Flipkart Big Diwali Sale: స్మార్ట్‌ఫోన్‌లు, టీవీల మీద 80% వరకు డిస్కౌంట్ ఆఫర్స్...
ప్రముఖ ఇకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ యొక్క ప్లాట్‌ఫాంలో ఇటీవలే అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 21 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ దసరా స్పెషల్స్ అమ్మకాన్ని అక్టోబర్ 28 వరకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇ-కామర్స్ తన ప్లాట్‌ఫాంలో మరొక "బడా ధమకా" కోసం సిద్ధమవుతోంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్స్
ఫ్లిప్‌కార్ట్ యొక్క ప్లాట్‌ఫాంలో బిగ్ బిలియన్ డేస్ అమ్మకం మాదిరిగానే "ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్స్" అక్టోబర్ 29 నుండి నవంబర్ 4 వరకు కొనసాగనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం ఒక రోజు ముందు నుండే ప్రారంభమవుతుంది. ఇది అనేక బ్యాంక్ ఆఫర్లను, నో-కాస్ట్ EMI ఎంపికలను అనేక రకాల ఉత్పత్తుల కొనుగోలు మీద అందివ్వనున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్స్ బ్యాంక్ ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ యొక్క అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు అక్టోబర్ 29 అర్ధరాత్రి నుండి ప్రారంభమవుతుంది. అలాగే అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇది ఏడు రోజుల పాటు అందుబాటులో ఉండే ఈ సేల్స్ నవంబర్ 4 తో ముగుస్తుంది. ఈ సమయంలో వినియోగదారులు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల మీద EMI లావాదేవీలతో పాటుగా 10 శాతం తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్‌లో హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, SBI వంటి మరిన్ని ప్రముఖ బ్యాంకుల డెబిట్ కార్డుల వినియోగదారులు నో-కాస్ట్ EMIలను పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ లో స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపు ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి అమ్మకంలో శామ్‌సంగ్ గెలాక్సీ F41, శామ్‌సంగ్ గెలాక్సీ S20 +, శామ్‌సంగ్ గెలాక్సీ A50s వంటి సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లపై ఊహించని రీతిలో తగ్గింపును అందిస్తున్నది. అలాగే పోకో M2, పోకో M2 ప్రో, పోకో C3 ఫోన్ల మీద కూడా కొన్ని డిస్కౌంట్లు మరియు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నది. అదేవిధంగా ఒప్పో రెనో 2F, ఒప్పో A52, ఒప్పో F15తో సహా మరెన్నో ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లు మరియు రియల్‌మి నార్జో 20 సిరీస్ ఫోన్ల కొనుగోలు మీద అదిరిపోయే కొన్ని ఆఫర్‌లను అందిస్తున్నాయి. అదనంగా ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ప్రొటెక్షన్ ను కేవలం రూ.1 ధరకే అందిస్తున్నది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ లో ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్ లపై డిస్కౌంట్ ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి అమ్మకం సమయంలో కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లు మరియు మరెన్నో ఎలక్ట్రానిక్స్ మరియు వాటి యొక్క ఉపకరణాలపై వినియోగదారులకు 80 శాతం వరకు మినహాయింపును అందిస్తున్నాయి. ల్యాప్‌టాప్‌లను కోనుగోలు చేయాలనుకునే వ్యక్తులు ఎంచుకున్న ల్యాప్‌టాప్‌ల మీద 50 శాతం వరకు రాయితీని పొందవచ్చు. అలాగే టాబ్లెట్ల మీద 45 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. హెడ్‌ఫోన్లు మరియు స్పీకర్లను 80 శాతం తగ్గింపుతో కొనుగోలు చేసే గొప్ప అవకాశం అందిస్తుంది. ఈ అమ్మకంలో మూడు కోట్లకు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వీటి మీద ప్రతిరోజూ కొత్త ఒప్పందాలు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.


Click it and Unblock the Notifications








