మార్స్‌పై కార్బన్ డై ఆక్సైడ్ మిస్టరీ

Posted By:

అంగారక గ్రహంపై నీరు కనుగొనేందుకు జరుగుతున్న పరిశోధనలు రోజు రోజుకు కొత్త కొత్త విషయాలను ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. నాసా మార్స్ పైకి పంపిన రోవర్ అనేక విషయాలను వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. అయితే ఇప్పుడు తాజాగా సరికొత్త ఫోటోలను పంపింది. అంగారక గ్రహంపై కార్బన్ డై ఆక్సైడ్ తో కూడిన మంచు ఉందని నాసా చెబుతోంది. దీనికి సంబంధించిన చిత్రాలను ఇటీవలే రిలీజ్ చేసింది. దీంతో మార్స్ పై మానవాళి నివాసానికి మార్గం సుగుమం అయ్యే అవకాశాలు మరింత ఎక్కువయ్యాయి. నాసా పరిశోధనలతో త్వరలో మార్స్ పై మానవులు మనుగడ సాగించే అవకాశం కూడా ఉన్నదని తెలుస్తోంది. ఈ సందర్భంగా మార్స్ పై నుంచి రోవర్ పంపిన పోటోలపై ఓ లుక్కేద్దాం.

Read more: అంగారకుడిపై ఉప్పు నీటి ప్రవాహం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇక్కడ తెల్లగా కనిపిస్తున్నది ఏంటో తెలుసా

ఇక్కడ తెల్లగా కనిపిస్తున్నది ఏంటో తెలుసా మంచుతో కూడిన ఓ పదార్ధమట. కార్బన్ డై ఆక్సైడ్ తో కూడిన ఓ స్క్రాప్ అక్కడ ఉందట..నాసా పంపిన రోవర్ ఈ ఇమేజ్ ని దాదాపు 65 అడుగుల ఎత్తు నుంచి క్లిక్ మనిపించింది.

ఇటుకలతో కూడిన రెడ్ ప్లానెట్ పై ..

హిమాలయ పర్వతాలు లాగా మంచుతో కూడిన ఈ తెల్లని స్క్రాప్ ఏంటనేది నాసాని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కాలానుగుణంగా మార్పులు చెంది ఇలా అయిందా లేక మరేదైనా అనే కోణంలో నాసా ఇప్పుడు దీనిపై పరిశోధన సాగిస్తోంది. ఇటుకలతో కూడిన రెడ్ ప్లానెట్ పై ఇలా తెల్లని ఆకారంలోని స్క్రాప్ కార్బన్ డై ఆక్సైడ్ తో కూడిన మంచు కావచ్చుననే సందేహాలు కలుగుతున్నాయి.

అట్లాంటిక్ మహాసముద్రం అంత పెద్దగా..

అంగారకుడిపై కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయోగాలు, పరిశోధనలు ఫలితాన్నిస్తున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రం అంత పెద్దగా, కిలోమీటర్ పైగా లోతుగా అంగారకుడిపై నీరు ఉన్నట్లు నాసా ప్రకటించింది.అరుణ గ్రహం మీదికి స్పిరిట్‌, ఆపర్చునిటీ రోవర్లు, ఫీనిక్స్‌ ల్యాండర్, క్యూరియాసిటీ వంటి రోబోలను పంపి నాసా పరిశోధనలు కొనసాగిస్తోంది.

అరుణగ్రహంపై వాతావరణం చాలా కఠినం

అయితే, అరుణగ్రహంపై వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది. ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ధూళి తుపాన్లు, అంతరిక్షం నుంచి వచ్చే భారీ రేడియోధార్మికతలను తట్టుకుని నాసా పంపిన రోబోలు శాంపిల్స్ ను, ఫోటోలను పంపించాయి.

పరిశోధించిన శాస్ట్రవేత్తలు నీటి జాడలను..

వీటిని పరిశోధించిన శాస్ట్రవేత్తలు నీటి జాడలను నిర్ధారించారు. అంగారకుడి ధ్రువ ప్రాంతాల్లో కిలోమీటర్ల మందంతో మంచు ఫలకాలు ఉన్నాయి. భూగర్భంలోనూ ఐస్‌ ఉన్నట్లు కూడా చెబుతున్నారు. అందులో ఎక్కువ భాగం ధ్రువాల వద్ద ఘనీభవించి ఉంది.

ధ్రువ ప్రాంతాలోని మంచు ఒక వనరు

భవిష్యత్‌లో అంగారకుడిపై ఆవాసం ఏర్పర్చుకుంటే ధ్రువ ప్రాంతాలోని మంచు ఒక వనరుగా పనికొస్తుంది. అయితే అక్కడి కూల్ వెదర్ని తట్టుకోవడం చాలా కష్టమేనంటున్నారు శాస్త్రవేత్తలు. మార్స్ పై నీటి ఆధారం లభించడం సైంటిస్టులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.

చంద్రయాన్ ప్రయోగంతో ..

ఇక సాంకేతికంగా వెనుకబడి పోయినా.. సూక్ష్మ దృష్టిలో అంతరిక్షంలో ఉండే చాలా అంశాల్ని భారతీయులు బయటపెడుతుంటారు. ఇప్పటికే ఈ విషయం పలుమార్లు నిరూపితమైంది కూడా. మనకు దగ్గర్లో ఉన్న చందమామపై ఏమీ లేదని.. తేల్చేస్తే చంద్రయాన్ ప్రయోగంతో అది తప్పని చెప్పి.. లోకం దృష్టిని ఆకర్షించేలా చేసింది. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు చేసేలా పురిగొల్పింది.

అంగారకుడిపై నీరు ఉన్నట్లుగా భారత్ తన ప్రయోగంతో గతంలోనే చెప్పింది

తాజాగా సదూర తీరాన ఉన్న అంగారకుడిపై నీళ్లు ఉన్నాయంటూ సంచలన విషయాన్ని నాసా పేర్కొంది. అయితే.. అంగారకుడిపై నీరు ఉన్నట్లుగా భారత్ తన ప్రయోగంతో గతంలోనే చెప్పింది. అయితే.. అధునాతన సాంకేతిక లేకపోవటంతో తన వాదనకు తగిన ఆధారాల్ని చూపించలేకున్నా.. ఇప్పుడు అదే మాటను నాసా చెప్పటం చూసినప్పుడు.. అంతరిక్ష అంశాలకు సంబంధించి భారత్ చేసే వ్యాఖ్యలు విలువైనవన్న విషయం మరోసారి నిరూపితమైనట్లే.

గిజ్ బాట్ పేజీని లైక్ చేయండి

మీరు ఎప్పటికప్పుడు టెక్నాలజికి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.https://www.facebook.com/GizBotTelugu

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Probe captures 65ft cascade of carbon dioxide scarring the red planet's surface
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot