Flipkart Big Saving Days sale 2021 పోకో స్మార్ట్‌ఫోన్‌లపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్!!ఇదే గొప్ప అవకాశం..

|

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ యొక్క పోర్టల్ లో కొత్తగా మరొక అమ్మకాన్ని ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్ సేవింగ్ డేస్ సేల్' జనవరి 20 న ప్రాంభమయ్యి జనవరి 24 వరకు జరగనున్నాయి. ఈ నాలుగు రోజుల అమ్మకంలో పోకో స్మార్ట్‌ఫోన్‌ల మీద గొప్ప తగ్గింపును అందిస్తున్నది. ప్రస్తుతం రూ.15 వేల నుంచి రూ.20,000 ధరల విభాగంలో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ గా ఉన్న పోకో X3ను మీద గొప్ప తగ్గింపు లభిస్తున్నది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్

ఫ్లిప్‌కార్ట్ లో జరిగే బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో ఫ్లిప్‌కార్ట్ ప్లస్ వినియోగదారులకు జనవరి 19 నుండి ముందస్తు యాక్సిస్ లభిస్తుంది. గత ఏడాది రూ.16,999 ప్రారంభ ధర వద్ద విడుదల అయిన పోకో X3 ఇప్పుడు రూ.14,999 ధర వద్ద లభిస్తున్నది. 120HZ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 732G చిప్‌సెట్, 6000mAh బ్యాటరీ, 64MP క్వాడ్-కెమెరా సెటప్‌ వంటి ఫీచర్లను కలిగిన ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

ఫ్లిప్‌కార్ట్‌ సేల్ HDFC ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్‌ సేల్ HDFC ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్‌లో జరిగే బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో పోకో X3, పోకో M2 ప్రో, పోకో C3 మరియు పోకో M2లతో సహా పలు స్మార్ట్‌ఫోన్‌లపై కంపెనీ అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తున్నది. వీటి మీద డిస్కౌంట్ ధరలతో పాటుగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించి ఫోన్ లను కొనుగోలు చేసిన వినియోగదారులకు అదనంగా 10 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది.

పోకో C3, M2 స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్ ఆఫర్లు

పోకో C3, M2 స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్‌లో పోకో స్మార్ట్‌ఫోన్‌ల మీద లభించే డిస్కౌంట్ ఆఫర్ల విషయానికి వస్తే ఈ బంచ్‌లో చౌకైన ధరలో లభించే పోకో C3 యొక్క 3GB ర్యామ్ / 32GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.6,999 ధర వద్ద మరియు 4GB ర్యామ్ / 64GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.7,999 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే 6GB ర్యామ్ వేరియంట్‌లో లభించే పోకో M2 ను రూ.9,999 ధర వద్ద పొందవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డుల ద్వారా EMI పద్దతిలో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాండ్ డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.1000 తగ్గింపు లభిస్తుంది.

పోకో X3, M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్ ఆఫర్లు

పోకో X3, M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్‌లోని కొత్త అమ్మకం సమయంలో పోకో M2 ప్రో యొక్క బేస్ వేరియంట్‌ను రూ.11,999 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యొక్క అదనపు ఆఫర్ లో భాగంగా రూ.1000 తగ్గింపు ధరతో రూ.10,999 ప్రభావవంతమైన ధరకు తగ్గిస్తుంది. దీనితో పాటుగా పోకో X3 బేస్ వేరియంట్ ను రూ.14,999 ధర వద్ద నుండి కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు దీనిని 13,999 రూపాయలకే పొందవచ్చు.

పోకో X3 స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్ మరియు హెడ్ఫోన్ జాక్ వంటివి కలిగి ఉన్నాయి. ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో వై-ఫై, బ్లూటూత్, 4G, జిపిఎస్ / ఎ-జిపిఎస్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది మరియు ఫోన్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఫోన్ IP53 గా రేట్ చేయబడింది. చివరగా, పోకో ఎక్స్ 3 165.3x76.8x9.4 మిమీ మరియు 215 గ్రాముల బరువును కొలుస్తుంది.

పోకో M2 ప్రో స్నాప్‌డ్రాగన్ 720G సాఫ్ట్‌వేర్

పోకో M2 ప్రో స్నాప్‌డ్రాగన్ 720G సాఫ్ట్‌వేర్

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.7-అంగుళాల LCD డిస్‌ప్లేను 60HZ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720G మరియు అడ్రినో 618 GPUతో రన్ అవుతూ 4GB/ 6GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజీతో జతచేయబడి వస్తుంది. ఈ ఫోన్ యొక్క సాఫ్ట్‌వేర్ అప్ డేట్ల విషయానికి వస్తే పోకో కొత్త కొత్త అప్ డేట్ లను అందిస్తుంది. ఫోన్ యొక్క ముందు భాగంలో పంచ్-హోల్ సెటప్ లోపల 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇందులో గల సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా సులభంగా ఫోన్ ను అన్ లాక్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Flipkart Big Saving Days sale 2021: Great Discount Offers on Poco X3, Poco M2 Pro and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X