శత్రు దేశాలకు దడ పుట్టిస్తున్న 5 ఇండియా ఆయుధాలు

|

డ్రాగన్‌' బుసలు కొడుతోంది. పదేపదే భారత భూభాగంలోకి చొరబడుతున్న చైనా, 'ముత్యాల సరం' పేరుతో భారత్‌ చుట్టూ ఉరితాడు పేనుతోంది. ఈ చక్రవ్యూహాన్ని ఛేదించేదెలా? చైనాకు మనం సమాధానం చెప్పలేమా...అంటే ప్రతి పౌరుడు ఇప్పుడు ఓ సైనికుడుగా మారి చైనాను బంగాళఖాతంలో కలిపేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అత్యంత శక్తి వంతమైన ఆయుధాలు ఇప్పుడు భారత్ అమ్ముల పొదిలో ఉన్నాయి..ఈ ఆయుధాలతో భారత సైన్యం ఇప్పుడు యుద్ధమంటూ వస్తే 1962 సంఘటన ఎట్టి పరిస్థితుల్లోనూ రిపీట్ కాదనే ధీమాతో ఉంది. మిగతా కథనం స్లైడర్ లో

 

Read more:పాకిస్తాన్‌కు వణుకు పుట్టించే వార్త

 విక్రమాదిత్య ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్

విక్రమాదిత్య ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్

అత్యాధునిక ఐఎన్ ఎస్ విక్రమాదిత్య భారత నావికా దళంలోకి చేరింది. దశాబ్దాలుగా అనేక చర్చలు పలు మార్పుల మధ్య విక్రమాదిత్య ఇండియన్ ఆర్మీ చేతిలో అస్ర్తమయింది. ఎయిర్ క్రాఫ్ట్ లను మోసుకెళ్లే నౌక ఇది. 

 విక్రమాదిత్య ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్

విక్రమాదిత్య ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్

ఈ నౌకను రష్యా తయారుచేసింది.ఇది హిందూ మహాసముద్రం మొత్తాన్ని జల్లెడపట్టి శత్రువును కిలోమీటర్ల దూరం పరిగెత్తిస్తుందని ఆర్మీ చెబుతోంది. దీన్ని భారత్ రష్యా నుంచి 947 మిలియన్ డాలర్లకు అప్పుడు కొనుగోలు చేసింది.

విక్రమాదిత్య ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్
 

విక్రమాదిత్య ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్

మింగ్ 29కె అలాగే పి 81 వంటి యాంటీ సబ్ మెరైన్లు శత్రు సేనలకు ముచ్చెమటలు పట్టించగలవు. వీటిని ప్రధాని మోడీ సైతం తెలుసుకోవాలని ఇంట్రస్ట్ చూపించారంటే దీన్ని కెపాసిటీని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఓ రోజంతా వీటిని తెలుసుకోడానికి కేటాయించారు కూడా.

కొత్త  జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్

కొత్త జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్

ఇది ఓ శక్తివంతమైన ఎయిర్ క్రాఫ్ట్. అమెరికన్ ఎఫ్ 22 అలాగే చైనీస్ జె 20
లాగా అత్యంత పవర్ పుల్ యుద్ధ విమానం. ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి చేరింది. ఇది రాడార్ సిస్టంతో ఎక్కడి నుంచి శత్రువులు దాడి చేసినా వాటిని ఎదుర్కుని తుత్తునియలు చేయగలదు.

కొత్త  జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్

కొత్త జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్

సిక్స్ రాడార్ గైడెడ్ మిస్సైల్స్ ను మోసుకెళ్లగలిగే సత్తా ఉన్న విమానం. 100 కిలోమీటర్ల పరిధిలో ఏమున్నా భస్మం చేయగలదు. ఈ యుధ్ధ నౌక కోసం ఇండియా దాదాపు 25 బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టింది. 220 యుద్ధ విమానాలు 2022 కల్లా భారత్ అమ్ములపొదిలోకి చేరనున్నాయి.

బ్రహ్మోస్ యాంటి షిప్ మిస్సైల్

బ్రహ్మోస్ యాంటి షిప్ మిస్సైల్

ఇది ఇండో రష్యా జాయింట్ ప్రాజెక్ట్. ధ్వని వేగం కంటే ఏడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే హైపర్‌సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ తయారీలో భారత్-రష్యా దేశాలు తలమునకలయ్యాయి. ఈ మధ్యనే అత్యాధునిక వ్యవస్థగల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది.

బ్రహ్మోస్ యాంటి షిప్ మిస్సైల్

బ్రహ్మోస్ యాంటి షిప్ మిస్సైల్

ఈ మిస్సైల్‌ను గోవా తీరంలో ఐఎన్‌ఎస్ కోల్‌కతా నౌక నుంచి రక్షణశాఖ అధికారులు విజయవంతంగా ప్రయోగించారు. 290 కిలో మీటర్ల రేంజ్ గల ఈ క్షిపణి తనకు నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. కాగా, సాధారణ నౌకలపై నుంచి కేవలం 8 క్షిపణులు ప్రయోగించడానికి వీలుండగా ఐఎన్‌ఎస్ కోల్‌కతాపై నుంచి 16 క్షిపణులు ప్రయోగించవచ్చు.

బ్రహ్మోస్ యాంటి షిప్ మిస్సైల్

బ్రహ్మోస్ యాంటి షిప్ మిస్సైల్

భారత వాయుసేనకు చెందిన ఈ నౌకను 2014 ఆగస్టు 16న సముద్ర ప్రవేశం చేయించారు. రెండు దశల్లో పనిచేయగల ఈ క్షిపణిని ఇప్పటికే రక్షణ, నావికాదళంలో ప్రవేశపెట్టారు. దీన్ని మరింత అభివృద్ధి చేసి కొత్తతరహాలో రూపొందించనున్నట్టు బ్రహ్మోస్ చీఫ్ ఎ శివథాను పిళ్లై వెల్లడించారు.

భారత్ లోని బ్రహ్మ పుత్రా రష్యాలోని మాస్కోవా నదుల పేర్లలో

భారత్ లోని బ్రహ్మ పుత్రా రష్యాలోని మాస్కోవా నదుల పేర్లలో

దీనిని అధిగమించే క్షిఫణి ఇప్పటికైతే లేదని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారత్ లోని బ్రహ్మ పుత్రా రష్యాలోని మాస్కోవా నదుల పేర్లలో తొలి రెండు అక్షరాలను సూచించే విధంగా ఈ అస్త్రానికి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు.

చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసే దిశగా

చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసే దిశగా

చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసే దిశగా వియత్నాంకు కూడా అధునాతన బ్రహ్మోస్ క్షిపణులను అందించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఎత్తుగడ కార్యరూపం దాల్చితే మాత్రం, చైనా దీన్ని తీవ్రంగా పరిగణిస్తుందనడంలో సందేహం లేదు.

దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం, చైనా మధ్య ఘర్షణ వాతావరణం

దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం, చైనా మధ్య ఘర్షణ వాతావరణం

దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం, చైనా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయించినట్టయితే అది మరింత తీవ్రరూపం దాల్చడం తథ్యం. బ్రహ్మోస్ ప్రధానంగా నౌకా లక్ష్యత (యాంటీ షిప్) క్షిపణి.

చైనా ఇండియా సరిహద్దులోకి రావాలంటేనే..

చైనా ఇండియా సరిహద్దులోకి రావాలంటేనే..

చైనా ఇండియా సరిహద్దులోకి రావాలంటేనే ఇక భయంతో వణికిపోయే విధంగా వీటిని తయారుచేయనున్నారు. 

కోలకత్తా క్లాస్ డిస్ట్రాయర్

కోలకత్తా క్లాస్ డిస్ట్రాయర్

లేటెస్ట్ గా తయారైన ఇది సొంతంగా ఆపరేట్ చేయగల అత్యాధునిక యుద్ధ విమానం.సముద్రంలోనూ నేలమీద ప్రయాణించి శత్రు స్థావరాలను ధ్వసం చేయగలదు. ఈ యుధ్ధ విమానంలో మొత్తం 64 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్ ఉంటాయి.

కోలకత్తా క్లాస్ డిస్ట్రాయర్

కోలకత్తా క్లాస్ డిస్ట్రాయర్

దీని తక్కువ రేంజ్ బరక్ 1.. అలాగే మీడియం రేంజ్ బరక్ 8. యుద్ధ సమయంలో వీటితో శత్రు సేననే నామరూపాల్లేకుండా చేయవచ్చు. త్వరలో నాలుగు డిస్ట్రాయర్లను భారత నేవీ దళానికి ఇచ్చే అవకాశం ఉంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా వీటిని నేవీలోకి ప్రవేశ పెట్టాలని చూస్తోంది.

అరిహంత్ క్లాస్ బల్లాస్టిక్ మిస్సైల్ సబ్ మెరైన్

అరిహంత్ క్లాస్ బల్లాస్టిక్ మిస్సైల్ సబ్ మెరైన్

సముద్రగర్భంలో ప్రయాణించగల అన్ని వాహనాల వేగాలను, లోతులను గమనించి శత్రు సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించగల అత్యాధునిక అణు జలాంతర్గామి ఇది. ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు మన భారతదేశం తన మొదటి అణు జలాంతర్గామి కలను నెరవేర్చుకుంది.

అరిహంత్ క్లాస్ బల్లాస్టిక్ మిస్సైల్ సబ్ మెరైన్

అరిహంత్ క్లాస్ బల్లాస్టిక్ మిస్సైల్ సబ్ మెరైన్

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ జలాంతర్గామి ప్రాధమిక పరీక్షల కోసం సాగర జలాల్లోకి దూసుకెళ్లేందుకు సిధ్ధమయింది. భారత రక్షణ శాఖ అత్యంత రహస్యంగా నిర్మించిన ఈ జలాంతర్గామికి ఐఎన్ఎస్ అరిహాంత్ (శత్రు సంహారిణి) అని పేరు పెట్టారు. ప్రపంచానికి తెలియకుండా ఈ జలాంతర్గామి నిర్మాణం అంతా ఎటివి అనే సంకేత నామంతోనే ఇంతకాలం సాగింది.

అరిహంత్ క్లాస్ బల్లాస్టిక్ మిస్సైల్ సబ్ మెరైన్

అరిహంత్ క్లాస్ బల్లాస్టిక్ మిస్సైల్ సబ్ మెరైన్

ఎడ్వాన్సుడు టెక్నాలజీ వెసల్(ఎటివి) ప్రాజెక్టుగా వ్యవహరిస్తున్న ఈ అణు జలాంతర్గామి నిర్మాణం అంతా విశాఖలోని నేవల్ డాక్ యార్డులోనే జరిగింది. ఈ జలాంతర్గామి తన సామర్ధ్యాన్ని పరీక్షించుకోడానికి బంగాళాఖాతంలోకి రెడీగా ఉంది.

అరిహంత్ క్లాస్ బల్లాస్టిక్ మిస్సైల్ సబ్ మెరైన్

అరిహంత్ క్లాస్ బల్లాస్టిక్ మిస్సైల్ సబ్ మెరైన్

ప్రపంచంలో అణుజలాంతర్గామికి రూపకల్పన చేసి, నిర్మించి, నడపగల సామర్ధ్యం ఇప్పటివరకూ కేవలం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలకు మాత్రమే ఉంది. ఇప్పుడు వాటి సరసన భారత్ సగర్వంగా నిలబడింది.

అరిహంట్ క్లాస్ బల్లాస్టిక్ మిస్సైల్ సబ్ మెరైన్

అరిహంట్ క్లాస్ బల్లాస్టిక్ మిస్సైల్ సబ్ మెరైన్

అతి క్లిష్టమైన మీనియేచర్ 80 మెగావాట్ల ప్రెస్సరైజ్ డ్ వాటర్ రియార్టర్ ద్వారా ఈ ఎటివి పనిచేస్తుంది. 2012 నుంచి అయిదు సంవత్సరాల్లో మరో రెండు అణుజలాంతర్గాములను భారత్ నిర్మిస్తుంది. ఆరువేల టన్నుల బరువైన ఈ ఐఎన్ఎస్ అరిహాంత్ పరీక్షలు పూర్తి చేసుకుని సంపూర్ణంగా రక్షణ విభాగం అమ్ములపొదిలో చేరింది.

అరిహంత్ క్లాస్ బల్లాస్టిక్ మిస్సైల్ సబ్ మెరైన్

అరిహంత్ క్లాస్ బల్లాస్టిక్ మిస్సైల్ సబ్ మెరైన్

ఇది ఇండియా యెక్క మొట్టమొదటి బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి. ఈ క్షిపణి 12 కె 15 షార్ట్ రేంజ్ న్లూక్లియర్ గన్ లను అలాగే 14 కె 4 ఇంటర్ మీడియట్ రేంజ్ న్యూక్లియర్ మిస్సైల్ ను మోసుకెళ్లగలదు. దీని రేంజ్ దాదాపు 700 కిలోమీటర్లు..ఇండియన్ సముద్రం నుంచి చైనాకు చేరుకునే సామర్ధ్యం దీని సొంతం. ఇక్కడి నుంచి మిస్సైల్ ను పేలిస్తే అది బీజింగ్ వరకు చేరుకుంటుంది.

స్కార్పీన్ జలాంతర్గామి

స్కార్పీన్ జలాంతర్గామి

భారత్ ఫ్రాన్స్ సంయుక్తంగా తయారు చేసిన "స్కార్పీన్ జలాంతర్గామి" ఏప్రిల్ నెలలో తొలిసారిగా జల ప్రవేశం చేసింది. ముంబయిలోని మజ్గాన్ డగ్స్ వద్ద కేంద్ర రక్షణ శాఖ మంత్రి దీన్ని సముద్రంలోకి ప్రవేశపెట్టారు. వివిధ రకాల పరీక్షల అనంతరం స్కార్పీన్ 2016లో నావికాదళంలోకి పూర్తి స్థాయిలో చేరనుంది.

స్కార్పీన్ జలాంతర్గామి

స్కార్పీన్ జలాంతర్గామి

ఫ్రాన్స్ కు చెందిన డీసీఎన్ఎస్ సహాయంతో 6 స్కార్పీన్ ల తయారీ 2005లో ప్రారంభమైంది. తొలుత రూ. 5 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టును చేపట్టగా, ఇప్పుడది రూ. 23 వేల కోట్లకు పెరిగింది. ఇకపై ప్రతి 9 నెలలకో స్కార్పీన్ చొప్పున మొత్తం 6 స్కార్పిన్ జలాంతర్గామిలను నావికాదళానికి అందిస్తామని ఆయన వివరించారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందవచ్చు. https://www.facebook.com/GizBotTelugu

Best Mobiles in India

English summary
Here Write Five Indian Weapons of War China Should Fear

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X