Home
News

Fact Check : రైల్వే తత్కాల్‌ సమయాల్లో మార్పులు చేశారా.. రేపటి నుంచే అమల్లోకి రానున్నాయా?

భారతీయ రైల్వే ప్రపంచ రైల్వే నెట్‌వర్క్‌లోనే అతి పెద్దది. ఇటీవల కాలంలో రైల్వే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వేగంగా చేరుకొనేలా హైస్పీడ్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీంతోపాటు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది.

వీటితోపాటు టికెటింగ్‌ విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం రైల్వేలో వివిధ రకాల సేవల కోసం అనేక యాప్స్‌, వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయి. అంటే టికెట్ల బుకింగ్ కోసం IRCTC మరియు ప్లాట్‌ఫాం, అన్‌రిజర్వడ్‌ టికెట్ల బుకింగ్‌ కోసం UTS, ఫిర్యాదుల కోసం రైల్‌ మదద్‌ సహా ట్రాకింగ్ మరియు ఇతర అవసరాల కోసం మరిన్ని ప్లాట్‌ఫామ్స్‌ ఉన్నాయి.

indian railway tatkal ticket timings change

ఈ అవసరాల కోసం రైల్వే ప్రయాణికులు అన్ని యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు స్వరైల్‌ యాప్‌ను రైల్వే తీసుకొచ్చింది. టికెట్లు బుకింగ్‌, ట్రైయిన్‌ ట్రాకింగ్‌, ఫిర్యాదులు, ఫుడ్‌ ఆర్డర్‌ వంటి అనేక అవసరాల కోసం ఈ సూపర్‌ యాప్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం యాప్‌ టెస్టింగ్‌ దశలో ఉంది. త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అయితే కొన్ని రోజులుగా రైల్వే తత్కాల్ టికెట్ల కోసం ఓ వార్త చక్కర్లు కొడుతోంది. తత్కాల్‌ బుకింగ్‌ సమయంలో మార్పులు చేసినట్లు వార్తలు వచ్చాయి. కొత్త రూల్స్‌ ఏప్రిల్‌ 15 నుంచే అమల్లోకి రానున్నాయని సోషల్‌ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది.

తాత్కాల్‌ టికెట్ల టైమింగ్స్‌ :
అయితే ఈ వార్తలపై PIB Factcheck విభాగం స్పందించింది. తాత్కాల్‌ టికెట్ల టైమింగ్స్‌లో (indian railway tatkal ticket timings) ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపింది. ఏసీ, నాన్ ఏసీ తత్కాల్‌, ప్రీమియం తత్సాల్‌ సమయాల్లో ఎలాంటి మార్పులు జరగలేదని ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం తెలిపింది.

రైల్వే లో ఎటువంటి మార్పులు జరిగినా ఆయా జోన్‌ల నుంచి అధికారిక ప్రకటనలు వెలువడతాయి. మరియు వారి అధికారిక సోషల్‌ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేస్తారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా మార్పులు చేసినట్లు మీకు సమాచారం వస్తే.. రైల్వే వెబ్‌సైట్‌, కాల్ సెంటర్‌, సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవచ్చు.

రైల్వే తాజా సమాచారం ఆధారంగా రిఫండ్ రూల్స్‌లో మార్పులు చేసింది. ఫలితంగా తక్కువ సమయంలోనే క్యాన్సిల్‌ చేసుకున్న టికెట్లకు రిఫండ్‌ను పొందే అవకాశం ఉంది. భారీ వర్షాలు, వరదలు, ఇతర ప్రమాదాల సమయంలో రైళ్లను రద్దు చేస్తుంటారు. రైల్వే తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ రైళ్లలో టికెట్లు ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయి.

ఆ రిఫండ్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రయాణ తేదీ నుంచి మూడు రోజుల్లోగా సమీపంలోని రైల్వే టికెట్ కౌంటర్‌ వద్ద టికెట్లను సమర్పించాలని సూచించింది. దీంతోపాటు అక్కడ నుంచి వెంటనే నగదును తీసుకొనేందుకు అవకాశం ఉంది.

అయితే ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకున్న టికెట్లు ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయి. మరియు రిఫండ్‌ ప్రాసెస్‌ కూడా ఆటోమేటిక్‌గా ప్రారంభం కానుంది. దక్షిణ మధ్య రైల్వే ఈ ఇటీవల ఈ ప్రకటన చేసింది. ఫలితంగా అనేక మంది ప్రయాణికులు లబ్ది పొందుతారని పేర్కొంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Fact Check fake news circulated on social media that indian railway tatkal ticket timings change here is the fact
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X