కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు

|

శత్రువును యుద్ధరంగంలో ఎదుర్కోవడం అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు కత్తులు, తుపాకులు, బాంబులు ఇలాంటివేవీ లేకుండానే యుద్ధం చేసుకోవచ్చు. చుక్క రక్తం బొట్టు చిందించకుండా వ్యవస్థలను కుప్ప కూల్చవచ్చు. అదే సైబర్ స్పేస్ ..ఇక్కడ వైరస్ లే వజ్రాయుధాలు ...మాల్ వేర్ లే పాశుపతాస్త్రాలు...ఇదే నయా జమానా సైబర్,స్పేస్ వార్ .. మూడు అగ్ర దేశాల మధ్య కమ్మకుంటున్న సైబర్,స్పేస్ యుద్ధమేఘాలపై ఓ లుక్కేద్దాం.

Read more : భయానక మెరుపులు, గూగుల్ డేటా గల్లంతు!

 సైబర్ వార్
 

సైబర్ వార్

ప్రపంచమంతా సాలెగూడులా మారిన వెబ్ ప్రపంచంలో దేశాలు ఈ వెబ్ ప్రపంచంలోనే పోరాటాలు చేసుకుంటున్నాయి. క్షణాల్లో వ్యవస్థలను కుప్ప కూల్చి ఆర్థిక సౌధాలను కూల్చివేస్తున్నాయి. అధునాతన టెక్నాలజీనే బ్రహ్మాస్త్రంగా చేసుకొని అగ్రరాజ్యంతో పాటూ వివిధ దేశాలపై ప్రయోగిస్తూ అందరినీ ముప్పుతిప్పలు పెడుతూ తెరలేచింది సైబర్ వార్ ..

ఆధిపత్య పోరు

ఆధిపత్య పోరు

స్పుత్నిక్-1 ప్రయోగంతో సోవియట్ యూనియన్,అమెరికాల మధ్య అంతరిక్ష రంగంలో ఆధిపత్య పోరు మొదలైంది. అమెరికా చంద్రుడిపై మానవసహిత ప్రయోగాన్ని చేపట్టక మునుపు అనేకసార్లు రష్యా అంతరిక్షనౌకలు చంద్రుడిపై ఎన్నో పరిశోధనలు నిర్వహించి,చంద్రుడి శిలల నమూనాలను భూమికి తీసుకురాగలిగాయి.

అన్ని దేశాలకు సవాల్

అన్ని దేశాలకు సవాల్

1990 దశకం మొదట్లో 16 దేశాలు పాల్గొనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐ.ఎస్.ఎస్)నిర్మాణానికి అమెరికా,రష్యా మధ్య ఒప్పందం కుదరడంతో అంతరిక్షరంగంలో ఆధిపత్య పోరు అంతర్జాతీయ అంతరిక్ష సహకారంగా మారింది. ఇప్పడు అది సైబర్ వార్ గా మారి అన్ని దేశాలకు సవాల్ విసురుతోంది.

దిసీజ్ జస్ట్ ది బిగినింగ్
 

దిసీజ్ జస్ట్ ది బిగినింగ్

అది 2014 నవంబర్ 24 అమెరికా సినిమా ప్రపంచం హాలీవుడ్లోని కల్వర్ సిటీలో ఉన్న సోనీ పిక్చర్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల అందరి కంప్యూటర్ల స్క్రీన్ మీదా పుర్రె బొమ్మ ప్రత్యక్షమైంది. 'దిసీజ్ జస్ట్ ది బిగినింగ్ ..' అంటూ ఓ మెసేజ్. ఆ తర్వాత కంప్యూటర్లేవీ ఓపెన్ కాలేదు. టెలిఫోన్లూ మూగపోయాయి.

సోని సంస్థ విలవిల

సోని సంస్థ విలవిల

ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సోనీ సంస్థ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురయ్యింది. సంస్థ కంప్యూటర్లన్నీ హ్యాకింగ్ కి గురయ్యాయి. కనీసం 100 టెరాబైట్ల సమాచారం దుండగుల చేత చిక్కిందని సోని అంచనా వేసింది. అంటే సోనీకి కలిగిన నష్టం ఊహించుకోవచ్చు. ఈ దెబ్బకు సోని సంస్థ విలవిలలాడిపోయింది. అధ్యక్షుడు ఒబామా ఆరా తీసి విచారణకు ఆదేశించారంటే ఎంత నష్టం వాటిల్లిందో అర్థం చేసుకోవచ్చు.

మూడు నెలల ముందు నుంచే బెదిరింపులు

మూడు నెలల ముందు నుంచే బెదిరింపులు

ఇంటర్వ్యూ' చిత్రం పట్ల నిరసనగా ఉత్తర కొరియా దేశం జరిపించిందేమోనన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎందుకంటే 'ఇంటర్వ్యూ' చిత్రం ఉత్తర కొరియా అధ్యక్షుడు ''కిమ్ జంగ్ అన్'' పై సెటైర్ గా సాగుతుందని బయటకు పొక్కడమే సమస్యకు కారణమైంది. 'ఈ చిత్రాన్ని నిలిపివేయకపోతే సెప్టెంబర్ 11 న అమెరికా చవి చూసిన ఘోరాల్లాంటివి పునరావృతమవుతాయి' అంటూ హ్యాకర్ల నుంచి మూడు నెలల ముందు నుంచే బెదిరింపులు మొదలయ్యాయి.

రాజకీయ వివాదం

రాజకీయ వివాదం

దాంతో సినిమా ప్రదర్శనకు థియేటర్ల వారు కూడా వెనుకంజ వేశారు. ఇక సోనీ సంస్థ ఎదుర్కొన్న ఇబ్బందులకు లెక్కలేదు. ఈ వ్యవహారాన్ని ఉత్తర కొరియా వెనక నుండి నడిపిస్తోందనే ఆరోపణలు కూడా తలెత్తిన నేపథ్యంలో దీనికి రాజకీయ వివాదం కూడా తోడైంది. ఇక ఇదే అదనుగా భావించిన పెద్దన్న అమెరికా కమ్యూనిస్టు ఉత్తర కొరియాను ఇబ్బందుల్లో నెట్టేందుకు రంగం సిద్ధం చేసింది.

సైబర్ వార్ కు తెర

సైబర్ వార్ కు తెర

ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండా ఓ ఉత్తర కొరియాను దొంగగా చూపిస్తూ సైబర్ వార్ కు తెరతీసింది. ఈ హ్యాకింగ్ తో తనకు సంబంధం లేదని ఉత్తర కొరియా ప్రకటించినా అమెరికా పట్టించుకోలేదు. అంతేనా 2014 డిసెంబర్ 22న ఉత్తరకొరియాకు చెందిన ఇంటర్ నెట్ సర్వీసెస్ ను 9 గంటల పాటు నిలిపివేసి ఇబ్బందుల్లోకి నెట్టింది.

అన్నీ హ్యాక్

అన్నీ హ్యాక్

అమెరికా ఉత్తర కొరియా బ్యాంకులు, ఆసుపత్రులు, అత్యవసర సర్వీసులు, చివరికి అణురియాక్టర్లను దెబ్బతీసేలా వారి ఇంట్రానెట్ సర్వీసులను హాక్ చేసింది.

సైబర్ వార్ కలిగించే నష్టాలు

సైబర్ వార్ కలిగించే నష్టాలు

నిజానికి సైబర్ వార్ కలిగించే నష్టాలు అన్నీ ఇన్నీ కావు..ఆధునిక యుగంలో ప్రతీది సైబర్ ప్రపంచంతోనే ముడిపడిపోయింది. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలు, ఇతర వస్తు సేవలు,టెలీ కమ్యూనికేషన్స్, రక్షణ, చివరికి ఇంటర్నెట్ లో మనం దాచుకున్న ఈ మెయిల్స్...విలువైన డాటా అన్ని సైబర్ ప్రపంచంలోనే నిలవుంటున్నాయి.

అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న సైబర్ వార్

అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న సైబర్ వార్

అంతేకాదు ఇక అంతర్జాతీయంగా అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న సైబర్ వార్ కు అంతం లేకుండా పోతోంది. 2013 సంవత్సరంలో చైనా దేశం పైన జరిగిన హ్యాకింగ్ దాడుల్లో సగానికి పైన అమెరికానుండి వచ్చినవేనని చైనా ప్రభుత్వం ఆరోపించింది. నిజమే ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనాను దెబ్బతీసేందుకు అమెరికా లాంటి అంతర్జాతీయ ఉగ్రవాదికి సైబర్ వార్ ను మించిన అవకాశం లేదు.

