మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఫీచర్ తో వాయిస్ కాల్స్ సమస్యలకు చెక్....
కరోనావైరస్ కారణంగా భారత ప్రభుత్వం దేశం మొత్తాన్ని లాక్డౌన్ గా ప్రకటించింది. ఇటువంటి సమయాలలో అందరు ఇంటివద్ద ఉండడం వల్ల చాలా మంది వారి యొక్క స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడాలని ఎక్కువగా ఇష్టపడతారు.

అలాగే ఇంటి వద్ద నుండి పని చేసే వారు తమ యొక్క సహోద్యోగులతో కమ్యూనికేట్ చేయడానికి వారి స్మార్ట్‌ఫోన్‌లను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ప్రస్తుత సమయంలో వాయిస్ కాల్స్ యొక్క లోడ్ విపరీతంగా పెరిగింది. దీని కారణంగా వాయిస్ కాల్ డ్రాప్స్ ఇప్పుడు సాధారణం అయ్యాయి.

వై-ఫై కాలింగ్
మీరు అలాంటి సమస్యను ఎదుర్కొంటుంటే మరియు కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం మరియు దీనికి సంబంధించి ఫిర్యాదు చేయడం వంటివి కాకుండా కొత్తగా వచ్చిన వై-ఫై కాలింగ్‌ను ఒకసారి ప్రయత్నించండి. వై-ఫై కాలింగ్ అనేది మీ వద్దనున్న వై-ఫై కనెక్షన్‌ను ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం. ఇది అదనపు ఛార్జీలు లేకుండా మీ యొక్క ప్రస్తుత ఫోన్ నంబర్‌ను ఉపయోగించి వై-ఫై ద్వారా కాల్స్ చేయడానికి మరియు స్వీకరించడానికి అనుమతి ఉంటుంది.

Wi-Fi కాలింగ్‌ను ఉపయోగించడం వల్ల సాధారణ ప్రయోజనాలు
*** నెట్‌వర్క్ లేకపోయినా కూడా నిరంతరాయంగా వాయిస్ కాల్స్ చేయడానికి వీలుఉంటుంది.
*** ఇది ఒకే మొబైల్ నంబర్ మరియు స్మార్ట్‌ఫోన్‌ల డిఫాల్ట్ డయలర్‌ను ఉపయోగిస్తుంది మరియు అదనపు యాప్ అవసరం లేదు.
*** మారుమూల ప్రాంతాలలో లేదా సెల్యులార్-డార్క్ జోన్లలో సిగ్నల్ సమస్యల విషయంలో కూడా కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది.

Wi-Fi కాలింగ్‌ను ఉపయోగించడం ఎలా?
Wi-Fi కాలింగ్‌ను ప్రస్తుతానికి ఎయిర్టెల్ మరియు జియో కస్టమర్లు మాత్రమే ఉపయోగించగలరు.
*** ఎయిర్టెల్ లేదా రిలయన్స్ జియో యాక్టివ్ సిమ్.
*** Wi-Fi కాలింగ్‌కు మద్దతిచ్చే స్మార్ట్‌ఫోన్ .
*** స్మార్ట్‌ఫోన్‌ను వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయాలి.
*** మీ యొక్క నెంబర్ ఏదైనా క్రియాశీల వాయిస్ ప్లాన్ తో యాక్టీవ్ లో ఉండాలి.
*** అలాగే మీ యొక్క సిమ్ 4 G కి సెట్ చేయబడిందని మరియు VoLTE ఆన్ చేయబడిందని నిర్ధారించుకోండి

Android స్మార్ట్‌ఫోన్‌లలో Wi-Fi కాలింగ్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి
*** మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి.
*** అందులో కనెక్షన్ల మీద నొక్కండి.
*** ఇప్పుడు వై-ఫై కాలింగ్ ఎంపిక కోసం చూడండి మరియు టోగుల్ ఆన్ చేయండి

ఐఫోన్‌లో వై-ఫై కాలింగ్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి
*** మొదటగా సెట్టింగులను ఓపెన్ చేయండి.
*** ఫోన్ ఎంపికకు వెళ్ళండి
*** అందులో Wi-Fi కాలింగ్ ఎంచుకోండి మరియు టోగుల్ ఆన్ చేయండి


Click it and Unblock the Notifications








