ఈ కంపెనీల్లో ఉద్యోగం రాజభోగమే..

Written By:

ఈ కంపెనీల్లో ఉద్యోగులు రాజభోగాన్ని అనుభవిస్తున్నారని లింక్డ్ ఇన్ సర్వే తేల్చి చెప్పింది. ఉద్యోగులు పనిచేయడానికి ఇష్టపడే కంపెనీల లిస్టును లింక్డ్ ఇన్ సర్వే చేసింది. ఈ సర్వేలో ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌‌కార్ట్, అమెజాన్ లేనట. వరుసగా రెండో ఏడాది కూడా లింక్డ్ ఇన్ భారత టాప్ కంపెనీల 2017 జాబితాలో ఈ కంపెనీలు టాప్ లో నిలిచాయి. ఈ రెండింటి తర్వాత మూడో స్థానంలో కేపీఎంజీ ఇండియా స్థానం దక్కించుకుంది.

అమెజాన్‌లో ఫోన్ కొంటే 45జిబి ఉచిత డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాప్-10 జాబితాలో

లింక్డ్ ఇన్ రూపొందించిన ఈ జాబితాలో టాప్-10 జాబితాలో వన్97 కమ్యూనికేషన్స్(4వ), ఓలా(5వ), హెచ్సీఎల్ టెక్నాలజీస్(6వ), అడోబ్(7వ), ఆల్ఫాబెట్(8వ), ఓయో రూమ్స్(9వ), రిలయన్స్ ఇండస్ట్రీస్(10వ)లు నిలిచాయి.

30 శాతం కొత్త కంపెనీలే

టాప్-25 కంపెనీల్లో 30 శాతం కొత్త కంపెనీలేనని లింక్డ్ ఇన్ ఓ ప్రకటనలో తెలిపింది.

జాబితాలో కొత్తగా

టెక్ మహింద్రా, వన్ 97 కమ్యూనికేషన్స్, స్విగ్గీ, ఐడీఎఫ్సీ బ్యాంకు, వొడాఫోన్, ఓరాకిల్, గ్రోఫర్స్, మెకిన్సే అండ్ కంపెనీ లాంటివి ఈ జాబితాలో కొత్తగా వచ్చి చేరినట్టు పేర్కొంది.

ఓలా ఈ ఏడాది టాప్5 స్థానానికి

గతేడాది టాప్ 10 లో ఉన్న ఓలా ఈ ఏడాది టాప్5 స్థానానికి వచ్చింది. ఓయో రూమ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సిస్కో కంపెనీలు కూడా తమ ర్యాంకింగ్స్ ను పెంచుకున్నాయి.

దేశీయ కంపెనీలే

భారత ప్రొఫెషనల్స్ కు కంపెనీల సంప్రదాయం, వృద్ధి అవకాశాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకోవడం కోసం అత్యంత ఆకట్టుకుంటున్న కంపెనీలను జాబితాను అనాలసిస్ చేశామని లింక్డ్ ఇన్ ఇండియా డైరెక్టర్ టాలెంట్ సొల్యుషన్స్ అండ్ లెర్నింగ్ సొల్యుషన్స్ ఇర్ఫాన్ అబ్దుల్లా చెప్పారు. ఆశ్చర్యకరంగా దేశీయ కంపెనీలే దీనిలో టాప్ లో నిలిచినట్టు పేర్కొన్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart, Amazon top LinkedIn's companies list read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot