మోజు .. వీళ్లకు తగ్గింది, వాళ్లకి పెరిగింది

Posted By:

ఫేస్‌బుక్,ట్విట్టర్..ఈ రోజుల్లో ఈ సోషల్ వేదికలో అకౌంట్ లేని వారిని వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు..ఎవర్ని కదలించినా ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా అని అడుగుతుంటారు..అయితే ఇప్పుడు ఈ ఫేస్‌బుక్ లో పురుషులకన్నా మహిళలే ఎక్కువగా యాక్టివ్‌గా ఉన్నారట. చిత్రంగా ఉంది కదా...ఇక నూతన వినియోగదారులను ఆకర్షించడంలో సోషల్ మీడియా వేదికలు ఫేస్‌బుక్,ట్విట్టర్లు విఫలమవుతున్నాయట.ఈ విషయాలన్నీ ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఫేస్‌బుక్,ట్విట్టర్లు ఒకస్థాయి ప్రజలకు మాత్రమే అందుబాటులో పరిమితమయ్యాయని కొత్తవారిని ఆకట్టుకోవడంలో అంతగా సఫలం కాలేదని సర్వే తెలిపింది. మరి ఏ సోషల్ వేదికలు పుంజుకుంటున్నాయో ఓ సారి చూద్దాం.

Read more : కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇన్‌స్టా‌గ్రామ్ కొత్త ఖాతాదారులను ఆకట్టుకోవడంలో ముందు

ఫేస్‌బుక్,ట్విట్టర్ల తరువాత రంగప్రవేశం చేసిన పింటెరెస్ట్ ,ఇన్‌స్టా‌గ్రామ్ కొత్త ఖాతాదారులను ఆకట్టుకోవడంలో ముందున్నాయని సర్వే తెలిపింది. గత మూడేళ్లలో పింటెరెప్ట్ ,ఇన్‌స్టాగ్రామ్, ఖాతాదారులు రెండింతలయ్యారని సర్వే తెలిపింది.

పింటెరెస్ట్ కు 31 శాతం మంది వినియోగదారులు

ప్రస్తుతం పింటెరెస్ట్ కు 31 శాతం మంది వినియోగదారులు ఉన్నారు.2012లో కేవలం 15 శాతం మాత్రమే ఉన్నారు.

ఇన్‌స్టా‌గ్రామ్ కు ప్రస్తుతం 28 శాతం మంది వినియోగదారులు

ఇన్‌స్టా‌గ్రామ్ కు ప్రస్తుతం 28 శాతం మంది వినియోగదారులు ఉన్నారు. 2012లో కేవలం 13 శాతం మంది మాత్రమే ఉన్నారు.

మహిళల్లో 72 శాతం ఫేస్‌బుక్ వినియోగం

ఏదేమైనా ఫేస్‌బుక్ అతిపెద్ద సోషల్ నెట్ వర్కింగ్ సైట్ గా మొదటి స్థానంలో ఉంది. ప్రత్యేకించి మహిళలో 72 శాతం ఫేస్‌బుక్ వినియోగిస్తున్నారు.మరే ఇతర సామాజిక వేదికకు ఇంత పెద్ద మొత్తంలో వినియోగదారులు లేరని పీసీ మ్యాగజైన్ పేర్కొంది.

ఇప్పటికీ22 శాతం మంది వ్యక్తులు వినియోగం

గడిచిన మూడేళ్లలో లింక్‌డ్‌ఇన్ సామాజిక వేదిక వినియోగంలో క్షీణత నమోదైనప్పటికీ కొత్తవారిని ఆకర్షించడంలో ముందుంటోందని వెల్లడించింది.ఇప్పటికీ22 శాతం మంది వ్యక్తులు రోజూ దీన్ని వినియోగిస్తున్నారని తెలిపింది.

సామాజిక అవసరాలకు అనుగుణంగా సేవలు

ఒక్కసారిగా ఆవిర్భవించిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు వివిధ సామాజిక అవసరాలకు అనుగుణంగా సేవలందిస్తున్నాయని సర్వే తెలిపింది.

అమెరికాలో ఫేస్‌బుక్ ప్రధమ స్థానం

అయితే అమెరికాలో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఇప్పటికీ ఫేస్‌బుక్ ప్రధమ స్థానంలో ఉంది. 72 శాతం మంది ఫేస్‌బుక్ ను,23 శాతం మంది మాత్రమే ట్విట్టర్ ఖాతాలను వాడుతున్నారని ప్యూ సంస్థ వివరించింది.

సర్వే వెల్లడించిన పీజీ మ్యాగజైన్

సర్వే వెల్లడించిన మ్యాగజైన్ ఇదే 

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్‌లను నేరుగా మీ ఫేస్‌బుక్ పేజీలో చూడండి. 

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
While Facebook and Twitter have a dedicated user base that constantly use the social networking sites, they fail to attract more new users, according to a new survey.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot