దూసుకెళ్తున్న ఫ్లిప్ కార్ట్ ,పేటిఎం

By Hazarath
|

ఆన్ లైన్ ప్రపంచంలో షాపింగ్ చేసేవారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. బయటికెళ్లి షాపింగ్ చేసేదానిక్నా ఇంట్లోనే కంప్యూటర్ ముందు కూర్చుని అయిదే నిమిషాల్లో షాపింగ్ చేయవచ్చు. అందుకనే మన దేశంలో ఈ కామర్స్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు చిన్న చిన్న స్టోర్ల వ్యాపారులు సైతం ఆ ఆన్ లైన్ బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. చిన్నా చితకా వెబ్ సైట్లతో అమ్మకాలు సాగిస్తూ లాభాలభాటలో పయనిస్తున్నారు. ఈ క్రమంలో 2015వ సంవతస్రంలో స్మార్ట్ పోన్ యాప్స్ ద్వారా రీటెయిల్ రంగంలో దూసుకుపోతున్న కంపెనీల లిస్ట్ బయటకొచ్చింది.

Read more: మళ్లీ వార్తల్లోకెక్కిన బాహుబలి

 1. ఫ్లిప్‌కార్ట్

1. ఫ్లిప్‌కార్ట్

బెంగుళూరులో ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ఉంది. 2007లో ప్రారంభమైంది. 33వేల మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. సంవత్సరాదాయం దాదాపు 1 బిలియన్ యూఎస్ డాలర్లు. 2015లో ఈ కంపెనీ రిటెయిల్ యాప్ అగ్రస్థానంలో దూసుకుపోతోంది.

2. పేటీఎం

2. పేటీఎం

నోయిడాలో ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ఉంది. 2010లో ప్రారంభమైంది. 2014లో ఈ-కామర్స్ రంగంలోకి ప్రవేశించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ ప్లాట్‌ఫాంలపై కలిపి మొత్తం దాదాపుగా 2.50 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. 2015లో టాప్ రిటెయిల్ యాప్స్‌లో ఇది 2వ స్థానంలో ఉంది.

3. అమెజాన్

3. అమెజాన్

అమెరికాకు చెందిన అమెజాన్ కంపెనీ రిటెయిల్ యాప్‌కు భారత్‌లో 2015లో 3వ స్థానం లభించింది. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉంది. సంవత్సరాదాయం దాదాపు 88 బిలియన్ల యూఎస్ డాలర్లు. 2.22 లక్షల మంది ఉద్యోగులు ఇందులో ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్నారు.

4. స్నాప్‌డీల్...

4. స్నాప్‌డీల్...

స్నాప్‌డీల్ రిటెయిల్ యాప్‌కు ఈ ఏడాది 4వ స్థానం దక్కింది. 2010లో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. 5వేల మందికి పైగా ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. సంవత్సరాదాయం దాదాపు 300 మిలియన్ యూఎస్ డాలర్లు.

5. మింత్రా...

5. మింత్రా...

ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మింత్రా రిటెయిల్ యాప్ ఈ ఏడాది 5వ స్థానంలో కొనసాగుతోంది. ఫ్యాషన్ రంగానికి చెందిన ఉత్పత్తులను వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అమ్మడంలో ఈ కంపెనీ పేరుగాంచింది. ఈ సంస్థ కేవలం మొబైల్ యాప్ ద్వారానే అధిక శాతం అమ్మకాలను చేపడుతోంది.

6. జబాంగ్

6. జబాంగ్

జబాంగ్ రీటెయిల్ యాప్ ఈ ఏడాది ఆరవస్థానంలో కొనసాగుతోంది. ముబైల్ ఆధారిత రీటెయిల్ రంగం ఇది. ఇది కూడా ఫ్యాషన్ అలాగే లైప్ స్టయిల్ కి సంబంధించిన ఉత్పత్తులను ఆన్ లైన్ ద్వారా అమ్ముతోంది. ప్రధాన కార్యాలయం గుర్ గాన్ లో ఉంది.

7. షాప్‌క్లూస్

7. షాప్‌క్లూస్

షాప్‌క్లూస్ రీటెయిల్ కంపెనీ కూడా ఆన్ లైన్ ద్వారా తన విక్రయాలను కొనసాగిస్తోంది. 7వ స్థానంలో దూసుకుపోతోంది. దీని ప్రధాన కార్యాలయం గుర్ గాన్ లో ఉంది. దీన్ని 2011లో సిలికాన్ వ్యాలీ లో స్థాపించారు.

8. వూనిక్

8. వూనిక్

వూనిక్ కంపెనీ కూడా రీటెయిల్ రంగంలో దూసుకుపోతోంది. ఇది లైప్ స్టయిల్ కి సంబంధించినది . మొబైల్ ద్వారా తన కార్యకలాపాలను సాగిస్తోంది.

9. లైమ్‌రోడ్

9. లైమ్‌రోడ్

లైమ్‌రోడ్ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే చెందిన వెబ్ సైట్ . వారికి వావలిసిన అన్ని రకాల మెటిరీయిల్స్ ఈ కంపెనీ ఆన్ లైన్ లో అమ్ముతోంది. దీని ప్రధాన కార్యాలయం గుర్ గాన్ లో ఉంది.

10. యెప్‌మీ

10. యెప్‌మీ

యెప్‌మీ అనేది గార్మెంట్స్ కు సంబంధించిన వెబ్ సైట్ . మెన్స్ కు అలాగే లేడీస్ కు కావలిసిన అన్ని రకాల గార్మెంట్స్ ఈ ఆన్ లైన్ వెబ్ సైట్ లో లభిస్తాయి. ప్రధాన కార్యాలయం గుర్ గాన్ లో ఉంది.

Best Mobiles in India

Read more about:
English summary
Here Write Flipkart, PayTM Most Downloaded Retail Apps In India, Amazon And Snapdeal Follow

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X