ఇంటర్నెట్‌లో ఫస్ట్ మెసేజ్ ఏంటో తెలుసా.. ?

Written By:

ఇంటర్నెట్‌ ప్రపంచం ఓ మహ సముద్రం లాంటిది. రోజుకు కొన్ని లక్షల ఫైల్స్ అందులో అప్‌లోడ్ అవుతుంటాయి. అవి ట్విట్టర్ ద్వారా యఅితేనేమి అలాగే ఫేస్‌బుక్ ద్వారా అయితేనేమి. ఇంకా యూ ట్యూబ్ ద్వారా అయితేనేమి..ఇలా రకరకాల నెట్‌వర్క్‌ల ద్వారా ఫైల్స్ అప్‌లోడ్ అవుతుంటాయి. అయితే ఎన్ని అప్‌లోడ్ అయినా ఫస్ట్ ఈజ్ ది బెస్ట్ అంటారు. మరి వీటిల్లో ఫస్ట్ ఏంటో చాలామందికి తెలియదు. ట్విట్టర్లో ఫస్ట్ ఏం పోస్ట్ చేశారు. అలాగే ఇంటర్నెట్లో ఫస్ట్ మెసేజ్ ఏంటీ ఇవన్నీ చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ఇంటర్నెట్లో ఫస్ట్ అప్ లోడ్ అయిన వాటిని గిజ్‌బాట్ మీ కందిస్తోంది చూసేయండి.

Read more : మొబైల్స్ చరిత్రలో నమ్మలేని నిజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డోన్ట్ బి స్కార్డ్. ఇట్ ఈజ్ మి

ఇంటర్నెట్‌లో మొట్ట మొదటి మెసేజ్ ఏంటో తెలుసా ‘‘డోన్ట్ బి స్కార్డ్. ఇట్ ఈజ్ మి. లవ్ యూ అండ్ మిస్ యూ'' దీనిని ఏఓఎల్ వైస్ ఛైర్మెన్ టెడ్ లియోనిసిస్ తన భార్యకు పంపారు. ఇక తన భార్య వావ్ దిస్ ఈజ్ సో కూల్ అంటూ రిప్లయి కూడా ఇచ్చింది. ఇది జనవరి 6 1993లో జరిగింది.

ఆన్‌లైన్‌లో ఫస్ట్ బ్యానర్‌ యాడ్ ని

ఆన్‌లైన్‌లో ఫస్ట్ బ్యానర్‌ యాడ్ ని జోయ్ మెకాంబ్లీ పెట్టారు. ఇది అక్టోబర్ 1994లో జరిగింది. హాట్ వైర్డ్ .కాం దీన్ని 7 కళల్లో ప్రమోట్ చేయడం జరిగింది. దీన్ని స్పాన్సర్ చేసినవారు ఏటీ అండ్ టీ

ఈ బే లో మొట్ట మొదట అమ్మకం జరిపిన వస్తువు

ఈ బే లో మొట్ట మొదట అమ్మకం జరిపిన వస్తువు ఏంటంటే పగిలిన లేజర్ ప్రింటర్. ఇది 1995లో 14.83 డాలర్లకు కొన్నారు. ఇక దీన్ని కొన్నది పియారో ఒమిడియార్ ఇతను పగిలిపోయిన లేజర్ ప్రింటర్స్ ను సేకరిస్తుంటా

అమెజాన్‌ కొన్న మొట్టమొదటి పుస్తకం

అమెజాన్‌ కొన్న మొట్టమొదటి పుస్తకం కాన్సెప్ట్స్ అండ్ క్రియేటివ్ అనాలజీస్. దీన్ని డగ్లస్ రాశారు.ఇది మెకానిజమ్ కు సంబంధించి ప్రాధమిక సూత్రాలను తెలియజేస్తుంది. ఇది 1995లో జరిగింది.

స్కైప్ లో ఫస్ట్ పదాలు

స్కైప్ లో ఫస్ట్ పదాలు ఏంటో తెలుసా...హల్లో కెన్ యూ హియర్ మి. దీన్ని ఏప్రిల్ 2003న ఎస్తోనియన్ కు చెందిన ఓ డెవలప్‌మెంట్ టీమ్ మెంబర్ నుంచి వచ్చింది. వారి భాషలో ఇది తేరే కస్ కూలెడ్ మైండ్.

మార్క్ జుకర్ బర్గ్ ఫస్ట్ కాదు

మార్క్ జుకర్ బర్గ్ ఫస్ట్ పర్సన్ గా ఉండాలి కదా ఫేస్‌బుక్‌లో.అయితే అలా జరగలేదు. ఆయన స్థానం నాలుగవది. ఫస్ట్ ముగ్గురు టెస్టింగ్ కోసం ఫేస్‌బుక్ అకౌంట్‌ని వాడారు. ఇక ఫస్ట్ పర్సన్ ఎరీ హాస్ట్. అతను ఎప్పుడూ ఇజ్రాయెల్‌లో రబ్బీ అని చదువుతుండేవాడు.

ఫస్ట్ యూ ట్యూబ్ వీడియోను

ఇక ఫస్ట్ యూ ట్యూబ్ వీడియోను శాన్ డిగో జూకు చెందిన జావెద్ కరీం అప్‌లోడ్ చేశారు. ఏప్రిల్ 23 2005న మిఎట్ ది జూ అని అప్‌లోడ్ చేశారు. దీన్ని ఇప్పటికే 10 మిలియన్ల సార్లు చూశారు.

ట్విట్టర్‌లో ఫస్ట్ ట్విట్

ట్విట్టర్‌లో ఫస్ట్ ట్విట్.. ట్విట్టర్ కో ఫౌండర్ జాక్ డెర్సీ ట్వీట్. మార్చి 21 2006న జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విట్టర్ అంటూ పోస్ట్ చేశారు.

1971లో ఫస్ట్ ఈ మెయిల్

రాయ్ టోమ్లిసన్ అనే వ్యక్తి 1971లో ఫస్ట్ ఈ మెయిల్ పంపారు. అయితే ఆయన పంపిన మెసేజ్ ఏంటో ఆయనకే అర్థం కాలేదట..ఇంతకీ ఆయన పంపిన మెసేజ్ ఏంటంటే QWERTYIOP అని సందేహంగా చెబుతున్నారు. నిజంగా ఏం పంపారో తెలియదనే తెలుస్తోంది.

ఇంటర్నెట్‌లో ఫస్ట్ డొమిన్

ఇంటర్నెట్‌లో ఫస్ట్ డొమిన్ నేమ్ సింబాలిక్స్ డాట్ కాం.ఇది మార్చి 15 1985లో రిజిస్టర్ చేశారు.ఇది ఇప్పుడు హిస్టోరిక్ సైట్‌గా సేవలందిస్తోంది.

ఇంటర్నెట్‌లో ఫస్ట్‌ వెబ్‌సైట్ పేరు

ఇంటర్నెట్‌లో ఫస్ట్‌ వెబ్‌సైట్ పేరు వరల్డ్ వైడ్ వెబ్. ఇది ఆగస్టు 6 1991న నమోదైంది.

ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసిన ఫస్ట్ ఫోటో

ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసిన ఫస్ట్ ఫోటో ఇదే దీనిని బెర్నర్ లీ కామెడి బాండ్ లెస్ హారిబుల్ సెర్నెట్టీస్ అంటూ పోస్ట్ చేశారు.ఈయన వరల్డ్ వైడ్ వెబ్ ఆవిష్కర్త కూడా

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write he First Ever Email, the First Tweet, and 10 Other Famous Internet Firsts
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot