Home
News

SASA LELE ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక సేల్‌ తేదీలు వెల్లడి.. బ్యాంకు ఆఫర్లు సహా పూర్తి వివరాలు..!

ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్ ఇటీవల గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ తేదీలను ప్రకటించింది. మే 1 నుంచి ఈ సేల్‌ ప్రారంభం కానుంది. అయితే మరో ప్రముఖ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కూడా త్వరలో ప్రత్యేక సేల్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ల నుంచి గృహోపకరణాలను వరకు అనేక వస్తువులను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌ మే 2 వ తేదీ నుంచి SASA LELE సేల్‌ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌ మెంబర్లు ఒక్కరోజు ముందుగానే సేల్‌లో పాల్గొనవచ్చు. అంటే మే 1 నుంచే డిస్కౌంట్‌ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ సమ్మర్‌ సేల్‌లో భాగంగా SBI క్రెడిట్‌ కార్డు ద్వారా మరింత అదనపు డిస్కౌంట్‌లను పొందవచ్చు.

Flipkart SASA LELE sale

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో (Flipkart SASA LELE Sale) భాగంగా SBI క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసే కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు నో కాస్ట్ EMI, ఎక్స్ఛంజీ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ సేల్‌లో భాగంగా ఒకటి కొంటే మరొకటి ఉచితం, డీల్‌ ఆ‌ఫ్ ది సేల్‌, న్యూ సేల్‌ వంటి అనేక ప్రయోజనాలను పొందవచ్చని తెలుస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ SASA LELE సేల్‌లో భాగంగా ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందించనున్నట్లు తెలిపింది. ఐఫోన్‌ 16e, ఐఫోన్ 16, ఐఫోన్‌ 14 సిరీస్‌ పైన మరింత తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు శాంసంగ్‌, LG, వోల్టాస్‌, బ్లూ స్టార్‌ సహా అనేక బ్రాండ్‌ల AC లపై భారీ తగ్గింపును పొందవచ్చని తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

అమెజాన్ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ 2025 మే 1 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లు 12 గంటల ముందుగానే సేల్‌లో పాల్గొనవచ్చు. మే 1 తేదీ 12AM నుంచే అమెజాన్‌ నుంచి షాపింగ్‌ చేయవచ్చు. HDFC బ్యాంకు క్రెడిట్‌ కార్డు, EMI ట్రాన్సాక్షన్‌లపై కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

దీంతోపాటు అమెజాన్‌ పే ICICI క్రెడిట్‌ కార్డు యూజర్లు 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అమెజాన్ గిఫ్ట్‌ కార్డుల ద్వారా డిస్కౌంట్‌లను పొందవచ్చు. స్మా‌ర్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌, ఇయర్‌బడ్స్‌, స్మార్ట్‌టీవీలు, మొబైల్‌ యాక్సెసరీస్‌లను భారీ డిస్కౌంట్‌ ధరకు సొంతం చేసుకోవచ్చు.

అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ 2025 లో భాగంగా ఐఫోన్ 15, శాంసంగ్‌ గెలాక్సీ S24 అల్ట్రా 5G, వన్‌ప్లస్‌ 13R, ఏసర్‌ ఏస్పైర్‌ లైట్ రైజన్‌ 3 ల్యాప్‌టాప్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు శాంసంగ్‌ 396 లీటర్‌ సామర్థ్యం కలిగిన 3 స్టార్‌ రిఫ్రిజిరేటర్‌ను తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. వీటితోపాటు అనేక ఫ్యాషన్‌ ఉత్పత్తులపైనా భారీ తగ్గింపును పొందవచ్చని అమెజాన్‌ చెబుతోంది.

అమెజాన్‌ సేల్‌లో భాగంగా మొబైల్స్‌, విడిభాగాలపై గరిష్ఠంగా 40 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే విధంగా గృహోపకరణాలపై గరిష్ఠంగా 65 శాతం వరకు తగ్గింపు ను పొందవచ్చని అమెజాన్‌ చెబుతోంది. ట్రావెల్‌ బుకింగ్స్‌ పైనా గరిష్ఠంగా 40 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Flipkart SASA LELE sale to start from may 2 2025 for all users in india here are the best deals
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X