Home
News

Flipkart లో కొత్తగా మరొక సేల్!! ఈ స్మార్ట్‌ఫోన్‌లపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్...

2021 కొత్త సంవత్సరం మరొక నాలుగు రోజులలో ప్రారంభం కానున్నది. 2021 ను గ్రాండ్ గా వెల్కమ్ పలికే అవకాశం ప్రస్తుత సమయాలలో ఉండకపోవచ్చు. కరోనా కొత్త వైరస్ కారణంగా న్యూ ఇయర్ రోజు బయట తిరగడానికి కొన్ని కండిషన్స్ ఉండవచ్చు. అందుకోసం మీకు నచ్చిన వారికి స్మార్ట్‌ఫోన్‌లను గిఫ్ట్ ఇచ్చి వెల్కమ్ చెప్పాలనుకునే వారికి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇండియాలో ఇప్పుడు మరొక సేల్ తో ముందుకు వచ్చింది.

Flipkart Mobile's Year End Sale 2020

Flipkart Mobile's Year End Sale 2020

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ఇయర్ ఎండ్ సేల్ పేరుతో వస్తున్న కొత్త సేల్ లో స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీద అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నది. బడ్జెట్ ధరల నుండి ప్రీమియం ధరల వద్ద లభించే స్మార్ట్‌ఫోన్‌ల అన్నిటి మీద కొన్ని తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నది. అలాగే వినియోగదారులు వారు ఉపయోగించే కొన్ని డెబిట్ మరియు క్రేడిట్ కార్డుల మీద తగ్గింపులను ఇవ్వడంతో పాటుగా క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ఇయర్ ఎండ్ సేల్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ఇయర్ ఎండ్ సేల్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ఇయర్ ఎండ్ అమ్మకం సమయంలో ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. వీటితో పాటుగా వినియోగదారులు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ లో ఈ సేల్ డిసెంబర్ 29 న మొదలై డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. ఈ మూడు రోజుల అమ్మకంలో డిస్కౌంట్ ధరలకు అందించే స్మార్ట్‌ఫోన్ల వివరాలను మరియు వాటి మీద లభించే ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ యొక్క ప్రత్యేక పేజీ లో ఇప్పటికే విడుదల చేసింది.

iPhone లపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ఆఫర్లు

iPhone లపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ఆఫర్లు

ఆపిల్ యొక్క ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ అమ్మకంలో మంచి అవకాశం లభించింది. రూ.42,500 ధరతో లాంచ్ అయిన iPhone SE 2020 ఫోన్ ను ఫ్లిప్‌కార్ట్ లో ప్రస్తుతం రూ.32,999 ధర వద్ద పొందవచ్చు. అంతే కాకుండా ఎక్సచేంజ్ ఆఫర్ కింద ఫ్లిప్‌కార్ట్ లో రూ.9,501 నుంచి రూ.13,200 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. నో-కాస్ట్ EMI ఆఫర్ కింద నెలకు రూ.6,500 ధరతో కొనుగోలు చేయవచ్చు.

Realme స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ ఆఫర్లు

Realme స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ ఆఫర్లు

ఇండియాలో కొంత మంది Realme స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్న వారికి కొన్ని బంపర్ ఆఫర్లు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన ఫోన్ల మీద దాదాపుగా రూ.4,000 వరకు తగ్గింపును అందిస్తున్నాయి. రూ .27,999 ధర వద్ద విడుదలైన రియల్‌మి X3 సూపర్‌జూమ్ ను ఇప్పుడు రూ.23,999 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు.

Samsung Galaxy స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ ఆఫర్లు

Samsung Galaxy స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ లో ప్రస్తుతం నిర్వహిస్తున్న మొబైల్ ఇయర్ ఎండ్ అమ్మకంలో శామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ల మీద 25% వరకు తగ్గింపును అందిస్తున్నది. శాంసంగ్‌ exynos‌ 9825 ప్రాసెసర్‌, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌, ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్ 2.0, సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో గేమింగ్ కోసం అనుకూలమైన శామ్‌సంగ్ ‌ఫోన్‌లమీద కూడా అద్భుతమైన డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

ఇతర స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ ఆఫర్లు

ఇతర స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ఇయర్ ఎండ్ అమ్మకంలో బడ్జెట్ ధరలో లభించే Mi, పోకో, మోటరోలా, వివో సంస్థల స్మార్ట్‌ఫోన్‌ల మీద అద్భుతమైన తగ్గింపులతో పాటుగా నో-కాస్ట్ EMI ఆఫర్లు రూ.2,500 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా అందిస్తున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Mobile's Year End Sale 2020: Get Discounts on These Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X