జియో ఉచితంపై సరికొత్త న్యూస్..ఆ రోజే !

Written By:

టెలికం మార్కెట్లో ప్రకంపనలు రేకెత్తిస్తున్న జియో దెబ్బకి దిగ్గజాలు సైతం నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి నేడు కనిపిస్తోంది. జియో ఉచితం ఆఫర్ ఎప్పుడు అయిపోతుందా అని ఎదురుచూస్తున్నాయి. కాని జియో మాత్రం రోజురోజుకు మార్కెట్లో తన ఆకర్షణను ఇంకా పెంచుకుంటూనే పోతోంది. ఈ నేపథ్యంలో జియోనుంచి సరికొత్త న్యూస్ డిజెంబర్ 28న రాబోతోందనే వార్తలు వస్తున్నాయి.

జియోని కుదిపేస్తున్న రూ.149 అన్‌లిమిటెడ్ ప్లాన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోషల్ మీడియాలో రూమర్లు

జియో తన ఉచితం సర్వీసులను మరో మూడు నెలల పాటు పొడిగిస్తుందని ఇప్పటికే సోషల్ మీడియాలో రూమర్లు వస్తున్న నేపథ్యంలో యూజర్లు దీనిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

28న జియో ప్రకటన

అయితే వీటన్నింటికి పుల్ స్టాప్ పెట్టడానికి జియో 28న ప్రకటన చేయబోతుందని అనధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. ఆరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపకులు ధీరూభాయి అంబాని పుట్టినరోజు కావడంతో జియో నుంచి ప్రకటన ఆ రోజే వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త కష్టమర్లను ఆకట్టుకోవడానికి

ఆ రోజు జియో తన ఉచితాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త కష్టమర్లను ఆకట్టుకోవడానికి మరో మూడు నెలలు ఉచితాన్ని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మార్చి 2017 వరకు

పాత కష్టమర్లతో పాటు కొత్త కష్టమర్లకు జియో తన ఉచిత ఆఫర్ ని మార్చి 2017 వరకు ఇచ్చేలా డిసెంబర్ 28న ప్రకటన చేయనుందనే వార్తలు కూడా వస్తున్నాయి.

మరో కథనం

ఇప్పటిదాకా డిసెంబర్ 31 వరకు జియో ఉచిత ఆఫర్ ని ప్రకటిచింది. అయితే ఇది కూడా ఛేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 28 వరకే ఈ ఉచిత సేవలు ఇవ్వవచ్చని మరో కథనం కూడా వినిపిస్తోంది.

అంబాని లక్ష్యం

అయితే అలా కాకుండా మార్చి 2017 వరకు ఉచితాన్ని ఇస్తే ఆ లోపు ముకేష్ అంబాని లక్ష్యం 100 మిలియన్లు చేరుకోవచ్చని తెలుస్తోంది. దీనికోసమైనా ఉచితాన్ని పొడిగిస్తారని మరికొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.

కాల్ డ్రాప్స్ సమస్యలతో

జియో వెలకమ్ ఆఫర్ పై కష్టమర్ల నుంచి నెగిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో దాన్ని ఎలాగైనా కవర్ చేయడానికి జియో ఉచితం ఆఫర్ ని మార్చి 2017 వరకు పొడిగించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. జియో యూజర్లు కాల్ డ్రాప్స్ సమస్యలతో సతమతమవుతున్న విషయం అందరికీ తెలిసిందే.

ధీరూబాయి అంబాని పుట్టినరోజు

సో.. జియో తన ఉచితాన్ని మార్చి 2017 వరకు పొడిగిస్తుందా లేక డిసెంబర్ 28తో ఆపేస్తుందా అన్నది తెలియాలంటే ధీరూబాయి అంబాని పుట్టినరోజు వరకు ఎదురుచూడాల్సిందే.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio to make big announcement regarding free Jio 4G Welcome Offer on December 28 Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot