10 ఏళ్ల పిల్లాడికి ఫేస్‌బుక్ నుంచి రూ. 60 లక్షలు

Written By:

ఆ పిల్లాడి వయస్సు 10 సంవత్సరాలు. అయితేనేమి 60 ఏళ్ల మహామహులు చేయలనేని పనిని చేసి లక్షలు కొల్లగొట్టాడు. ఫేస్‌బుక్ ఫోటోషేరింగ్ వేదిక ఇన్ స్టాగ్రామ్‌లో పెద్ద లోపాన్ని సవరించినందుకు ఫేస్‌బుక్ అ బాలుడికి భారీ నజరానాననే ప్రకటించింది. దాదాపు 60 లక్షల రూపాయలను బహుమతిగా ప్రకటించింది.

Read more: ఒక్క ఫోటో రూ. 40 లక్షల ఉద్యోగానికి ఎసరు తెచ్చింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 ఏళ్ల పిల్లాడికి ఫేస్‌బుక్ నుంచి రూ. 60 లక్షలు

ఫేస్‌బుక్‌ సంస్థ సొంతం చేసుకున్న ఫొటో షేరింగ్‌ సైట్‌ ఇన్‌స్టాగ్రాంలో ఓ బుడతడు బగ్‌ని పట్టేశాడు. అందుకు ప్రతిగా ఫేస్‌బుక్‌ సంస్థ నుంచి 10,000 డాలర్ల రివార్డును సొంతం చేసుకున్నాడు.

10 ఏళ్ల పిల్లాడికి ఫేస్‌బుక్ నుంచి రూ. 60 లక్షలు

ఫోటో షేరింగ్ ఇన్ స్టాగ్రామ్ లో వున్న సెక్యూరిటీ లోపాన్ని అంటే కంటెంట్ ను, కామెంట్లను తొలగించడానికి అనుమతిస్తున్న ఒక బగ్ ని కనుగొన్నాడు. దానికి సంబంధించిన కోడ్ రూపొందించాడు.

10 ఏళ్ల పిల్లాడికి ఫేస్‌బుక్ నుంచి రూ. 60 లక్షలు

భద్రతాపరమైన లోపం ఉందని నిర్ధారించుకోగానే ఈ-మెయిల్ ద్వారా ఫేస్‌బుక్‌కు మెసేజ్ పెట్టాడు. ఈ కోడ్ మార్చడం ద్వారా ఈ సామాజిక మీడియా వేదికలోని ఎవరి కామెంట్ నైనా తాను డిలిట్ చేయగలనని చెప్పాడు.

10 ఏళ్ల పిల్లాడికి ఫేస్‌బుక్ నుంచి రూ. 60 లక్షలు

అయితే ఈ బగ్‌ను ఫిబ్రవరిలో ఫేస్‌బుక్ అధికారులు సరి చేశారు. అయినప్పటికీ సంస్థ ఒక టెస్టింగ్‌ ఖాతాను పంపించి దానిలో ఉన్న కంటెంట్‌ని డిలిట్‌ చేయాల్సిందిగా సూచించింది. జానీ ఆ పని చేసి చూపాడు. దీంతో మళ్లీ ఆ బగ్‌ని పరిష్కరించేందుకు సంస్థ అధికారులు సమాయత్తమయ్యారు.

10 ఏళ్ల పిల్లాడికి ఫేస్‌బుక్ నుంచి రూ. 60 లక్షలు

ఒక కోడ్‌ని మార్చి మార్చి వాడటం ద్వారా ఇన్‌స్టాగ్రాంలో రాసిన కంటెంట్‌ని డిలిట్‌ చెయ్యడం సాధ్యమవుతోందని చెప్పాడు. ఈ బగ్ ని కనుగొన్నందుకు గాను జానీకి 60 లక్షల రివార్డును అందించారు. చిన్న వయసులోనే ఈ రివార్డును దక్కించుకుని జానీ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

10 ఏళ్ల పిల్లాడికి ఫేస్‌బుక్ నుంచి రూ. 60 లక్షలు

వెంచర్ బీట్ . కాం ఈ విషయాన్ని రిపోర్టు చేసింది. సెక్యూరిటీ రీసెర్చర్ కావాలని కలలు కంటున్న జానీ దీనిపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సొమ్ముతో తనకొక కొత్తబైక్, ఫుట్ బాల్ గేర్, తన సోదరుల కోసం రెండు కంప్యూటర్ లను కొనుగోలు చేయనున్నట్టు తెలిపాడు.

10 ఏళ్ల పిల్లాడికి ఫేస్‌బుక్ నుంచి రూ. 60 లక్షలు

కాగా బగ్‌ బౌంటీ (వితరణ) కార్యక్రమంలో భాగంగా దాదాపు 800 మంది పరిశోధకులకు 4.3 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు ఇటీవల ఫేస్‌బుక్‌ ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక భద్రతా పరిశోధకులు (205) భారత్‌లోనే ఉన్నారు అని పేర్కొంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Facebook rewarded a 10-year-old with $10,000 for finding Instagram security flaw
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot