన చీటింగ్ కు క్షమించమని వేడుకున్నా అయినా నా ప్రేయసి నన్ను కాదని వెళ్లిపోయిందంటూ ఓ రాసలీలుడు తన కథను అందులో వినిపించాడు

ప్రతీకార స్పందనలు కూడా అనేకం

అయితే కథలతో పాటు ప్రతీకార స్పందనలు కూడా అనేకం ఉన్నాయి. నేను ఆయన కోసం షాపింగ్ చేస్తుంటే అక్కడ మరో యువతితో కులుకుతాడా అందుకు ప్రతీకారం తీర్చుకోవడం కోసమే నేను మరొక యువకుడితో రాత్రి గడిపానంటూ ఓ యువతి తన ఆక్రోశాన్ని అందులో పోసింది.

అక్రమ సంబంధాలు లీక్

ఈ దెబ్బతో అక్రమ సంబంధాలు లీక్ అయ్యాయని యాష్లే మాడిసన్ వెబ్‌సైట్ వినియోగదారులు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తమ రంకు బాగోతం బయటకు తెలియడమే ఇందుకు కారణం.

హ్యకర్లు బేరసారాలకు..

యాష్లే మాడిసన్ వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడి చేసి అందులో అక్రమ సంబంధాలు నెరపుతున్నవారి సమాచారాన్ని తస్కరించిన విషయం తెలిసిందే. తమకు కోరినంత డబ్బు ఇవ్వాలని లేకుంటే ఆ సమాచారాన్ని లీక్ చేస్తామని హ్యకర్లు బేరసారాలకు దిగారు. వారు కోరినంత మొత్తము ఇవ్వలేమని సదరు వెబ్‌సైట్ చేతులెత్తేసింది.

విడతల వారీగా హ్యాకర్లు విడుదల

దీనితో సుఖ జీవుల పేర్లను విడతల వారీగా హ్యాకర్లు విడుదల చేస్తున్నారు.ఇప్పటివరకు ఇలా 3 కోట్ల అక్రమ సంబంధాల గుట్టు విప్పేసింది. ఆ దెబ్బతో యాష్లే మాడిసన్ వినియోగదార్లు తమ కొంప కొల్లేరు అయిందని లబోదిబోమన్నారు. 

హ్యాకర్లను పట్టిచ్చిన వారికి రెండున్నర కోట్ల రూపాయల నజరానా

పరిస్థితి చేయి దాటిపోంతుందని తలచిన పోలీసులు హ్యాకర్లను పట్టుకునే పనిలో పడ్డారు. అటు యాష్లే మాడిసన్ వెబ్‌సైట్ మాతృ సంస్థ అవిద్ లైఫ్ మీడియా కూడా రంగంలోకి దూకింది. హ్యాకర్లను పట్టిచ్చిన వారికి రెండున్నర కోట్ల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించింది.

ఈ జీవితం చిన్నది..ఎఫైర్ పెట్టుకో

యాష్లే మాడిసన్ వెబ్‌సైట్ ఈ జీవితం చిన్నది..ఎఫైర్ పెట్టుకో అనే నినాదంతో ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్‌గా పని చేస్తోంది. 

భాగస్వాముల దగ్గర మొఖం చెల్లక..

కొందరు జీవిత భాగస్వాముల దగ్గర మొఖం చెల్లక తీవ్ర మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

బ్రిటన్ ఎమ్‌పీలు, వైట్ హౌజ్ ప్రముఖులు..

దీనికి 46 దేశాల్లో వినియోగదారులు ఉన్నారు. బ్రిటన్ ఎమ్‌పీలు, వైట్ హౌజ్ ప్రముఖులు సైతం ఇందులో సభ్యులుగా ఉన్నారని వార్తలు వచ్చాయి.

విష్పర్ యాప్ 2012లో ప్రారంభం

అయితే కథలను బయటపెట్టిన విష్పర్ యాప్ 2012లో ప్రారంభమయింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు ఉన్నారు. ఈ యాప్ లో మీ పేరు ఊరు లేకుండా ఫోన్ నెంబర్ లేకుండా సందేశాలను పంపే వీలుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write The Top Ashley Madison Passwords Leaked, And Boy Howdy Were They Dumb
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot