మళ్లీ వార్తల్లోకెక్కిన బాహుబలి

Written By:

2015లో బాక్సీఫీస్ ను బద్దలు గొట్టిన చిత్రాలు అనేకం ఉన్నాయి. అయితే వాటికోసం గూగుల్లో చాలామందే వెతికిఉంటారు కదా..మరి ఏ సినిమా కోసం గూగుల్లో ఎక్కువగా శోధించారు. ఏ సినిమా గూగుల్ సెర్చ్ లో అత్యధిక మార్కులు కొట్టింది. ఇలాంటి ఆసక్తికర విషయాలతో గూగుల్ 2015కి సంబంధించి టాప్ టెన్ మూవీస్ ని రిలీజ్ చేసింది. అందులో సంచలన తెలుగు దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. గూగుల్ సెర్చ్ లో నెటిజన్లు వెతికిన టాప్ టెన్ మూవీస్ ఏంటో ఓ సారి చూద్దాం.

Read more: సన్నీలియోన్ ఫస్ట్.. మోడీ లాస్ట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బాహుబలి (Bahubali)

ఫ్లాపన్నదే లేని దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఫాంటసీ మూవీ బాహుబలి. ప్రభాస్ ,తమన్నా ,రాణా ,రమ్యకృష్ణ తారాగణంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది .ఇప్పుడు గూగుల్ ని షేక్ చేసింది. ఇప్పటివరకు ఏ సినిమాకూడా అందుకోని రికార్డ్ ని బాహుబలి సినిమా సాధించింది. భారత చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఉన్న అమీర్ ఖాన్ పీకె సినిమా రికార్డ్ ని తుడిచేసింది.

భజరంగీ భాయ్ జాన్ (Bajrangi Bhaijaan)

సల్మాన్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటించిన చిత్రం 'భజరంగీ భాయ్‌ జాన్‌. ఈ చిత్రానికి మన తెలుగువాడు విజయేంద్రప్రసాద్ స్టార్ రైటర్ గా బాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ఓ పాకిస్తాన్ అమ్మాయి చుట్టూ తిరిగే కథతో దర్శకుడు కబీర్ ఖాన్ అద్భుతంగా తెరకెక్కించాడు.

ప్రేమ్ రతన్ ధన్ పాయో (Prem Ratan Dhan Payo)

సూరజ్ దర్శకత్వంలో వచ్చిన ఓ రోమాంటిక్ డ్రామ సినిమా ఇది. సల్మాన్ ఖాన్ ,సోనమ్ కపూర్ లు ప్రధాన పాత్రలుగా వచ్చిన ఈ సినిమా కూడా గూగుల్ ట్రెండింగ్ మూవీస్ లో చోటు సంపాదించింది.

ఎబిసిబి 2 (ABCD 2)

రెమో డిసౌజా ఈ చిత్రానికి దర్శకుడు. ఇదొక ఇండియన్ 3డీ డ్యాన్స్ మూవీ. ప్రభుదేవా , వరున్ ధావన్,శ్రధ్ధాకపూర్ హీరో హీరోయిన్లు. ఇది కూడా గూగుల్ ట్రెండింగ్ మూవీస్ లో చోటు సంపాదించింది.

ఐ ( I )

సంచలన దర్శకుడు శంకర్, విలక్షణ నటుడు విక్రమ్ కాంబినేషన్ లో చాలా కాలం తర్వాత భారీ బడ్జెట్ తో వచ్చిన 'చిత్రం ఐ'. అదిరిపోయో గ్రాఫిక్స్ తో విక్రమ్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్లిన మూవీ ఇది. ఈ చిత్రం సార్టయినప్పటినుంచే గూగుల్ లో దీనికోసం అనేకమంది వెతికారు.

పీకె ( PK )

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే కనీ వినీ ఎరగనంతగా ఓ బాలీవుడ్ చిత్రం అత్యధిక కలెక్షన్స్ ని బాక్సాపీస్ వద్ద నమోదుచేసుకుంది. అయితే బాహుబలి రాకతో ఈ రికార్డుకు బ్రేక్ పడింది. అమీర్ ఖాన్ అధ్బుత నటన సినిమాకు ప్రాణంగా నిలిచింది. అయితే ఈ సినిమా ఆద్యంతం వివాదాలతో నడిచింది.

పులి ( Puli)

తమిళంలో వచ్చిన చిత్రం. త‌మిళ స్టార్ హీరోల్లో ఒక‌రైన విజ‌య్ .. డైరెక్ష‌న్ శింబు దేవ‌న్ తో కలిసి చేసిన సోషియో ఫాంటసి చిత్రం పులి. సినిమా మొదలైనప్పటి నుంచే దీని భారీ అంచనాలు పెరుగుతూ వచ్చాయి. కాని సినిమా నిరాశపరిచింది. గూగుల్ ట్రెండింగ్ మూవీస్ లో ఈ సినిమా సైతం చోటు సంపాదించింది.

రోయ్ ( Roy )

ఇండియన్ రోమాంటిక్ ఫిలిం ఇది. విక్రమ్ జిత్ సింంగ్ దర్శకత్వంలో అర్జున్ రాంపాల్, రణబీర్ కపూర్ ,అనుపమ్ ఖేర్ లు ప్రధాన తారాగనంగా వచ్చిన చిత్రం. ఈ చిత్రం గూగుల్ ట్రెండింగ్ మూవీస్ లో చోటు సంపాందించింది.

హమారీ అదురి కహానీ ( Hamari Adhuri Kahani )

మోహిత్ సూరి దర్శకత్వంలో ఇమ్రాన్ హష్మీ హీరోగా విద్యాబాలన్ అందాలు ఆరబోసిన మరో బాలీవుడ్ మూవీ.ఈ చిత్రం కన్నా విద్యాబాలన్ గురించే ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేసి ఉంటారని టాక్

శ్రీమంతుడు ( Srimanthudu )

పల్లెమీద కోపంతో పట్టణానికి వలసొచ్చి ఆగర్భ శ్రీమంతుడిగా ఎదిగిన తండ్రి. పల్లెలో తన మూలాలు వెతుక్కునేందుకు పట్టణం వదిలిపెట్టిన కొడుకు. ఈ రెండు జీవితాల మధ్య సామాజిక లింకు -ఊరు దత్తత. సింపుల్‌గా శ్రీమంతుడు సినిమా ఇది.కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు అందాల బ్యూటీ శృతి నటించిని చిత్రం. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది. గూగుల్ ట్రెండ్ లో చోటు సంపాదించింది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Google Top 10 Trending Movies of 2015 in india
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot