కాంట్రాక్ట్ కార్మికులకు ఫేస్‌బుక్ వరాల జల్లులు

Posted By:

తమ ప్రధాన కార్యాలయంతో పాటు తమ సంస్థ తరుపున అమెరికాలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ వరాల జల్లులను కురిపించింది. వారికి వేతనాల పెంపుతో పాటు ఇతరు సౌకర్యాలను కల్పించాలని ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం కాంట్రాక్టు కార్మికులకు గంటకు సుమారు రూ.1000 కనీస వేతనం లభిస్తుంది.

కాంట్రాక్ట్ కార్మికులకు ఫేస్‌బుక్ వరాల జల్లులు

అలానే ఏడాదికి వేతనంతో కూడిన 15 సెలవలను పొందవచ్చు. ఇక ప్రసవ సమయంలో మహిళా ఉద్యోగులకు రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఫేస్‌బుక్ అందించనుంది. కాంట్రాక్టు ఉద్యోగులకు లబ్థి చేకూర్చే క్రమంలో విశాల దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫేస్ బుక్ సీఓఓ షెరిల్ శ్యాండ్ బర్గ్ వెల్లడించారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ప్రకటించటం ద్వారా వారు సంతోషంగా ఉంటారని, ఫలితంగా పనితీరు మరింత మెరుగుపడుతుందని ఆమె వివరించారు.

(ఇంకా చదవండి: ఆండ్రాయిడ్ పోన్ అరచేతిలో ఉంటే..?)

English summary
Facebook sets improved wage benefits to contract workers. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot