Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ లో గూగుల్, రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్ల హవా!!!

|

ఇండియాలో ప్రస్తుతం ఆన్‌లైన్ స్టోర్ ద్వారా వస్తువులను కొనుగోలు చేయడం అధికమవుతున్నది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లోపండుగ వాతావరణం మొదలుకానున్నది "ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్" పేరుతో అమ్మకాలు జరగనున్నాయి. ఈ నెల 16 నుండి ప్రారంభమయ్యే అమ్మకంలో స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయడానికి బ్రహ్మాండమైన ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ అమ్మకంలో ఈ నెల మొదటిలో విడుదల అయిన కొన్ని స్మార్ట్‌ఫోన్లు కూడా మొదటి సారి అమ్మకానికి రానున్నాయి. కొత్త స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు మీద గల డిస్కౌంట్ ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు మీద ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు మీద ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో కొత్తగా విడుదల అయిన స్మార్ట్‌ఫోన్లు గూగుల్ పిక్సెల్ 4a మరియు రియల్‌మి 7i స్మార్ట్‌ఫోన్లు కూడా మొదటి సారి అమ్మకానికి రానున్నాయి. వీటిని SBI యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల మీద కొనుగోలు చేసిన వారికి గొప్ప క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా లభిస్తున్నాయి.

 

Also Read: రూ.1,000 తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలుకు OnePlus Y-సిరీస్ టీవీలుAlso Read: రూ.1,000 తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలుకు OnePlus Y-సిరీస్ టీవీలు

గూగుల్ పిక్సెల్ 4a స్మార్ట్‌ఫోన్ ధరలు & ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్ ఆఫర్లు

గూగుల్ పిక్సెల్ 4a స్మార్ట్‌ఫోన్ ధరలు & ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్ ఆఫర్లు

6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఒకే ఒక‌ వేరియంట్‌లో విడుదల అయిన ఈ ఫోన్ యొక్క ధర 29,999రూపాయలు. ఇండియాలో దీని యొక్క మొదటి అమ్మకాలు అక్టోబర్ 16న ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డే స్పెషల్స్ అమ్మకంలో మధ్యాహ్నం 12PM నుండి మొదలుకానున్నాయి. గూగుల్ పిక్సెల్ 4a ఫోన్ కొనుగోలు మీద ఫ్లిప్‌కార్ట్‌లో లభించే అన్ని రకాల డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

రియల్‌మి 7i స్మార్ట్‌ఫోన్ ధరలు & ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్ ఆఫర్లు

రియల్‌మి 7i స్మార్ట్‌ఫోన్ ధరలు & ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్ ఆఫర్లు

ఇండియాలో రెండు వేరు వేరు వేరియంట్ లలో విడుదల అయిన రియల్‌మి 7i స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి అమ్మకాలు అక్టోబర్ 16 నుండి మొదలుకానున్నాయి. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.11,999 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.12,999. ఈ ఫోన్ ఫ్యూజన్ గ్రీన్ మరియు ఫ్యూజన్ బ్లూ వంటి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

రియల్‌మి 7i స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC

రియల్‌మి 7i స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC

రియల్‌మి 7i స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 మరియు రియల్‌మి యుఐతో రన్ అవుతుంది. దీని యొక్క డిస్ప్లే 90HZ రిఫ్రెష్ రేట్ మరియు 90 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.5-అంగుళాల HD + డిస్ప్లేని 720x1,600 పిక్సెల్స్ పరిమాణంలో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC తో రన్ అవుతూ 4GB LPDDR4x RAM తో జతచేయబడి ఉంటుంది.

గూగుల్ పిక్సెల్ 4a 3,140mAh బ్యాటరీ

గూగుల్ పిక్సెల్ 4a 3,140mAh బ్యాటరీ

గూగుల్ పిక్సెల్ 4a స్మార్ట్‌ఫోన్ యొక్క 5.81-అంగుళాల ఫుల్- HD + ఒఎల్ఇడి డిస్‌ప్లేను 19.5: 9 కారక నిష్పత్తితో మరియు హెచ్‌డిఆర్ సపోర్ట్‌తో కలిగి ఉంటుంది. ఇది ముందు భాగంలో ఆధునిక పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730G చిప్‌సెట్‌తో ప్యాక్ చేయబడి ఉంటుంది. ఇండియా మార్కెట్‌లో బడ్జెట్ హ్యాండ్‌సెట్‌లు కూడా 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నాయి అయితే గూగుల్ పిక్సెల్ 4a కొత్త ఫోన్ 18W అడాప్టర్‌తో 3,140mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది. యూజర్లు 24 గంటల బ్యాటరీ లైఫ్ ను పొందుతారని గూగుల్ పేర్కొంది.

Best Mobiles in India

English summary
Flipkart Big Billion Days Sale 2020: Best Offers on Google Pixel and Realme New Smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X