మొబైల్ ఫోన్ ఆర్డర్ చేస్తే మామిడి పళ్లు వచ్చాయ్

Posted By:

ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ల అజాగ్రత్త కారణంగా వినియోగదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ను నమ్ముకున్న ఓ కుర్రోడికి మొబైల్ ఫోన్‌కు బదులుగా మామిడి పళ్లు చేతికి వచ్చాయి. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన సృచరణ అనే వినియోగదారుడు మే 26 తేదీన ఫ్లిప్‌కార్ట్ అధికారక వెబ్‌సైట్‌లో తన క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.8,099 చెల్లించి మొబైల్ ఫోన్‌ను బుక్ చేసుకున్నాడు.

మొబైల్ ఫోన్ ఆర్డర్ చేస్తే మామిడి పళ్లు వచ్చాయ్

అయిదు రోజుల తరువాత కొరియర్ సంస్థ నుంచి ఫ్లిప్‌కార్ట్ పార్సిల్‌లో మొబైల్ ఫోన్‌కు బదులు రెండు మామిడి పండ్ల దర్శనమివ్వటాన్ని చూసి అవాక్కయ్యాడు. తనకు రాంగ్ పార్సిల్ వచ్చిందంటూ కస్టమర్ కేర్‌కు కాల్ చేసినప్పటికి వారి నుంచి సరైన స్పందన లభించకపోవటంతో జరిగిన విషయాన్ని మీడియా దృష్టికి తీసుకువచ్చాడు.

(చదవండి: హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్)

English summary
Flipkart delivered Mangoes Instead of A Mobile Phone. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting