పాకిస్తాన్‌కు వణుకు పుట్టించే వార్త

|

ఇన్నాళ్లు పాకిస్తాన్ భారత్ పై కాలు రువ్వుతూ వస్తోంది..కాని ఈ వార్త వింటే కాలు రువ్వడం కాదు కదా...గుండెల్లో గుబులు రేకెత్తించక మానదు. భారత్ అమ్ములపొదిలోకి అత్యాధునికమైన యుధ్ధ విమానాలు రానున్నాయి. వాయు వేగంతో వెళ్లి శత్రు సేనలను చంపగల యుద్ధ విమానాలకు డీల్ ఒకే అయినట్లు తెలుస్తోంది. యుఎస్ నుంచి అత్యాధునికమైన..అత్యంత పవర్ పుల్ యుద్ధ విమానాలను కొన్ని బిలియన్ల డాలర్లు పెట్టి తీసుకువచ్చే దానికి ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. కాగా భారత్ కు యుద్ధ విమానాలను సప్లయి చేసే అతి పెద్ద దేశం అమెరికానే కావడంతో ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ కు చెమటలు పట్టే దూరం ఎంతో లేదని తెలుస్తోంది..మిగతా కథనం స్లైడర్ లో..

Read more:పాక్‌తో యుద్ధం: ఇండియాకు 15 సెకన్లే ఎక్కువ

ah-64 అపెచ్ ఫైటర్ జెట్ విమానం

ah-64 అపెచ్ ఫైటర్ జెట్ విమానం

అపెచ్ లాంగ్ బో గన్ షిప్ యుధ్ధ విమానం ఇది. ఇప్పుడు యుఎస్ ఆర్మీ వాడుతోంది.. ఇదొక అత్యాధునికమైన యుద్ధ విమానం..దీన్ని భారత్ 1.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు అంతా రెడీ అయినట్లు తెలుస్తోంది. 39 అపెచ్ యుధ్ధ విమానాల కోసం డీల్ ఒకే అయినట్లు తెలుస్తోంది.

c-17 గ్లాంబ్ మాస్టర్ -111

c-17 గ్లాంబ్ మాస్టర్ -111

70 టన్నుల కార్గోని మోసుకెళ్లగల అత్యాధునిక యుద్ధ విమానం ఇది. దాదాపు 4200 కిలోమీటర్లు మోసుకెళ్లగలదు. ఈ యుద్ధ విమానాన్ని 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నారు. 10 గ్లాంబెపస్టర్ కోసం దాదాపు 4.1 బిలియన్ డాలర్లుకు 2011లోనే ఆర్డర్లు ఇచ్చారు.అయితే మరొక 6 గ్లాంబ్ మాస్టర్ కోసం ఆర్డర్ చేసినట్లుగా తెలుస్తోంది.

m777 హౌట్జిర్స్
 

m777 హౌట్జిర్స్

155 ఎమ్ ఎమ్ 39 కాటిబర్ గన్ ఇది. ఎంత దూరంలో ఉన్న వాటినైనా క్షణాల్లో ధ్వంసం చేయగలదు. దీనికి 770 మిలియన్ల డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. దాదాపు 145 గన్స్ కోసం ఇండియా యుఎస్ గవర్నమెంట్ మధ్య వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది.

ch-47చినోక్స్

ch-47చినోక్స్

సైనికుల క్యారీ బ్యాగులను మోసుకెళ్లే విమానాలు ఇవి. వీటి కోసం 1.1 బిలియన్ల డాలర్ల ఒప్పందం కుదిరింది. 15 చినోక్స్ కొనుగోలుకు ఆర్థిక శాఖ అమోదం కోసం చూస్తోంది.

p-81 ఎయిర్ క్రాఫ్ట్

p-81 ఎయిర్ క్రాఫ్ట్

907 kmph వేగంతో దూసుకెళ్లే ఈ విమానం అలాగే 1200 నాటికల్ మైళ్ల దూరం వరకు దూసుకుపోగలదు.టెర్రరిస్టులను ఉగ్రవాదులను ఏరిపారేయడానికి ఈ యుద్ధ విమానాలను ఉపయోగించనున్నారు. దీని కోసం 1 బిలియన్ డాలర్ల డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. 4 యుద్ధ విమానాల కొనుగోలుకు ఢిపెన్స్ ఆక్విసిటేషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే 8 యుద్ధ విమానాల కోసం 2. 1 బిలియన్ల డాలర్లతో 2009 లో ఒప్పందం కుదిరింది.

భారత్ చిరకాల శత్రువు పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టించే వార్త

భారత్ చిరకాల శత్రువు పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టించే వార్త

ఇక భారత్ చిరకాల శత్రువు పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టించే వార్త ఇది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత బలమైన సైనిక శక్తిని కలిగి ఉన్న దేశాల జాబితాను ప్రముఖ రీసెర్చ్ అండ్ రేటింగ్ సంస్థ క్రెడిట్ సూస్ ప్రకటించగా ఇండియా అందులో ఐదవ స్థానంలో నిలిచింది.

అమెరికా మొదటి స్థానంలో

అమెరికా మొదటి స్థానంలో

ఈ జాబితాలో 0.94 పాయింట్ల స్కోర్ తో అమెరికా మొదటి స్థానంలో నిలువగా ఆపై వరుసగా రష్యా చైనా జపాన్ ఇండియా ఫ్రాన్స్ సౌత్ కొరియా ఇటలీ బ్రిటన్ టర్కీ నిలిచాయి. ఈ జాబితాలో పాకిస్తాన్ 11వస్థానంలో ఉందని క్రెడిట్ సూస్ నివేదిక తెలిపింది.

అమెరికా 2014లో రక్షణ రంగానికి 610 బిలియన్ డాలర్లు

అమెరికా 2014లో రక్షణ రంగానికి 610 బిలియన్ డాలర్లు

మొత్తం 13,900 యుద్ధ విమానాలు 920 యుద్ధ హెలికాప్టర్లు 20 విమాన వాహన నౌకలు 72 సబ్ మెరైన్లు కలిగిన అమెరికా 2014లో రక్షణ రంగానికి 610 బిలియన్ డాలర్లు కేటాయించింది. ఈ విభాగంలో తిరుగులేని దేశంగా నిలిచిందని తెలిపింది. ప్రపంచంలోని అణుశక్తిలో 90 శాతం రష్యా అమెరికా వద్దనే ఉందని పేర్కొంది.

భారత్ తమతో ఏ తరహా యుద్ధ మార్గంలో తలపడినా

భారత్ తమతో ఏ తరహా యుద్ధ మార్గంలో తలపడినా

కాగా భారత్ తమతో ఏ తరహా యుద్ధ మార్గంలో తలపడినా తాము సమర్థవంతంగా సమాధానం చెప్పగలమని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రషీష్ షరీఫ్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

రఫాలే అత్యాధునిక యుద్ధ విమానాలు

రఫాలే అత్యాధునిక యుద్ధ విమానాలు

అయితే వీటితో పాటు రఫాలే అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా త్వనలో భారత్ అమ్ములపొదిలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 36 రఫాలే విమానాలు అర్జంటెగా కొనుగోలు చేసే ఆలోచనలో నరేంద్ర మోడీ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.

దాదాపు8.9 బిలియన్ల డాలర్లు ఖర్చు

దాదాపు8.9 బిలియన్ల డాలర్లు ఖర్చు

ఈ యుద్ధ విమానాల కోసం దాదాపు8.9 బిలియన్ల డాలర్లు ఖర్చు చేరనున్నట్లు సమాచారం. ఇవి నెల లేదా రెండు నెలల్లో ఇండియాకు తీసుకువచ్చే పనిలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

60 రఫాలే విమానాలను కొనుగోలు చేయాలని అప్పుడు బిడ్లు

60 రఫాలే విమానాలను కొనుగోలు చేయాలని అప్పుడు బిడ్లు

అయితే 60 రఫాలే విమానాలను కొనుగోలు చేయాలని అప్పుడు బిడ్లు ఆహ్వనించారు. వీటి విలువ సుమారు రూ.25 వేల కోట్లు. ఈ విమానాలను మీడియం మల్టీ-రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్టులని పిలుస్తారు. క్లుప్తంగా MMRCA అని వ్యవహరిస్తారు. 

126 విమానాలకు ఇండియా వివిధ దేశాల నుంచి బిడ్లు

126 విమానాలకు ఇండియా వివిధ దేశాల నుంచి బిడ్లు

ఇలాంటి 126 విమానాలకు ఇండియా వివిధ దేశాల నుంచి బిడ్లు ఆహ్వానించగా ఫ్రాన్స్ కు చెందిన దసాల్ట్ రఫాలే(Dasault Rafale) అతి తక్కువకు కోట్ చేసింది. ఫైనల్ అమౌంట్ మీద తమకు కొన్ని సమస్యలు ఉన్నాయని ఫ్రాన్స్ చెబుతోంది.

2017 కల్లా రఫాలే విమానాలను కొనుగోలు చేయాలనేది ఇండియా ప్రణాళిక

2017 కల్లా రఫాలే విమానాలను కొనుగోలు చేయాలనేది ఇండియా ప్రణాళిక

2017 కల్లా రఫాలే విమానాలను కొనుగోలు చేయాలనేది ఇండియా ప్రణాళిక. మిగ్ యుద్ధ విమానాలు పాతబడి పోవడం.. పొరుగున ఉన్న చైనా, పాకిస్థాన్ లు ఆయుధ సంపత్తిలో ముందుకు వెళుతుండటంతో ఇండియా కొత్తగా యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఫ్రాన్స్ డిఫెన్స్ ఇండస్ట్రీకి ఎంతో మేలు చేస్తోంది. భారత్ అమ్ములపొదిలోకి అత్యాధునిక ఆయుధాలు చేరుతాయి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందవచ్చు. https://www.facebook.com/GizBotTelugu

Best Mobiles in India

Read more about:
English summary
Her Write Here are the arms the US wants India to buy

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X