Home
News

Fact Check : KYC అప్‌డేట్‌ చేయాలంటూ మీకు మెసేజ్‌లు వస్తున్నాయా.. అసలు కథ ఏంటంటే..?

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL యూజర్‌లకు గత రెండు రోజుల్లో KYC అప్‌డేట్‌ చేయాలని మెసేజ్‌లు వచ్చాయి. 24 గంటల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయకుంటే సిమ్‌ కార్డులు డియాక్టివేట్‌ అయ్యే అవకాశం ఉందని ఈ మెసేజ్‌ పూర్తి సారాంశం. ఈ మెసేజ్‌లు BSNL, TRAI పేరుతో వచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనలపై BSNL కీలక ప్రకటన చేసింది. ఈ మెసేజ్‌లు నకిలీవని స్పష్టం చేసింది. తాము ఎలాంటి మెసేజ్‌లు పంపలేదని తెలిపింది. సైబర్ మోసాలపట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

కీలక ప్రకటన :
kYC అప్‌డేట్‌ పేరుతో తాను ఎటువంటి మెసేజ్‌లు పంపలేదని BSNL తెలిపింది. యూజర్లు ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. దీంతోపాటు PIB ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. BSNL యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, KYC అప్‌డేట్‌ చేయాలంటూ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎటువంటి మెసేజ్‌లు పంపలేదని స్పష్టం చేసింది.

PIB Warns BSNl users on fake KYC update messages

కొత్త మార్గాల్లో మోసాలు :
సైబర్ నేరాలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్నాయి. కొత్త మార్గాల్లో యూజర్‌లను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యూజర్ల వ్యక్తిగత సహా సున్నితమైన వివరాలు తెలుసుకొనేందుకు మెసేజ్‌, కాల్స్ సహా ఇతర మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మోసాల పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలి.

వ్యక్తిగత వివరాలు :
మీ వ్యక్తిగత, బ్యాంకుల అకౌంట్లు, ఆధార్‌ కార్డుల వివరాలు ఇవ్వాలని ఏ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థ అడిగే అవకాశం లేదు. ఇప్పటికే పోలీసులు సహా టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI), కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ (DoT) వీటిపై అవగాహన కల్పించాయి.

ఇటీవలే వాట్సాప్‌, DoT కీలక ఒప్పందం :
సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ నేరాలు, స్పామ్ పై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు DoT వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ నేరాలు, స్పామ్ పై.. వాట్సాప్‌, టెలికాం శాఖ వర్క్‌షాప్‌లను నిర్వహించనున్నాయి. వాట్సాప్‌ భారీ నెట్‌వర్క్‌ను ఇందుకోసం ఉపయోగించుకోనుంది. ఇప్పటికే మెటా Scam Se Bacho పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

సైబర్‌ నేరాలు, ఆర్థిక మోసాల కోసం టెలికాం వనరులను దుర్వినియోగంపై ముందస్తు చర్యల కోసం.. DoT డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ ఫ్లాట్‌ఫాంల ద్వారా అందించిన సమాచారాన్ని వాట్సాప్‌ ఉపయోగించుకుంటుంది. టెలికాం శాఖ అధికారులు, సంచార్‌ మిత్రా, టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్‌లు, ఫీల్డ్‌ యూనిట్స్‌ కోసం ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు.

సంచార్‌ సాథీ :
స్పామ్‌ కాల్స్‌, స్పామ్ మెసేజ్‌లను బ్లాక్‌ చేయడం, పొగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్‌లపై ఫిర్యాదులు, సిమ్‌ కార్డులను బ్లాక్‌ చేయడం కోసం ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన సంచార్‌ సాథీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించనుంది.

ఈ వెబ్‌సైట్, యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ స్కామ్‌, స్పామ్ పై రిపోర్టు చేయడం కోసం మరింత ప్రచారం చేస్తుంది. మరియు ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, గుజరాతీ వంటి భాషల్లో అందుబాటులో ఉండనున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Fact Check PIB Warns BSNl users on fake KYC update messages
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X