Home
News

Flipkart Smartphone Carnival Sale:ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీద ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు తన ప్లాట్‌ఫామ్‌లో కొత్తగా మరొక సేల్ ను ప్రకటించింది. 'ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌ కార్నివాల్' పేరుతో ఈ రోజు ప్రారంభం అయిన ఈ అమ్మకం మార్చి 12 వరకు అందుబాటులో ఉండనున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ అమ్మకంలో అనేక స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు మీద అద్బుతమైన ఆఫర్లను అందిస్తున్నది. ఆన్‌లైన్ పద్దతిలో ఇటీవల విడుదల అయిన స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గొప్ప సువర్ణ అవకాశం. ఇటీవల ఇండియాలో విడుదల అయిన రియల్‌మి నార్జో 30 సిరీస్ మరియు పోకో బ్రాండ్ ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు అద్బుతమైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌ కార్నివాల్ సేల్ డిస్కౌంట్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌ కార్నివాల్ సేల్ డిస్కౌంట్ ఆఫర్స్

నేడు అంటే మార్చి 8 న మొదలై మార్చి 12 వరకు జరిగే ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌ కార్నివాల్ అమ్మకంలో రియల్‌మి, పోకో మరియు సాంసంగ్ బ్రాండ్ యొక్క ఫోన్‌లు తక్కువ ధర లేబుల్‌లను కలిగి ఉండడమే కాకుండా వాటి కొనుగోలు మీద నో-కాస్ట్ EMI, ఎక్సచేంజ్, మొబైల్ ప్రొటెక్షన్ మరియు మరిన్ని డిస్కౌంట్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. అదనంగా ఈ ఫ్లిప్‌కార్ట్ కొత్త అమ్మకంలో యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు రూ.1250 వరకు అంటే 10% వరకు అదనపు డిస్కౌంట్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

రియల్‌మి, పోకో స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ సేల్ తగ్గింపు ఆఫర్స్

రియల్‌మి, పోకో స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ సేల్ తగ్గింపు ఆఫర్స్

ఇండియాలో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌ కార్నివాల్ అమ్మకంలో ఇటీవల విడుదల అయిన రియల్‌మి మరియు పోకో ‌ఫోన్‌లను అద్బుతమైన తగ్గింపు ఆఫర్లతో పొందవచ్చు. పోకో C3 ను రూ.6,999 తక్కువ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే పోకో X3 ని రూ.500 తగ్గింపు అందుకున్న తరువాత ఇప్పుడు రూ.15,499 ధర వద్ద పొందవచ్చు. అలాగే పోకో M3 కూడా ప్రస్తుత అమ్మకంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. రియల్‌మి సంస్థ యొక్క కొత్త ఫోన్లు నార్జో 30 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా కొనుగోలు చేయవచ్చు. అలాగే రియల్‌మి C12, C15, 7, X75G, X7 pro 5G స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీద యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులు రూ.1250 వరకు తగ్గింపును పొందవచ్చు.

రియల్‌మి నార్జో 30 ప్రో 5G మీడియాటెక్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 30 ప్రో 5G మీడియాటెక్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 30 ప్రో 5G యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 మరియు రియల్‌మి యుఐతో రన్ అవుతుంది. ఇది 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 కారక నిష్పత్తి మరియు 120HZ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800 U Socను 8GB వరకు ఎల్‌పిడిడిఆర్ 4X ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.8 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌తో వస్తుంది.

పోకో C3 G80 SoC సాఫ్ట్‌వేర్

పోకో C3 G80 SoC సాఫ్ట్‌వేర్

పోకో C3 స్మార్ట్‌ఫోన్‌ 6.53-అంగుళాల LCD డిస్‌ప్లేను 60HZ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో G80 SoC మరియు అడ్రినో 618 GPUతో రన్ అవుతూ 6GB ర్యామ్ మరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజీతో జతచేయబడి వస్తుంది. ఈ ఫోన్ యొక్క సాఫ్ట్‌వేర్ అప్ డేట్ల విషయానికి వస్తే పోకో కొత్త కొత్త అప్ డేట్ లను అందిస్తుంది. ఫోన్ యొక్క ముందు భాగంలో పంచ్-హోల్ సెటప్ లోపల 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇందులో గల సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా సులభంగా ఫోన్ ను అన్ లాక్ చేయవచ్చు. మెరుగైన గేమింగ్ పనితీరును అందించడానికి పోకో హైపర్‌ఇంజైన్ గేమింగ్ టెక్నాలజీని జోడించింది. ఫీచర్‌లో భాగంగా డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, డ్యూయల్ VoLTE మరియు డ్యూయల్ VoWiFi ని కలిగి ఉంది.

పోకో M3 రియర్ కెమెరా ఫీచర్స్

పోకో M3 రియర్ కెమెరా ఫీచర్స్

పోకో M3 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.79 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ కెమెరాను కలిగి ఉండగా. కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.4 మాక్రో లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.05 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

రియల్‌మి X7 50W ఫాస్ట్ ఛార్జింగ్‌ స్పెసిఫికేషన్స్

రియల్‌మి X7 50W ఫాస్ట్ ఛార్జింగ్‌ స్పెసిఫికేషన్స్

రియల్‌మి X7 స్మార్ట్ ఫోన్ 6.4-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 2400 × 1080 పిక్సెల్‌ రిజల్యూషన్‌ మరియు 60Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. ఇది ARM మాలి- G57 MC3 GPU తో జత చేసిన డైమెన్సిటీ 800U 5G ప్రాసెసర్‌తో రన్ అవుతూ 6GB/ 8GB ర్యామ్‌తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జతచేయబడి వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 పై మరియు రియల్‌మి UIతో రన్ అవుతూ 50W ఛార్జింగ్‌ మద్దతుతో కూడిన 4,310mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయంలో ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌ కెమెరాలు జత చేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో హోల్ పంచ్ కెమెరా మాడ్యూల్ లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Smartphone Carnival Sale Live: Unexpected Discount Offers on The Purchase of These New Launch Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X