హైదరాబాద్‌కు హ్యాండిచ్చి బెంగుళూరుకు జంప్ అయిన ఆపిల్

Written By:

ఐటీ దిగ్గజం ఆపిల్ తెలంగాణా రాజధాని హైదరాబాద్‌కు షాకిచ్చింది. తాను ఎప్పటినుంచో ఇండియాలో స్థాపించాలనుకుంటున్న యాప్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ను బెంగుళూరులో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆపిల్ కంపెనీ నుంచి వస్తున్న ఈ అవకాశాన్ని దక్కించుకునేందుకు దాదాపు అన్ని రాష్ట్రాలు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూనే ఉన్నాయి.

Read more : ఆపిల్ సీఈఓ ఇండియా పర్యటన వెనుక ఆంతర్యం ఏమిటీ..?

హైదరాబాద్‌కు హ్యాండిచ్చి బెంగుళూరుకు జంప్ అయిన ఆపిల్

అయితే అది తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని ఆపిల్ చెప్పడం దాంతోపాటు ఐటీ మంత్రి ఆపిల్ హైదరాబాద్ కు వస్తుందంటూ ట్వీట్ చేయడంతో కొంత ఉత్సాహం వచ్చింది. అయితే ఆపిల్ తాజాగా దాన్ని బెంగుళూరుకు తరలించడంతో తెలంగాణా రాష్ట్రం ఇప్పుడు నిరాశకు గురి అయిందనే చెప్పాలి. అదీగాక ఈ రోజు ఓపెనింగ్ అంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కాని అది హైదరాబాద్ ను కాదని బెంగుళూరుకు తరలివెళ్లింది. ఈ సెంటర్ లో వినూత్న మొబైల్ యాప్‌లను తయారు చేసి భారత్‌లోని డెవలపర్లకు సహకరించేలా తయారు చేయనున్నారు.

Read more: వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

హైదరాబాద్‌కు హ్యాండిచ్చి బెంగుళూరుకు జంప్ అయిన ఆపిల్

ఈ సెంటర్ కోసం ఎంత పెట్టుబడి పెట్టునున్నామన్న విషయాన్ని ఆపిల్ వెల్లడింలేదు. 2017లో ఈ సెంటర్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. భారత్‌లో స్టార్టప్ సంస్థల పుట్టినిల్లుగా ఉన్న బెంగళూరులో యాప్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ సెంటరును ప్రారంభించనున్నామని, భారత్‌లో ఇప్పటికే వేలమంది కొత్త తరం యాప్‌ల తయారీకి కృషి చేస్తున్నారని పేర్కొంది. ఐఓఎస్ ఆపరేటింగ్ విధానంలో పని చేసేలా తయారయ్యే యాప్‌లకు ఇక్కడ పూర్తి సహాయ, సహకారాలు లభిస్తాయని ఆపిల్ సంస్థ వెల్లడించింది.

Read more: ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

హైదరాబాద్‌కు హ్యాండిచ్చి బెంగుళూరుకు జంప్ అయిన ఆపిల్

ఇక్కడికి వచ్చి యాప్‌లను తయారు చేసే వారికి ప్రతి వారమూ ఆపిల్ నిపుణులు సలహా సూచనలు ఇస్తారని తెలిపింది. కాగా, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ బుధవారం రిలయన్స్ అధినేత ముకేష్ అంబాని కుమారుడు అనంత్ అంబానీతో కలిసి ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో పూజలు చేశారు. వ్యాపార సమావేశాల అనంతరం ఆయన వినాయకుడిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆయన చైనా పర్యటనకు వెళతారని తెలుస్తోంది. వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. 

Read more: ఆశలు ఆవిరి: గూగుల్‌కు భారీ షాక్ తప్పదా..?

హైదరాబాద్‌కు హ్యాండిచ్చి బెంగుళూరుకు జంప్ అయిన ఆపిల్

కాగా, తెలంగాణలోని హైదరాబాదులో ఆపిల్ జూన్ నెలలో ఇన్నోవేషన్ కేంద్రాన్ని మొదలు పెట్టాలనుకున్న విషయం తెలిసిందే.కేటీఆర్ కూడా ఓ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆపిల్ డెవలప్‌మెంట్ సెంటర్ బెంగళూరులో ప్రకటించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ముంబైలో ఆపిల్ సీఈఓ

ఆపిల్ సీఈఓ ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో పూజలు చేస్తున్న దృశ్యం

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Apple announces iOS App Development Centre in Bengaluru
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot