జియో సిమ్ వాడితే రూ. 27 వేల బిల్లు..నిజమెంత..?

జియో డేడా వాడినందుకు ఓ వినియోగదారుడికి రూ. 27 వేల బిల్లు వచ్చిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తోంది.

By Hazarath
|

జియో వాడుతున్నారా..అయితే మీరు ఈ న్యూస్ చూస్తే షాక్ తింటారు..ఈ న్యూస్ లో నిజమెంతో తెలియదు కాని సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. జియో వెలకమ్ ఆఫర్ ఇప్పటిదాకా ఫ్రీగా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే జియో సిమ్ వాడుతున్న ఓ వినియోగదారుడు జియో డేటా వాడినందుకు రూ. 27 వేల బిల్లు చెల్లించాడని మెసేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరిన్ని వివరాలు కోసం ఓ లుక్కేయండి.

జియో ఉచితంపై సరికొత్త న్యూస్..ఆ రోజే !

జియో బిల్లు రూ. 27 718

జియో బిల్లు రూ. 27 718

ఈ బిల్లు కట్టానని చెబుతున్న వ్యక్తి పేరు అయునుద్దిన్ మొండల్.. కలకత్తాకు చెందిన ఇతను వాడుతున్న జియో నంబర్ +917003324437. ఈ నంబర్ పై రూ. 27 718 వచ్చిందని చెబుతున్నారు.

పెనాల్టీ 1100

పెనాల్టీ 1100

ఈ బిల్లు కట్టేందుకు గడువు తేదీ కూడా ఇచ్చారని చెబుతున్నారు. నవంబర్ 20 లోపు చెల్లించాలని లేకుంటే పెనాల్టీ పడుతుందని మెసేజ్ వచ్చిందని చెబుతున్నారు. పెనాల్టీతో కలిపి మొత్తం రూ. 28,815 కట్టాలని బిల్లు వచ్చిందని ఆ పోస్ట్ లో అతను తెలిపారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియో ఉచితం కాదా..
 

జియో ఉచితం కాదా..

రిలయన్స్ జియో డిసెంబర్ 31 వరకు ఉచితం అని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ బిల్లు యూజర్లను డైలామాలో పడేసింది. జియో వాడుతున్న యూజర్లంతా ఒక్కసారిగా షాక్ తిన్నంత పనిచేశారు. ఫేస్బుక్, వాట్సాప్లో హల్చల్ చేస్తున్న ఈ పోస్ట్ వినియోగదారులను డైలమాలో పడేసింది.

ఇదంతా ఓ కట్టుకథ

ఇదంతా ఓ కట్టుకథ

అయితే దీనిపై రిలయన్స్ స్పందించింది ఇది పూర్తిగా అబద్దమని కావాలని ఎవరో క్రియేట్ చేశారని జియో వెలకమ్ ఆఫర్ ఉచితమని జియో ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

జియో స్పందన

జియో స్పందన

అయితే ఈ బిల్లు నిజమైందేనా .. లేక ఎవరైనా కావాలని జియో పేరుతో దొంగ బిల్లును సృష్టించారా అనే విషయంపై వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో రిలయన్స్ జియో ప్రతినిధులు స్పందించి ఈ పోస్ట్ నిజం కాదని స్పష్టం చేశారు. ఇటువంటి వాటిని నమ్మొద్దని తెలిపారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Best Mobiles in India

English summary
Reliance Jio Scam: FAKE Bill Urges User to Pay Rs. 27,000 During Welcome Offer Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X