భారత ఈ కామర్స్ దిగ్గజానికి అసలేమైంది..?

Written By:

భారతదేశంలోనే అతి పెద్ద రీటెయిలింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ రోజు రోజుకు అంచనాలకు అందకుండా డల్ అవుతోంది. రాను రాను అనేక ఇబ్బందులు ఈ దిగ్గజ కంపెనీని వెంటాడేలా ఉన్నాయని తెలుస్తోంది. అందులో భాగంగానే వివిధ కంపెనీల్లో తన వాటాలను తగ్గించుకుంటూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా మరో అడుగు వెనక్కి వేసి 618 మిలియన్ డాలర్ల విలువ చేసే 1.04 మిలియన్ల షేర్లను వదులుకున్నట్లు యూఎస్ సెక్ వెల్లడించింది.

Read more: హైదరాబాద్‌కు హ్యాండిచ్చి బెంగుళూరుకు జంప్ అయిన ఆపిల్

భారత ఈ కామర్స్ దిగ్గజానికి అసలేమైంది..?

ఇది అమెజాన్ లో రెండింట మూడో వంతు వాటాలు. అంతే కాకుంగా ఆలీబాబా గ్రూప్ లో కూడా భారీగా వాటాలను తగ్గించుకున్నట్లు సెక్ తెలిపింది. అయితే ఫ్లిప్‌కార్ట్ తో పాటు ఆపిల్ , జేడీ. కామ్, జిల్లో గ్రూపులు కూడా తమ వాటాలను తగ్గించుకున్నాయి. భారత ఈ కామర్స్ రంగాన్ని శాసించేందుకు అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ , స్నాప్ డీల్ పోటీలు పడుతుండగా ఫ్లిప్ కార్ట్ ఇలా వెనకడుగు వేయడంపై కష్టమర్లు నిరాశకు గురి అవుతున్నారు. అసలు ప్లిప్‌కార్ట్‌కు ఏమైంది.. వాచ్ దిస్ స్టోరి

Read more : ఇండియాలో బెస్ట్ ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారత ఈ కామర్స్ దిగ్గజానికి అసలేమైంది..?

భారత్ ఈ-కామర్స్ బిజినెస్‌ను ఓ ఊపు ఊపిన ఫ్లిప్‌కార్ట్ కు ఈమధ్య కాలం కలిసి రావట్లేదు. ఈ కంపెనీకి పెట్టుబడుల రాక తగ్గింది. ఫండ్స్ కోసం ఎంతమంది పెట్టుబడిదారులను కలిసినా అనుకున్నంత పెట్టుబడులు రావట్లేదని ఫ్లిప్‌కార్ట్ నిరాశను వ్యక్తంచేస్తోంది.

భారత ఈ కామర్స్ దిగ్గజానికి అసలేమైంది..?

15 బిలియన్ డాలర్ల కోసం ఆరునెలల కాలంలో ఫ్లిప్‌కార్ట్ దాదాపు 15 మందికి పైగా పెట్టుబడిదారులతో మంతనాలు జరిపింది. కానీ ఎవరి నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో కంపెనీ తీవ్రమైన నిరాశలోకి కూరుకుపోయినట్లు తెలుస్తోంది.

భారత ఈ కామర్స్ దిగ్గజానికి అసలేమైంది..?

ఇక స్నాప్ డీల్ పరిస్థితి కూడా ఇదే. అలీబాబా గ్రూప్, ఫాక్స్ కాన్, అంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డులను ఫ్లిప్ కార్ట్ కలిసి, పెట్టుబడుల కోసం అభ్యర్థించింది. కానీ వారెవరూ పెట్టుబడి పెట్టడానికి సమ్మతంగా లేమన్నట్టు తెలిసింది.

భారత ఈ కామర్స్ దిగ్గజానికి అసలేమైంది..?

2014 మొదలు నుంచి 2015 మధ్య వరకూ ఫ్లిప్‌కార్ట్ కొత్త పెట్టుబడిదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ కొత్త పెట్టుబడుల విషయంలో అంచనాలను ఆ కంపెనీ అందుకోలేకపోయింది.

భారత ఈ కామర్స్ దిగ్గజానికి అసలేమైంది..?

టైగర్ గ్లోబల్, ఖతర్ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ, పాత పెట్టుబడిదారుల నుంచి గతేడాది జూలైలో కేవలం 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులను మాత్రమే కంపెనీ రాబట్టుకోగలిగింది. కొత్త పెట్టుబడులు పెంచుకోవడానికి ఈ రెండు సంస్థలు తెగ తాపత్రయ పడుతున్నాయి.

భారత ఈ కామర్స్ దిగ్గజానికి అసలేమైంది..?

అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ పోటీని తట్టుకొని, వాటి బిజినెస్ ను పెంచుకోవాలంటే కచ్చితంగా ఈ రెండు సంస్థలు కొత్త పెట్టుబడులను రాబట్టుకోక తప్పదు.

భారత ఈ కామర్స్ దిగ్గజానికి అసలేమైంది..?

అమెజాన్ మార్కెట్లో తనకున్న క్రేజ్ తో ఇన్వెస్ట్‌మెంట్లను రాబట్టుకుంటోంది. తనకున్న అధీకృత మూలధనం రూ.16 వేల కోట్ల కంటే రెండింతల మూలధనాన్ని ఆ కంపెనీ కలిగి ఉంది.

భారత ఈ కామర్స్ దిగ్గజానికి అసలేమైంది..?