సైబర్ వార్

సైబర్ వార్

వాస్తవానికి గూగుల్ , ఫేస్ బుక్ లాంటి సైట్లకు చైనాలో ప్రవేశం లేదు. ఎందుకంటే చైనాను సైబర్ స్పేస్ లో దెబ్బతీసేందుకు గూగుల్ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. సైబర్ విషయానికి వస్తే 2013 సంవత్సరంలో 2,196 కంట్రోల్ సర్వర్లు చైనా లోని 1.29 మిలియన్ల కంప్యూటర్లను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయని చైనా వార్తాసంస్థ వెల్లడించింది.

గ్రేట్ ఫైర్ వాల్ ఆఫ్ చైనా

గ్రేట్ ఫైర్ వాల్ ఆఫ్ చైనా

అమెరికా చేస్తున్న దాడుల నుంచి తట్టుకునేందుకు చైనా ధృఢంగా నిలబడింది. ప్రస్తుతం చైనా...అమెరికా సైబర్ నుంచి బయట పడేందుకు ‘గ్రేట్ ఫైర్ వాల్ ఆఫ్ చైనా‘ పేరుతో చైనా ప్రభుత్వం దేశంలోకి వచ్చే ఇంటర్నెట్ సమాచారం పైన గట్టి నిఘా ఉంచుతుంది.

సైబర్ నిపుణులు

సైబర్ నిపుణులు

ఐటీలో అగ్రరాజ్యంగా చెప్పుకునే భారత్ లో కేవలం 556 మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఉన్నారు. అదే చైనాలో 1.25 లక్షల మంది ఉన్నారు. రష్యాలో 7,300 మందీ ఉన్నారు.

స్పేస్ వార్

స్పేస్ వార్

సైబర్ వార్ తో పాటు మరో వార్ స్పేస్ వార్. ఏ దేశానికి ఆ దేశం శక్తివంతమైన మిస్సైల్ ను రూపొందిస్తూ మిగతా దేశాలకు సవాల్ విసురుతున్నాయి

మూడవ ప్రపంచ యుద్ధమే

మూడవ ప్రపంచ యుద్ధమే

అంతరిక్షంలోకి పంపే శాటిలైట్లతో పాటు అత్యాధునిక అణ్వస్ర్తాయుధాలను ఈ మూడు దేశాలు సీక్రెట్ గా సమకూర్చుకుంటున్నాయి.ఏదన్వానా జరగానిది జరిగితే వాటితో ఏ క్షణాల్లో అయినా దాడి చేయవచ్చు. అది జరిగితే ఇక మూడవ ప్రపంచ యుద్ధమే

 వైరానికి తెర

వైరానికి తెర

రష్యాతో స్నేహ హస్తాన్ని సాగించిన అమెరికా రష్యా ఇప్పుడు స్పేస్ రంగంలో దూసుకుపోతోందని ఆ దేశంతో వైరానికి తెరలేపింది. యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది

పెద్దన్న అంటే భయం

పెద్దన్న అంటే భయం

అమెరికా అమ్ముల పొదిలో అనేక అస్ర్తాలు ఉన్నాయి.స్నేహ హస్తం అందిస్తూనే ఎదురు తిరిగిన వారికి సరైన బుధ్ది చెప్పగలదు. అందుకే పెద్దన్న అంటే అన్ని దేశాలు భయపడతాయి

మరో వార్ కు తెర

మరో వార్ కు తెర

అంతరిక్షంలోకి అమెరికా ,చైనా,రష్యాలు శాటిలైట్లను పంపి వాటి ద్వారా భూమి మీద కంట్రోల్ చేసే మిషన్లను రూపొందించనున్నారని సమాచారం

మరో యుద్దానికి తెర

మరో యుద్దానికి తెర

ఇదే జరిగితే మరో యుద్దానికి తెర లేవక తప్పదని నిపుణులు అభిప్రాయం

ఎక్స్‌ థర్టీ సెవెన్‌-బీ అంతరిక్ష విమానం

ఎక్స్‌ థర్టీ సెవెన్‌-బీ అంతరిక్ష విమానం

అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎక్స్‌ థర్టీ సెవెన్‌-బీ అంతరిక్ష విమానం 2012లో అంతరిక్షంలోకి ఎగిరింది. మొదట ఈ విమానాన్ని 2010, ఏప్రిల్‌లో ప్రయోగించారు. అది 8 నెలల తర్వాత భూమి మీదకు తిరిగి వచ్చింది. 2011 మార్చిలో జరిగిన రెండో ప్రయోగంలో ఈ విమానం 15 నెలల పాటూ అంతరిక్షంలో ఉంది. ప్రస్తుతం పూర్తి చేసిన రహస్య యాత్ర మూడోది కాగా... నాలుగో యాత్ర 2015లో ఉంటుందని తెలుస్తోంది.

చైనా రహస్య లాబ్ కోసమేనా..

చైనా రహస్య లాబ్ కోసమేనా..

ఈ విమాన ప్రయోగం ఉద్దేశం ఏమిటనే దానిపై అమెరికా నోరు విప్పడం లేదు. చైనా అంతరిక్షంలో నెలకొల్పిన స్పేస్‌ ల్యాబ్‌ను రహస్యంగా పరిశీలించేందుకే దీనిని ఏర్పాటు చేశారనే వాదన ఒకటి వినిపిస్తోంది. ఇతర దేశాల ఉపగ్రహాలను తన అదుపులోకి తెచ్చుకోవడం దీని లక్ష్యమనేది మరో వాదన. ఈ విమానంలో రహస్య పరిశోధనకు ఉపయోగపడే అనేక పరికరాలున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

పొంతన లేని సమాధానాలు

పొంతన లేని సమాధానాలు

అయితే అమెరికా వైమానిక దళం మాత్రం ఈ వాదనలు ఖండిస్తోంది. భవిష్యత్‌లో... తిరిగి ఉపయోగించుకోగలిగే, ప్రమాదాలను తగ్గించే అంతరిక్ష విమానాలను నిర్మించడమే ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యమని అమెరికన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చెబుతోంది. తాము కేవలం అంతరిక్ష పరిభ్రమణ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించింది. అదే నిజమైతే ఈ పరిశోధనను నాసా చేపట్టాలి కానీ, అమెరికా వైమానికి దళానికి ఇలాంటి బాధ్యతలు ఎందుకు అప్పగిస్తారన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

చైనా సొంత ప్రయోగం

చైనా సొంత ప్రయోగం

ఇక రష్యాకు చైనాకు మధ్య స్పేస్ కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. చైనా శక్తివంతమైన 130 శాటిలైట్లను ఆర్బిట్ లోకి రీసెంట్ గా ప్రవేశపెట్టింది. ఇక సొంతంగా చైనాలోని తైగాంగ్ లో 2022 కల్లా స్పే శాటిలైట్ పేరుతో స్పేస్ స్టేషన్ ఓపెన్ చేయాలని చూస్తోంది.

500 శాటిలైట్లు ఆకాశంలో

500 శాటిలైట్లు ఆకాశంలో

ఇక ఆకాశంలో యునైటైడ్ స్టేట్ నుంచి దాదాపు 500 శాటిలైట్లు ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో దాదాపు 100 శాటిలైట్లు మిలిటరీ కోసం వాడుతున్నట్లుగా తెలుస్తోంది.

1200 శాటిలైట్లు ఆకాశంలో చక్కర్లు

1200 శాటిలైట్లు ఆకాశంలో చక్కర్లు

మొత్తం మీద దాదాపు 1200 శాటిలైట్లు ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ శాటిలైట్లు భూమి మీదకు సమాచారాన్ని చేరవేసేందుకు ఆకాశంలో విహరిస్తున్నాయి. వీటిలో దాదాపు 80 శాతం శాటిలైట్లు యుఎస్ మిలిటరీ తో సంబంధాలను కలిగి ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
hree leading superpowers: Russia, China and the US are reportedly developing, testing and deploying sophisticated weapons in outer space in advance of a military attack that could see the first great conflict between sparring superpowers in 70 years.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X