ఆడియో రిలీజ్ ఏకంగా అంతరిక్షంలో పెట్టారు
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా నిర్మాణమే కాదు సినిమా ప్రమోషన్ కూడా తలకు మించిన భారంగా మారింది. అందుకే సినిమా షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి రిలీజ్ డేట్ వరకు వీలైనన్ని కొత్త మార్గాల్లో సినిమాను ఆడియన్స్ కు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్ ఇదే బాటలో సరికొత్త ఆలోచన చేశారు మళయాల చిత్రం లార్డ్ లివింగ్ స్టోన్ 7000 కాండీ యూనిట్..ఇంతకీ వారు ఏం చేసారనేగా మీ డౌటు..వారు ప్రపంచంలోనే తొలిసారిగా ఎవరూ చేయలేని సాహసాన్ని చేశారు..అంతరిక్షంలో ఆడియోని రిలీజ్ చేశారు. అంతరిక్షంలో ఆడియోనా అని షాకవుతున్నారు..అవును నిజం..మిగతా కథ స్లైడర్ లో చదవండి.
Read more: మార్స్‌పై కార్బన్ డై ఆక్సైడ్ మిస్టరీ

అంతరిక్షంలో ఆడియో రిలీజ్ ని ప్లాన్
గతంలో ఏ సినిమాకు చేయని విధంగా అంతరిక్షంలో ఆడియో రిలీజ్ ని ప్లాన్ చేశారు. అయితే ఈ ఆడియో రిలీజ్ లో యూనిట్ సభ్యులు ఎవరూ పాల్గొనే అవకాశం లేదు.

వెదర్ బెలూన్ సాయంతో..
వెదర్ బెలూన్ సాయంతో ట్రైలర్ లాంచింగ్ డివైజ్ ను మాత్రం అంతరిక్షంలోకి పంపారు. దీంతో పాటు అక్కడి విశేషాలను భూమికి చేరవేసేలా గోప్రో కెమెరాను బెలూన్ కి అమర్చారు.

అన్ని రకాల అనుమతులు
cusat విద్యార్థలు సాయంతో ఈ ప్రయోగం చేసినట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. వెదర్ బెలూన్ ను అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టేందుకు కావాల్సిన అన్ని రకాల అనుమతులు తీసుకున్న తరువాత చిత్ర యూనిట్ వెదర్ బెలూన్ ని స్పేస్ లోకి పంపింది.

అంతరిక్షంలో ఆడియో రిలీజ్ జరుపుకుంటున్న తొలిచిత్రం
దీంతో అంతరిక్షంలో ఆడియో రిలీజ్ జరుపుకుంటున్న తొలిచిత్రంగా లార్డ్ లివింగ్ స్టోన్ 7000 కాండీ చరిత్ర సృష్టించింది.

అనిల్ రాధా కృష్ణన్ మీనన్ దర్శకుడు
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే అడ్వంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిల్ రాధా కృష్ణన్ మీనన్ దర్శకుడు.

గ్లోబల్ యునైటైడ్ మీడియా వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు
బాహుబలి మళయాల డిస్ట్రిబ్యూటర్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ యునైటైడ్ మీడియా వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

గిజ్ బాట్ పేజీని లైక్ చేయండి
మీరు ఎప్పటికప్పుడు టెక్నాలజికి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.https://www.facebook.com/GizBotTelugu


Click it and Unblock the Notifications








