మైక్రోసాఫ్ట్ రూ. 20 లక్షల ఆఫర్
బగ్ పట్టు రూ.10 లక్షలు పట్టు అంటూ హ్యాకర్లకు ఓపెన్ చాలెంజ్
ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజంమైక్రోసాఫ్ట్ హ్యాకర్లకు బంఫరాపర్ ప్రకటించింది. తమ సేవల్లో లోపాలుకనిపెట్టిన వారికి భారీ నజరానాను అందించనుంది. బగ్ పట్టు రూ.10 లక్షలు పట్టు అంటూ హ్యాకర్లకు ఓపెన్ చాలెంజ్ విసిరింది. ప్రపంచ వ్యాప్తంగా తమ ఆన్‌లైన్ సేవల్లో తీవ్రమైన దాడులను, సెక్యూరిటీ లోపాలను గుర్తించిన హ్యాకర్లకు మొత్తం దాదాపు 20లక్షలు(30వేల డాలర్లు) దాకా చెల్లించనుంది. వీటిలో కనీసం 500 డాలర్లుగాను, గరిష్టంగా 15 వేల డాలర్లు(రూ.10లక్షలు) నజరానా చెల్లిస్తామని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
షియోమి నుంచి కొత్త ప్రొడక్ట్..

500 డాలర్లనుంచి 15 వేల డాలర్ల వరకు
సేవల్లో లోపాలు కనుగొన్న వారిలో అర్హులైన వారికి కనీసం 500 డాలర్లనుంచి 15 వేల డాలర్ల వరకు అందించనున్నట్టు ఒక ప్రకటనలో ఎలిపింది.

మార్చి 1 - మే 1 మధ్య కాలంలో
అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 పోర్టల్, మైక్రోసాఫ్ట్ ఎక్స్ఛేంజ్ ఆన్లైన్ కు సంబంధించి మార్చి 1 - మే 1 మధ్య కాలంలో సమర్పించిన అర్హులైన హ్యాకర్లు డబుల్ బొనాంజాకు అర్హులవుతారని తెలిపింది.

సుమారు30 వేల డాలర్లదాకా
ఇలా అందిన అర్హమైన రిపోర్టులకు సుమారు30 వేల డాలర్లదాకా అందించనున్నట్టు మైక్రోసాఫ్ట్ కంపెనీ పేర్కొంది. దీనిపై మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుంటుందని, దాడి ప్రభావం ఆధారంగా ఈ చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది.

కనుగొనాల్సిన సైట్లు
క్రాస్ సైట్ స్ర్కిప్టింగ్; క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ, అనధికారిక క్రాస్ టెనంట్ డేటా టాంపరింగ్, యాక్సెస్ మల్టీ టెనంటింగ్ సర్వీసెస్ లాంటి ఇతర సర్వీసులలో వీటిని కనుగొనాల్సింది ఉంటుంది.

మైక్రోసాఫ్ట్ హ్యాకర్లను సవాల్
అలాగే పోర్టల్.ఆఫీస్.కాం, ఔట్‌లుక్. ఆఫీస్365.కాం, ఔట్‌లుక్. ఆఫీస్.కాం లాంటి ఇతర నిర్దిష్ట డొమైన్లలో ఆయా దాడులను, ప్రభావాన్ని విశ్లేషించాలని మైక్రోసాఫ్ట్ హ్యాకర్లను సవాల్ చేసింది.


Click it and Unblock the Notifications