ఈ-కామర్స్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలపై కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు కూడా ఈ స్టార్టప్ కంపెనీలకు అడ్డంకిగా మారాయి. ఈ నిబంధనలపై ఈ సంస్థలకు అవగాహన తక్కువగా ఉండటంతో ఇబ్బందులకు గురవుతున్నాయి. అందుకే కొన్ని కేసుల్లో కూడా చిక్కుకుని విలవిలలాడాయి.

భారత ఈ కామర్స్ దిగ్గజానికి అసలేమైంది..?

ఆన్‌లైన్ రిటైల్ లో 100 శాతం విదేశీ పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ మార్చి 29న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయి. దీంతో ఒక్కసారిగా కంపెనీ ఆదాయాలు దారుణంగా పడిపోయాయి.

భారత ఈ కామర్స్ దిగ్గజానికి అసలేమైంది..?

ఇప్పటివరకూ ఈ కంపెనీలు అధికంగా ఆపర్ చేస్తున్న డిస్కౌంట్లను ప్రభుత్వ నిబంధనలతో తగ్గించడంతో, వినియోగదారులను ఆకట్టుకోలేక గతేడాది దీపావళి సీజన్‌లో తక్కువ అమ్మకాలను నమోదు చేశాయి. దీంతో కంపెనీ ఇంకా నష్టాల ఊబిలోకి వెళ్లిపోయింది.

భారత ఈ కామర్స్ దిగ్గజానికి అసలేమైంది..?

ఇదిలా ఉంటే ఫ్లిప్ కార్ట్ విలువను తగ్గిస్తున్నట్లు రీసెర్చ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ప్రకటించింది. గత సంవత్సరం 15 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.03 లక్షల కోట్లు)గా ఉన్న ఫిప్ కార్ట్ విలువ ప్రస్తుతం 4 బిలియన్ డాలర్లు తగ్గి 11 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 75,625 కోట్లు) చేరినట్టు సర్వే సంస్థ మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది.

భారత ఈ కామర్స్ దిగ్గజానికి అసలేమైంది..?

జూన్ 2015తో పోలిస్తే సంస్థలో పెట్టుబడులు 27 శాతం తగ్గి 58.9 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 405 కోట్లు) చేరిందని, దీంతో బ్రాండ్ వాల్యూ సైతం దిగజారిందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ దెబ్బ కంపెనీపై తీవ్రమైన ప్రభావాన్నే చూపినట్లు నిపుణులు చెబుతున్నారు.

భారత ఈ కామర్స్ దిగ్గజానికి అసలేమైంది..?

భవిష్యత్తులో సంస్థ నిధుల సమీకరణ సవాలుగా మారనుందని అమెజాన్ వంటి దిగ్గజాలతో పాటు ఎన్నో చిన్న చిన్న సంస్థల నుంచి పోటీ పెరగనుందని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. అనుకున్నట్లుగానే ఫ్లిప్ కార్ట్ నిధుల వేటలో రోజు రోజుకు వెనక్కి వెళుతోంది.

భారత ఈ కామర్స్ దిగ్గజానికి అసలేమైంది..?

నిధుల వేటలో ఉన్న ఈ దిగ్గజ కంపెనీ గతేడాది ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ సంస్థతో కలిసి సంయుక్తంగా రూ. 1400 కోట్లకు తమ ఆస్తులను కుదువ పెట్టాయి. వ్యాపార వ్యూహాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వారు చెబుతున్నారు. అయితే సంస్థ ఇబ్బందుల్లో ఉండటం వల్లే ఇలా ఆస్తులు కుదువ పెట్టినట్టు సమాచారం.

భారత ఈ కామర్స్ దిగ్గజానికి అసలేమైంది..?

అయితే ఇది ఒకసారే కాదు ఇంతకు ముందు రెండు సార్లు ఫ్లిప్‌కార్ట్ ఇలా బ్యాంకుల నుంచి రుణాలను పొందింది. గతంలో ఓసారి ఐసీఐసీఐ నుంచి రూ. 650 కోట్లు, అలాగే మరోసారి రూ. 820 కోట్లు రుణంగా తీసుకుంది.

భారత ఈ కామర్స్ దిగ్గజానికి అసలేమైంది..?

అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలతో పోటీపడటానికి ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ అప్పుల ఊబిలోకి కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అమెజాన్ ఆధీనంలోకి ఫ్లిప్‌‌కార్ట్ వెళ్లనుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో ఇది కంపెనీ పైనా తీవ్రమైన ప్రభావమే చూపినట్లు తెలుస్తోంది.

భారత ఈ కామర్స్ దిగ్గజానికి అసలేమైంది..?

ఈ దిగ్గజ ఇండియా కంపెనీ లాభాల బాటలోకి వచ్చి ఈ కామర్స్ రంగాన్ని శాసిస్తుందా లేక మళ్లీ వెనక్కి వెళుతుందా అనేది ముందు ముందు చూడాలి.

మరిన్ని స్టోరీల కోసం క్లిక్ చేయండి

చిక్కుల్లో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్

ఫ్లిప్‌కార్ట్ నష్టం రూ. 2 వేల కోట్లు: డిస్కౌంట్లే కొంపముంచాయి

కోట్లాస్తి ఉన్నా ధనదాహం తీరడం లేదు : అమెజాన్ బాస్

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Flipkart investor Tiger Global cuts stake in Amazon by 67 percent
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot