Home
News

షాక్: ఆపిల్ ఐఫోన్ 7 ఫీచర్స్ రూ.10 వేల ఫోన్లలో దొరుకుతున్నాయి!

By Hazarath

ఐఫోన్ అభిమానులకు ఇది నిజంగా చేదులాంటి వార్తే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఐఫోన్ 7లో ఫీచర్లలో కొత్త దనమేమి కనిపించడం లేదని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. పుల్ హైప్ క్రియేట్ చేస్తూ దూసుకొచ్చిన ఐ ఫోన్7 వెర్షన్ లో రూ. 10 వేల లోపు ఫోన్లలో ఉన్న ఫీచర్లు కూడా లేవని టెక్ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఈ ఫీచర్లను అరువుకు తెచ్చుకున్నట్లుగా ఐ ఫోన్ 7 తయారైందని విమర్శిస్తున్నారు..మరి ఆ ఫీచర్లేంటో మీరే చూడండి.

ఐఫోన్7పై ఆపిల్ వార్నింగ్ : జాగ్రత్తగా ఉండాలని పిలుపు

#1

#1

కెమెరా విషయానికొస్తే.. పిల్ కొత్తగా తీసుకొచ్చిన ఐఫోన్7, ఐఫోన్ 7ప్లస్‌లో కెమెరాపై ఎక్కువగా దృష్టిసారించినట్టు పేర్కొంది. డ్యూయల్ కెమెరాతో వినియోగదారుల ముందుకు వచ్చింది. కానీ ఆ ఫీచరేమీ ఐఫోన్7కు ప్రత్యేకంగా నిలవడం లేదట.

#2

#2

2014లోనే డ్యూయల్ కెమెరాతో హెచ్‌టీసీ తన స్మార్ట్‌ఫోన్ ఎం8ను లాంచ్ చేసిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. రూ.10వేల ధరలోనే ఈ ఫీచర్‌తో ఆ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయట. డ్యూయల్ కెమెరా సెట్ అప్‌తో ఎక్కువ ప్రీమియం ఆఫర్ చేసే ఫోన్లు ఎల్‌జీ జీ5, హ్యువాయ్ పీ9లు ఐఫోన్7 ప్లస్‌కు సగం ధరలోనే మార్కెట్లో లభ్యమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

#3

#3

వాటర్ ఫ్రూప్ విషయానికొస్తే.. నీరు, దుమ్ము నుంచి పూర్తి రక్షణ కల్పించే విధంగా ఐపీ67 వాటర్ ఫ్రూప్ ప్రమాణాల మేరకు ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్?లను ఆపిల్ లాంచ్ చేసింది.

#4

#4

ఈ ఫీచర్‌ను కూడా నాలుగేళ్ల క్రితమే సోనీ తన ఎక్స్‌పీరియా జడ్ స్మార్ట్‌ఫోన్‌తో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. శాంసంగ్ కూడా తక్కువ ధరలోనే తన ఎస్7, ఎస్7 ఎడ్జ్ ఫోన్లను విక్రయిస్తోందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు..

#5

#5

సెన్సార్ విషయానికొస్తే.. గతేడాదే ఐఫోన్6ఎస్/6ఎస్ ప్లస్ ఫోన్లలో 5 ఎంపీ సెన్సార్‌ను అప్‌గ్రేడ్ చేసిన ఆపిల్, కొత్తగా లాంచ్ చేసిన ఐఫోన్ 7 ఫోన్లలో 7ఎంపీ సెన్సార్‌ను అప్‌గ్రేడ్ చేసింది. కానీ రూ.15,000 సెగ్మెంట్‌లోనే 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫోన్లు వినియోగదారుల ముందు ఈ ఫీచర్‌తో అలరిస్తున్నాయట.

#6

#6

ఫ్రంట్ కెమెరా క్వాలిటీలో మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్లకు, ఐఫోన్7కు సరితూగడం లేదని భావిస్తే, జియోని ఎస్6ఎస్, ఓప్పో ఎఫ్1లు ఫ్రంట్ కెమెరాలో అద్భుతమైన ఫలితాలను ప్రదర్శిస్తున్నాయని వారు వివరిస్తున్నారు. ఈ రెండు ఫోన్లు ఫ్రంట్ కెమెరా క్వాలిటీలో బెస్ట్ ఫోన్లన్ని ఇప్పటికే రుజువైందని స్పష్టంచేశారు.

#7

#7

ఇక హెడ్ ఫోన్స్ విషయానికొస్తే.. ఊహించినట్టుగానే 3.5ఎంఎం హెడ్‌జాక్‌ను ఆపిల్ ఈ కొత్త ఫోన్లలో తొలగించింది. కానీ 3.5ఎంఎం కోరుకునే వారికోసం అడాప్టర్‌ను అందిస్తోంది ఆపిల్. అదేవిధంగా వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ ఇందులో ప్లస్ పాయింట్ అని ఆపిల్ చెబుతోంది.

#8

#8

అయితే ఇవే ఫీచర్లను లీఇకో తన లీ2, లీమ్యాక్స్2 ఫోన్లను ఆఫర్ చేస్తోందని టెక్ విశ్లేషకుల వాదన. యూఎస్‌బీ టైప్-సీ పోర్టును లీఇకో కొన్ని నెలల క్రితమే అందుబాటులోకి తీసుకొచ్చిందని, లీఇకో ఆఫర్ చేస్తున్న ఈ అధిక క్వాలిటీ యూఎస్‌బీ టైప్-సీ హెడ్ ఫోన్లనూ ఆపిల్ కొత్త ఫోన్లకు జోడించడం ప్రత్యేకతేమి లేదంటున్నారు విశ్లేషకులు.

#9

#9

స్టీరియో స్పీకర్స్ విషయానికొస్తే.. మరో ఆండ్రాయిడ్ ఫీచర్ స్టీరియో స్పీకర్స్. తొలి సారిగా ఐఫోన్‌7లో స్టీరియో స్పీకర్లను ఏర్పాటు చేశారు. కొత్త ఫోన్లలోని స్టీరియో స్పీకర్లు ఉండడంతో సినిమా వీక్షణ అనుభవం సరికొత్తగా ఉండే అవకాశం ఉందని ఆపిల్ హామి ఇస్తోంది..

#10

#10

అయితే ఇప్పటికే చాలా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు చాలా ఏళ్ల నుంచే స్టీరియో స్పీకర్లను ఆఫర్ చేస్తున్నాయట. హెచ్‌టీసీ ఈ స్టీరియో స్పీకర్ల ట్రెండ్‌ను సృష్టిస్తే అనంతరం లెనోవా, మోటరోలా వంటి మిడ్ రేంజ్ ఫోన్లలో కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

#11

#11

ఇలాంటి ఫీచర్లు ఇది వరకే వస్తే ఇప్పుడు ఆపిల్ కొత్తగా తీసుకువచ్చిందేమి లేదని టెక్ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

#12

#12

అయితే బ్రాండ్ అనేది మాత్రం ఆపిల్ కే సాధ్యమని అభిమానులు బ్రాండ్ ను చూసి కొంటారని మరికొంతమంది చెబుతున్నారు. మరి ప్రపంచ రారాజు ఆపిల్ నుంచి వచ్చిన ఐ ఫోన్ 7 అమ్మకాలు ఏ దిశగా సాగుతాయో చూడాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
Five features the iPhone 7 and 7 Plus borrowed from Android read more gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X